Rupesh
-
షష్టిపూర్తి సినిమాని కుటుంబమంతా చూడాలి– రాజేంద్ర ప్రసాద్
‘‘మంచి కథతో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. మన ఇంట్లో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ చిత్రం చెబుతుంది. అందుకే అందరూ కుటుంబంతో సహా థియేటర్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలి’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ కోరారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. బుధవారం జరిగిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ తర్వాత నేను చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనుకోవాలి. ‘షష్టిపూర్తి’ లాంటి అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్. ‘లేడీస్ టైలర్’ తర్వాత అర్చన, నేను మళ్లీ నటించిన ‘షష్టిపూర్తి’లో మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి’’ అని చెప్పారు. అర్చన మాట్లాడుతూ–‘‘చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ‘షష్టిపూర్తి’ ద్వారా నాకు ఇంత గొప్ప స్వాగతం పలికిన అందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘నా మొదటి సినిమా ఇది. అందరూ ఆదరించాలి’’ అన్నారు రూపేష్. పవన్ ప్రభ మాట్లాడుతూ–‘‘నాకు ఇంతమంచి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రూపేష్‌గారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలి’’ అని ఆకాంక్షా సింగ్ అన్నారు. -
నిషేధిత డ్రగ్ తయారీ ముఠా గుట్టురట్టు
జిన్నారం (పటాన్చెరు): టీఎస్ న్యాబ్, జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. గుమ్మడిదలకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌గౌడ్, అనంతారానికి చెందిన సాయికుమార్‌గౌడ్, వికారాబాద్ జిల్లా పంచలింగాలకు చెందిన క్యాసారం రాకేశ్‌లు నిషేధిత అ్రల్పాజోలం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. నలుగురూ కలిసి కొత్తపల్లి గ్రామ శివారులో ఓ కోళ్ల ఫారాన్ని లీజుకు తీసుకున్నారు. అక్కడ ఓ ప్రత్యేక గదిలో డ్రగ్‌ను తయారు చేసేందుకు రియాక్టర్‌తో సహా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసుకున్నారు. అంజిరెడ్డి బాలానగర్‌లో అ్రల్పాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు తీసుసురాగా రాకేశ్ డ్రగ్‌ను ప్రాసెస్‌ను చేసేవాడు. ఆరు నెలలుగా వీరి డ్రగ్ వ్యాపారం బాగానే నడిచింది.అయితే గ్రామ శివారులో వ్యర్థాల ఘాటు వాసనలు వెలువడటంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో టీఎస్ న్యాబ్, పోలీసులు సంయుక్తంగా డ్రగ్ కేంద్రంపై దాడులు జరిపి, రూ.40 లక్షల విలువైన 2.6 కిలోల అ్రల్పాజోలం, మరో రూ.60 లక్షల విలువైన ముడి పదార్థాలు, యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. రాకేశ్, అంజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సాయికుమార్‌గౌడ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నాడని ఎస్పీ రూపేశ్ తెలిపారు. సమావేశంలో న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ సంతోష్, పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, జిన్నారం సీఐ సు«దీర్ కుమార్, ఎస్ఐలు మహేశ్వర్‌రెడ్డి, విజయారావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
జిన్నారం (పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి శివారులో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లా ఎస్పీ రూపేశ్ కథ నం ప్రకారం.. కొడకంచి గ్రామానికి ఐదు కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కి సంబంధించిన 3.30 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ వాటర్ ప్లాంట్‌తో పాటు అదనంగా మూడు గదులు ఉన్నాయి. కొడకంచి గ్రామానికి చెందిన కిష్టంగారి శివకుమార్‌గౌడ్ అధీనంలో ఈ భూమి ఉంది. కాగా, ఓ రసాయన పరిశ్రమలో డ్రగ్గిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న పసుపులేటి మాణిక్యాల రావు అతని మిత్రులు గౌండ్ల శ్రీనివాస్‌గౌడ్, కిష్ణంగారి నిర్మల్‌గౌడ్, ఎండీ యూసుఫ్ తేలిగ్గా డబ్బులు సంపాదించే లక్ష్యంతో మాదకద్రవ్యాలను తయా రు చేయాలని నిర్ణయించారు. రసాయనాల తయా రీపై మాణిక్యాలరావుకు పట్టు ఉండటంతో గ్రామా నికి దూరంగా స్థలం ఉంటే బాగుంటుందని భావించారు. దీంతో శివకు మార్గౌడ్ను సంప్రదించి ఆయన అధీనంలోని భూమిని లీజుకు తీసుకున్నారు. అక్కడ ఉన్న మూడుగదుల్లో రూ.25 లక్షలు వెచ్చించి ఓ రియాక్టర్, కూలర్, డ్రయ్యర్‌తో పాటు ఇతర పరికరాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారీ ప్రారంభించారు. ఈ సమాచారం తెలుసుకున్న జిన్నారం పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారు లు డ్రగ్స్ తయారీ కేంద్రంపై గురువారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పాటు తయారీ మిషన్లను సీజ్ చేశారు. నిందితులు మాణిక్యా లరావు, శివశంకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నిర్మల్‌గౌడ్, ఎండీ యూ సుఫ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించారు. ఇందులో ప్రమేయం ఉన్న రాహుల్ రె డ్డి, శ్రీశైలంయాదవ్‌లు పరారీలో ఉన్నారు. వారి కో సం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని ఎస్పీ తెలిపారు. మాణిక్యాలరావు, ఎండీ యూసు ఫ్లు గతంలో కూడా డ్రగ్స్ కేసుల్లో శిక్షలు అనుభ వించారని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ శ్రీధర్, పటా న్చెరు డీఎస్పీ పురుషో త్తంరెడ్డి, సీఐ వేణు కుమార్, ఎస్ఐ విజ యారావు పాల్గొ న్నారు. -
అబ్బా ఓ అబ్బాయా..
