‘సాక్షి’ ఐటీ ఏఈ రూపేష్ హఠాన్మరణం | Sakshi employee Assistant engineer Rupesh died of heart attack | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఐటీ ఏఈ రూపేష్ హఠాన్మరణం

Published Mon, Mar 10 2014 1:48 AM | Last Updated on Wed, Oct 17 2018 6:14 PM

‘సాక్షి’ ఐటీ ఏఈ రూపేష్ హఠాన్మరణం - Sakshi

‘సాక్షి’ ఐటీ ఏఈ రూపేష్ హఠాన్మరణం

నిజామాబాద్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ దినపత్రిక నిజామాబాద్ యూనిట్ కార్యాలయం ఐటీ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రూపేష్ (35) గుండెపోటుతో మరణించారు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న రూపేష్   .. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన సోదరుడు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రూపేష్ మరణ వార్తతో ‘సాక్షి’ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.  రూపేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తండ్రి అగ్నిమాపకశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. దీంతో కుటుంబ పోషణ అంతా రూపేష్ చూసుకునేవారు. ఆయన మరణంతో ఇప్పుడు ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement