‘‘మంచి కథతో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. మన ఇంట్లో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ చిత్రం చెబుతుంది. అందుకే అందరూ కుటుంబంతో సహా థియేటర్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలి’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ కోరారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’.
పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. బుధవారం జరిగిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ తర్వాత నేను చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనుకోవాలి. ‘షష్టిపూర్తి’ లాంటి అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్. ‘లేడీస్ టైలర్’ తర్వాత అర్చన, నేను మళ్లీ నటించిన ‘షష్టిపూర్తి’లో మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి’’ అని చెప్పారు.
అర్చన మాట్లాడుతూ–‘‘చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ‘షష్టిపూర్తి’ ద్వారా నాకు ఇంత గొప్ప స్వాగతం పలికిన అందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘నా మొదటి సినిమా ఇది. అందరూ ఆదరించాలి’’ అన్నారు రూపేష్. పవన్ ప్రభ మాట్లాడుతూ–‘‘నాకు ఇంతమంచి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రూపేష్‌గారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలి’’ అని ఆకాంక్షా సింగ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment