శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్‌ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.
లంకలో ప్యారడైజ్
మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్‌ప్రాజెక్ట్స్‌కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.
ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్
ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.
దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్‌తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్‌కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది
ఆర్థిక అస్త్రంగా...
ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్‌లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్‌గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు
శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...
పచ్చందనమే...
పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment