Shashti Poorthi
-
సూపర్ హిట్ కాంబినేషన్.. 37 ఏళ్ల తర్వాత మళ్లీ!
1986లో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్ సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో ఆ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటించారు. ఈ సినిమాలో జంటగా నటించిన రాజేంద్రప్రసాద్, అర్చనల కెమిస్ట్రీని సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అయితే ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే మళ్లీ అదే జోడీ తెరపై సందడి చేయనుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకోబోతోంది ఈ జంట. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్ఠి పూర్తి’. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హీరోగా నటించడంతో పాటు రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాాగ చెన్నైలోని సంగీతదర్శకుడు ఇళయరాజా స్టూడియోస్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. తొలి సీన్‌కి ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాత ఆర్బి చౌదరి క్లాప్ ఇచ్చారు. రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..'లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్రప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్లో ‘ఆస్తులు అంతస్తులు, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అలాగే ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ మూవీ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. #LadiesTailor duo #RajendraPrasad & #Archana reunited after 37 years for the film #Shastipoorthi "Shoot starts this month and release in August “ says @ActorRupesh An #Ilaiyaraaja musical#RupeshKumarChaudhary @aakanksha_s30 #PavanPrabha #ThotaTharrani @BrindhaGopal1… pic.twitter.com/nCNwXPp0sz — Phani Kandukuri (@phanikandukuri1) April 1, 2023 -
వైరల్ : ఘనంగా సాయికుమార్ షష్టిపూర్తి వేడుకలు
Sai Kumar Shashti Poorthi : ప్రముఖ నటుడు సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సాయికుమార్ ఆ తర్వాత పలు సపోర్టింగ్ క్యారెక్టర్లతో మెప్పించారు. నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనూ ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్ భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, జీవిత రాజశేఖర్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సాయికుమార్ దంపతులకు అభినందనలు తెలియజేశారు. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికుమార్ హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే పోలీస్ స్టోరీలో ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం బుల్లితెరపై వ్యాఖ్యాతగా సత్తా చాటుతున్న సాయికుమార్ సినిమాల్లోనూ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
12న కైకాల సినీ షష్టిపూర్తి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘వంశీ ఇంటర్నేషనల్’ సంస్థ ఈ నెల 12న నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ సినీ షష్టిపూర్తి (1959–2019), కనకాభిషేక మహోత్సవం నిర్వహించనుంది. ‘‘కైకాల సినీ షష్టిపూర్తి (1959–2019), కనకాభిషేక మహోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, బి.గోపాల్, రేలంగి నరసింహారావు తదితర ప్రముఖులు పాల్గొంటారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 12 సాయంత్రం 5గంటలకు జరిగే ఈ వేడుకలో శివశంకరి గీతాంజలి సమర్పణలో సినీసంగీత విభావరి ఉంటుంది’’ అన్నారు ‘వంశీ’ వ్యవస్థాపకులు శిరోమణి డా. వంశీ రామరాజు. -
ఘనంగా రామేశ్వర్ రావు షష్టిపూర్తి
* దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ * హాజరైన వైఎస్సార్సీపీ అధినేత జగన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీప్రముఖులు శంషాబాద్ రూరల్: మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్రావు షష్టిపూర్తి బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలో శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడ్రోజులపాటు నిర్వహించిన ఈ వేడుక చివరి రోజున.. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై రామేశ్వర్రావు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చైనా పర్యటన ముగించుకుని రాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ అక్కడ్నుంచి నేరుగా శ్రీరామనగరం వచ్చారు. వేదికపై శ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశీస్సులు పొందారు. సుమారు అరగంటపాటు కేసీఆర్ ఇక్కడ గడిపారు. వేదిక వద్ద జగన్ ను కలిసిన చిరంజీవి కాసేపు ముచ్చటించారు. అంతకుముందు వేదికపై చినజీయర్‌స్వామి, శ్రీ అహోబిల జీయర్‌స్వామి జ్యోతి ప్రజల్వన చేసి రామేశ్వర్రావు దంపతులకు మంగళ శాసనాలు అందజేశారు. కార్యక్రమానికి రామోజీ గ్రూపు చైర్మన్ రామోజీరావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు జైపాల్‌రెడ్డి, చిరంజీవి దంపతులు, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టి.ప్రకాష్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రసమయి బాలకిషన్, రాంచంద్రారెడ్డి, రాజకీ య, సినీ ప్రముఖులు డి.శ్రీనివాస్, దగ్గుపాటి వెంకటేశ్వర్రావు, నాగం జనార్దన్‌రెడ్డి, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వడ్డె నవీన్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దంపతులు, కలెక్టర్ రఘునందన్‌రావు హాజరయ్యారు. రామేశ్వర్రావు షష్టి పూర్తి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభారాణి ఇక్కడి దివ్యసాకేతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకే ఇక్కడికి చేరుకున్న ఆమె.. కేసీఆర్ రాకముందే వెళ్లిపోయారు. చిరంజీవి దంపతులు కూడా దివ్యసాకేతాలయంలో పూజలు నిర్వహించారు.