12న కైకాల సినీ షష్టిపూర్తి | kaikala satyanarayana 60 years film industry | Sakshi
Sakshi News home page

12న కైకాల సినీ షష్టిపూర్తి

Published Fri, Feb 8 2019 3:46 AM | Last Updated on Fri, Feb 8 2019 3:46 AM

kaikala satyanarayana 60 years film industry - Sakshi

కైకాల సత్యనారాయణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘వంశీ ఇంటర్నేషనల్‌’ సంస్థ ఈ నెల 12న నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ సినీ షష్టిపూర్తి (1959–2019), కనకాభిషేక మహోత్సవం నిర్వహించనుంది. ‘‘కైకాల సినీ షష్టిపూర్తి (1959–2019), కనకాభిషేక మహోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నాం.

ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, బి.గోపాల్, రేలంగి నరసింహారావు తదితర ప్రముఖులు పాల్గొంటారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 12 సాయంత్రం 5గంటలకు జరిగే ఈ వేడుకలో శివశంకరి గీతాంజలి సమర్పణలో సినీసంగీత విభావరి ఉంటుంది’’  అన్నారు ‘వంశీ’ వ్యవస్థాపకులు శిరోమణి డా. వంశీ రామరాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement