![Tollywood Actress Chitra Shukla Baby Boy](/styles/webp/s3/article_images/2024/10/4/Chitra-Shukla-Baby-Boy.jpg.webp?itok=b3hMMbSd)
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన చిత్రా శుక్లా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. నాలుగు రోజుల క్రితం అంటే సెప్టెంబరు 30న రాత్రి 9:31 నిమిషాలకు బిడ్డ పుట్టాడని చెప్పారు. ఇదే ముహూర్తానికి తమకు పెళ్లి జరిగిందని, ఇప్పుడు బాబు పుట్టడం మరింత స్పెషల్ అని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
ఇండోర్‌కి చెందిన చిత్రా శుక్లా.. 2014 నుంచి సినిమాలు చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఈమె కెరీర్ మొదలైంది. 2017లో 'మా అబ్బాయి' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. అలా రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్, మస్తే షేడ్స్ ఉన్నాయిరా, కలియుగ పట్టణంలో అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/chitra-shukla-husband.jpg)
వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది డిసెంబరులో వైభవ్ ఉపాధ్యాయ అనే పోలీస్ అధికారిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మగబిడ్డని ప్రసవించింది. తన ఆనందాన్ని తెలియజేస్తూ కొడుకు ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు కూడా వాటిని చూసేయండి.
(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ)
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/chitra-shukla-.jpg)
Comments
Please login to add a commentAdd a comment