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, అనిత చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గీత సాక్షిగా..’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పుష్పక్, జేబీహెచ్‌ఆర్‌ఎన్‌కేఎల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అనే పాటను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పాట క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘గీత సాక్షిగా’. ఈ పాటకి రెహమాన్ సాహిత్యం అందించగా, సాహితీ చాగంటి పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ హనుమ నరిసేటి. -
ట్రాఫిక్‌కు తాళ లేక..గుర్రంపై విధులకు ఇలా!
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్‌కు విసిగిపోయి గుర్రంపైనే కార్యాలయానికి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూపేశ్. మత్తికేరిలో నివాసముంటున్న ఆయన రోజూ ఇంటి నుంచి కార్యాలయానికి రానుపోను సుమారు పది కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. ఇందుకు ఆరు గంటలు పడుతోంది. దీంతో తన చివరి పనిదినమైన శుక్రవారం కాస్త భిన్నంగా ఆలోచించి ఇలా గుర్రంపైనే ఆఫీసుకు చేరుకున్నాడు. స్టార్టప్ స్థాపించాలనుకుంటున్న రూపేశ్ ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. -
సనావే థామస్–రూపేశ్ జంటకు టైటిల్
కొచ్చి: ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు డబుల్స్ విభాగంలో టైటిల్ లభించింది. ప్లస్ 35 వయో విభాగంలో సనావే థామస్–రూపేశ్ కుమార్ జంట విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన జేబీఎస్ విద్యాధర్ (హైదరాబాద్)–దిజు వలియవిటిల్ (కేరళ) జోడీతో జరిగిన ఫైనల్లో సనావే–రూపేశ్ ద్వయం 21–12తో తొలి గేమ్‌ను గెలిచి, రెండో గేమ్‌ను 17–21తో కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సనావే–రూపేశ్ జంట 9–7తో ఆధిక్యంలో ఉన్న దశలో విద్యాధర్–దిజు ద్వయం గాయం కారణంగా వైదొలిగింది. ప్లస్ 45 వయో విభాగం ఫైనల్లో శ్రీకాంత్–నవదీప్ జంట 18–21, 21–18, 15–21తో చట్‌చాయ్ బూన్మీ–విత్యా పొనోమ్చాయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. ప్లస్ 40 వయో సింగిల్స్ విభాగం ఫైనల్లో అనీష్ 4–21, 9–21తో హౌసెమరి ఫుజిమోటో చేతిలో ఓడిపోయాడు. -
'కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో మంచి ర్యాంక్'
-
రూపేశ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
హైదరాబాద్ : కాంగో జాతీయురాలు సిథియా హత్య కేసును మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు విచారించింది. అందులోభాగంగా పోలీసుల అభ్యర్థన మేరకు చిన్నారి సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని వైద్యాధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిందితుడు రూపేశ్‌ను విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. సానియా కేసు విచారణను తిరిగి జులై 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. -
సానియాను మాకు అప్పగించండి
పోలీస్‌స్టేషన్ ఎదుట సింథియా బంధువుల ఆందోళన శంషాబాద్ : కాంగో దేశానికి చెందిన సింథియా బంధువులు సానియాను తమకు అప్పగించాలని బుధవారం ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. సింథియాను అతి కిరాతకంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని దహనం చేసిన రూపేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె సోదరుడు డానీస్తోపాటు అతడి బంధువులు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అతడికి బెయిల్ కూడా మంజూరు చేయకూడదంటూ డిమాండ్ చేశారు. తన అక్కను హత్య చేసిన హంతకుడు భవిష్యత్తులో అతడి కూతురు సానియాను కూడా హతమారుస్తాడని ఆరోపించారు. సానియాను తమకు చూపించాలని, తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రూపేష్ తల్లి వద్దనున్న సానియాను ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి వారికి చూపించారు. సానియాను తిరిగి రూపేష్ తల్లి వద్దకు పోలీసులు చేర్చారు. పోలీసులు సముదాయించడంతో పోలీస్‌స్టేషన్ నుంచి మదన్‌పల్లిలో మృతదేహాన్ని తగులబెట్టిన స్థలానికి వెళ్లారు. -
‘సాక్షి’ ఐటీ ఏఈ రూపేష్ హఠాన్మరణం
నిజామాబాద్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ దినపత్రిక నిజామాబాద్ యూనిట్ కార్యాలయం ఐటీ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రూపేష్ (35) గుండెపోటుతో మరణించారు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న రూపేష్ .. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన సోదరుడు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రూపేష్ మరణ వార్తతో ‘సాక్షి’ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రూపేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తండ్రి అగ్నిమాపకశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. దీంతో కుటుంబ పోషణ అంతా రూపేష్ చూసుకునేవారు. ఆయన మరణంతో ఇప్పుడు ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.