
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, అనిత చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గీత సాక్షిగా..’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పుష్పక్, జేబీహెచ్‌ఆర్‌ఎన్‌కేఎల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్నారు.
గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అనే పాటను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పాట క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘గీత సాక్షిగా’. ఈ పాటకి రెహమాన్ సాహిత్యం అందించగా, సాహితీ చాగంటి పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ హనుమ నరిసేటి.
Comments
Please login to add a commentAdd a comment