ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కలి'. ట్రైలర్‌తోనే కాస్త అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథ, కలి పురుషుడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీశారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
కథేంటి?
శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అమ్మాయిని ఇతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లుని ఎదురించి వచ్చి మరీ పెళ్లి చేసుకుంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మంచిగా బతికే శివరామ్.. కష్టాల పాలవుతాడు. ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. దీంతో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. అడిగిన ఫోన్ కొనివ్వలేదనో, లవర్ బ్రేకప్ చెప్పిందనో ప్రతి చిన్న విషయానికి చాలామంది తమ ప్రాణాల్ని చిన్న వయసులోనే తీసేసుకుంటున్నారు. అలా భార్య వదిలేసిందని, అందరూ మోసం చేశారని అనుకునే వ్యక్తి చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. సరిగ్గా ఆ టైంలో కలిపురుషుడు ఎంట్రీ ఇస్తే.. తర్వాత ఏం జరిగిందనేదే 'కలి' థీమ్.
ఆత్మహత్య సరైన పని కాదని ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. కానీ ఇందులో చెప్పిన, చూపించిన విధానం ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఎందుకంటే కలియుగాన్ని ఏలే కలి పురుషుడు భూమ్మీదకు రావడమేంటి? చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడమేంటి అనిపిస్తుంది గానీ చూస్తున్నంతసేపు భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
దేవుడు మనం ఎన్నాళ్లు బతకాలనేది నిర్ణయిస్తాడు. కానీ మనం ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనే పాయింట్‌ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో చెప్పడం బాగుంది. నిడివి కూడు కేవలం గంటన్నరే. ఇలా ప్లస్సలు ఉన్నట్లే మైనస్సులు కూడా ఉన్నాయి. సినిమా అంతా కూడా శివరామ్, కలి పాత్రల మధ్య తిరుగుతుంది. యుగాలు, చనిపోవాలనుకున్న వాడితో గేమ్ ఆడటం బాగున్నప్పటికీ పదే పదే ఒకే సన్నివేశాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఎవరెలా చేశారు?
శివరామ్ పాత్ర చేసిన ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ ఎమోషన్స్ బాగానే పలికించాడు. కలి పురుషుడిగా చేసిన నరేశ్ అగస్త్య సెటిల్డ్ యాక్టింగ్ చేశాడు. వేదగా చేసిన నేహాకృష్ణ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రధారులు అంతా ఓకే. టెక్నికల్ విషయానికొస్తే స్టోరీ మంచి ఐడియా. కమర్షియల్ అంశాలు అని కాకుండా దర్శకుడు శివ శేషు.. చెప్పాలనుకున్న విషయాన్ని ఫెర్ఫెక్ట్‌గా చెప్పాడు. సినిమాటోగ్రఫీ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి గానీ ఉన్నంతలో బాగా తీశారు. ఇక చివర్లో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు.
- రేటింగ్: 2.75/5
-చందు డొంకాన
(ఇదీ చదవండి: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment