రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత | Seizure of drugs worth Rs 3 crores | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

Published Sat, Dec 9 2023 4:40 AM | Last Updated on Sat, Dec 9 2023 4:40 AM

Seizure of drugs worth Rs 3 crores - Sakshi

జిన్నారం (పటాన్‌చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి శివారులో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లా ఎస్పీ రూపేశ్‌ కథ నం ప్రకారం.. కొడకంచి గ్రామానికి ఐదు కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కి సంబంధించిన 3.30 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ వాటర్‌ ప్లాంట్‌తో పాటు అదనంగా మూడు గదులు ఉన్నాయి. కొడకంచి గ్రామానికి చెందిన కిష్టంగారి శివకుమార్‌గౌడ్‌ అధీనంలో ఈ భూమి ఉంది.

కాగా, ఓ రసాయన పరిశ్రమలో డ్రగ్గిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న పసుపులేటి మాణిక్యాల రావు అతని మిత్రులు గౌండ్ల శ్రీనివాస్‌గౌడ్, కిష్ణంగారి నిర్మల్‌గౌడ్, ఎండీ యూసుఫ్‌ తేలిగ్గా డబ్బులు సంపాదించే లక్ష్యంతో మాదకద్రవ్యాలను తయా రు చేయాలని నిర్ణయించారు. రసాయనాల తయా రీపై మాణిక్యాలరావుకు పట్టు ఉండటంతో గ్రామా నికి దూరంగా స్థలం ఉంటే బాగుంటుందని భావించారు. దీంతో శివకు మార్‌గౌడ్‌ను సంప్రదించి ఆయన అధీనంలోని భూమిని లీజుకు తీసుకున్నారు.

అక్కడ ఉన్న మూడుగదుల్లో రూ.25 లక్షలు వెచ్చించి ఓ రియాక్టర్, కూలర్, డ్రయ్యర్‌తో పాటు ఇతర పరికరాలను ఏర్పాటు చేసి డ్రగ్స్‌ తయారీ ప్రారంభించారు. ఈ సమాచారం తెలుసుకున్న జిన్నారం పోలీసులు, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో అధికారు లు డ్రగ్స్‌ తయారీ కేంద్రంపై గురువారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పాటు తయారీ మిషన్‌లను సీజ్‌ చేశారు. నిందితులు మాణిక్యా లరావు, శివశంకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నిర్మల్‌గౌడ్, ఎండీ యూ సుఫ్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించారు.

ఇందులో ప్రమేయం ఉన్న రాహుల్‌ రె డ్డి, శ్రీశైలంయాదవ్‌లు పరారీలో ఉన్నారు. వారి కో సం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని ఎస్పీ తెలిపారు. మాణిక్యాలరావు, ఎండీ యూసు ఫ్‌లు గతంలో కూడా డ్రగ్స్‌ కేసుల్లో శిక్షలు అనుభ వించారని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో యాంటీ నార్కోటిక్‌ బ్యూరో డీఎస్పీ శ్రీధర్, పటా న్‌చెరు డీఎస్పీ పురుషో త్తంరెడ్డి, సీఐ వేణు కుమార్, ఎస్‌ఐ విజ యారావు పాల్గొ న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement