Akanksha Singh
-
షష్టిపూర్తి సినిమాని కుటుంబమంతా చూడాలి– రాజేంద్ర ప్రసాద్
‘‘మంచి కథతో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. మన ఇంట్లో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ చిత్రం చెబుతుంది. అందుకే అందరూ కుటుంబంతో సహా థియేటర్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలి’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ కోరారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. బుధవారం జరిగిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ తర్వాత నేను చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనుకోవాలి. ‘షష్టిపూర్తి’ లాంటి అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్. ‘లేడీస్ టైలర్’ తర్వాత అర్చన, నేను మళ్లీ నటించిన ‘షష్టిపూర్తి’లో మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి’’ అని చెప్పారు. అర్చన మాట్లాడుతూ–‘‘చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ‘షష్టిపూర్తి’ ద్వారా నాకు ఇంత గొప్ప స్వాగతం పలికిన అందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘నా మొదటి సినిమా ఇది. అందరూ ఆదరించాలి’’ అన్నారు రూపేష్. పవన్ ప్రభ మాట్లాడుతూ–‘‘నాకు ఇంతమంచి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రూపేష్‌గారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలి’’ అని ఆకాంక్షా సింగ్ అన్నారు. -
సీరియల్ నటిగా సూపర్ హిట్.. కానీ సినిమాల్లోనే! ఆకాంక్ష సింగ్ బర్త్‌డే (ఫొటోలు)
-
రీల్స్‌తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. 'ఎస్కేప్ లైవ్' రివ్యూ
టైటిల్: ఎస్కేప్ లైవ్ (హిందీ వెబ్ సిరీస్) నటీనటులు: సిద్ధార్థ్, ఆకాంక్ష సింగ్, సుమేధ్ ముద్గాల్కర్, రిత్విక్ సాహోర్, ఆద్య శర్మ, ప్లబితా, రోహిత్ చందేల్, జావేద్ జాఫెరి తదితరులు దర్శకత్వం: సిద్ధార్థ్ కుమార్ తవారీ విడుదల తేది: మే 20 (7 ఎపిసోడ్స్) & మే 27 (2 ఎపిసోడ్స్) ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ టాలీవుడ్లో లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. 'బొమ్మరిల్లు'తో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత 'మహాసముద్రం' సినిమాతో అలరించాడు. ఈ యంగ్ హీరో తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఓటీటీ డెబ్యుగా వచ్చిన వెబ్ సిరీస్ ఎస్కేప్ లైవ్. సిద్ధార్థ్ కుమార్ తివారి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్ నిర్మించింది. మే 20న విడుదలైంది. రీల్స్, సోషల్ మీడియాతో వచ్చే డబ్బు కోసం యువత ఏం చేస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ 'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కృష్ణ స్వామి తల్లి, చెల్లితో కలిసి నివసిస్తాడు. తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను తీసుకుంటాడు. తన అర్హతకు తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో 'ఎస్కేప్ లైవ్' అనే వీడియో షేరింగ్ యాప్‌లో మోడరేటర్‌గా జాయిన్ అవుతాడు. ఎస్కేప్ లైవ్ యాప్ తన పాపులారిటీ పెంచుకునేందుకు ఒక కాంటెస్ట్ నిర్వహిస్తుంది. యాప్ యూజర్స్ వివిధ రకాల వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే వారికి డైమండ్స్ వస్తాయి. అవి క్యాష్ రూపంలో వారి అకౌంట్‌కు చేరతాయి. ఈ క్రమంలోనే ఒక డేట్ వరకు ఎక్కువ డైమండ్స్ గెలుచుకున్న వారికి రూ. 3 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటిస్తారు ఎస్కేప్ లైవ్ నిర్వాహకులు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న యాజర్స్ ఆ డబ్బు కోసం ఎంతకు తెగించారు ? యాప్ కాన్సెప్ట్ నచ్చని కృష్ణ ఏం చేశాడు ? ఆ సమయంలో కృష్ణ ఎదుర్కున్న పరిస్థితులు ఎంటీ ? అందులో పాల్గొన్న ఐదుగురు కంటెస్టెంట్లు చివరికి ఏమయ్యారు ? ఆ రూ. 3 కోట్లను ఎవరు గెలుచుకున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ప్రస్తుతం యూత్ ఫాలో అవుతున్న రీల్స్, టకా టక్, జోష్, మోజో, చింగారీ వంటితదితర యాప్స్ యూత్‌ను, పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ సిద్ధార్థ్ కుమార్ తివారీ. నిత్యం సమాజంలో చూసే అనేక విషయాలను సిరీస్ ద్వారా చూపించారు. సోషల్ మీడియాతో మనీ, ఫేమ్ సంపాదించుకోవాలనుకున్న యువత ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది ? చివరికీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు డైరెక్టర్. ఆయన అనుకున్నది ప్రేక్షకులకు చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా ఇందులో ఒక పాత్రలో కూడా నటించారు సిద్ధార్థ్ కుమార్ తివారీ. సిరీస్‌లోని 5 ప్రధాన పాత్రలు, వారి నేపథ్యాన్ని చూపిస్తూ ప్రారంభించారు. అది కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. కానీ కథ పరంగా అలా చూపించడం తప్పదు. ఇక ఎస్కేప్ లైవ్ యాప్ కాంటెస్ట్ కోసం ఐదుగురు చేసే ప్రయత్నాలు, వారి జీవిత కథలు ఆకట్టుకుంటాయి. యాప్ ఎదుగుదల కోసం కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయనే విషయాలు బాగా చూపించారు. సిరీస్‌లో అక్కడక్కడా వచ్చే అశ్లీల సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అవి రియల్ లైఫ్‌లో జరిగే సంఘటనలని ఒప్పుకోక తప్పదు. నైతికత విలువలతోపాటు జెండర్ వివక్షతను చూపించారు. మంచి థ్రిల్లింగ్‌గా సాగుతున్న స్టోరీలో అక్కడక్కడా కుటుంబంతో ఉన్న ప్రధాన పాత్రల సన్నివేశాలు (ఎపిసోడ్ 5) కొద్దిగా బోర్ కొట్టిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోపాటు అప్పుడప్పుడు వచ్చే పాటలు ఆకట్టుకున్నాయి. ఎవరెలా చేశారంటే? సిద్ధార్థ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన యువకుడిగా, యాప్ నిర్వాహకులు చేస్తున్న పని నచ్చని, దాన్ని ఆపాలనే సిటిజన్‌గా బాగా నటించాడు. అయితే మిగతా ఐదు ప్రధాన పాత్రలతో పోల్చుకుంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ డెప్త్ తక్కువగా అనిపిస్తుంది. తన సిస్టర్ బాయ్‌ఫ్రెండ్ విషయంలో సిద్ధార్థ్ చేసే పని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక మిగతా క్యారెక్టర్లైనా డ్యాన్స్ రాణి (బేబీ ఆద్య శర్మ), ఫెటీష్ గర్ల్ (ప్లబితా), ఆమ్చా స్పైడర్ (రిత్విక్ సాహోర్), రాజ్ కుమార్ రోహిత్ చందేల్ నటన సూపర్బ్‌గా ఉంది. ముఖ్యంగా ఆద్య శర్మ డ్యాన్స్‌లు బాగా ఆకట్టుకుంటాయి. ఇక సైకో వ్యక్తిగా డార్క్ ఏంజిల్ పాత్రలో సుమేధ్ ముద్గాల్కర్ అదరగొట్టాడు. సిరీస్‌కు అతడి యాక్టింగ్ హైలెట్ అని చెప్పవచ్చు. రాధా క్రిష్ణ సీరియల్లో కృష్ణుడిగా సుమేధ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇందులో రాధగా నటించిన మల్లికా సింగ్ కూడా సిద్ధార్థ్ చెల్లెలుగా శ్రీని పాత్రలో అలరించింది. పోలీస్ ఆఫిసర్‌గా ఆకాంక్ష సింగ్ పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఫైనల్‌గా సిరీస్ గురించి చెప్పాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోనైన సరే కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చివరి ఎపిసోడ్లో కొన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా రెండో సీజన్ కూడా వస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
వేగంగా పరిగెత్తమంటున్న ఆది.. అలరిస్తోన్న 'క్లాప్' ట్రైలర్
Aadhi Pinisetty Starrer Clap Movie Trailer Released: ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించగా.. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ మూవీకి ఇళయరాజా సంగీతమందించడం విశేషం. స్పోర్ట్స్ డ్రామాగా తెరెకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న క్లాప్ నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. పముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'మనం జీవితంలో ఓడిపోయేది ఎప్పుడో తెలుసా ? మన టాలెంట్ మీద మనకే నమ్మకం లేని ఆ క్షణం' అంటూ ప్రారంభమైన క్లాప్ ట్రైలర్ ఆద్యంతం అలరించింది. 'పరిగెత్తూ.. వేగంగా పరిగెత్తూ.. నువ్వు పోటీ చేసేది మనుషులతో కాదు టైమ్‌తో' అనే డైలాగ్ చివర్లో ఆకట్టుకునేలా ఉంది. భాగ్యలక్ష్మీ అనే యువతిని అథ్లేట్‌గా చేయడానికి ఆది పడిన కష్టమేంటీ అనేదే సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కోచ్‌గా ఆది అదిరిపోయే నటన కనబర్చి ఆకట్టుకున్నాడు. -
ఆ ట్విస్ట్ తెలిసి వావ్ అనుకున్నా!
‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం ప్రేక్షకులను నిరాశపరచలేదు. ‘క్లాప్’ టీజర్ చూస్తుంటే అథ్లెట్ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు హీరో చిరంజీవి. ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘క్లాప్’. ఐబీ కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, రాజశేఖర్ రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ‘క్లాప్’ సినిమా టీజర్‌ను చిరంజీవి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఆది పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుందనిపిస్తోంది. తన పాత్రలో ఉన్న ట్విస్ట్ తెలిసి ‘వావ్’ అనుకున్నాను. ఇళయరాజాగారు సంగీతం అందించిన ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. -
ఈ కథలో నేనే హీరో!
‘మళ్ళీరావా’ (2017), ‘దేవదాస్’ (2018) వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆకాంక్షా సింగ్ తాజాగా మరో తెలుగు సినిమా అంగీకరించారు. హీరో నాని తన సోదరి దీప్తీ ఘంటాని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’లో ఒక హీరోయిన్గా నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ యాంథాలజీలో ఐదు భాగాలు ఉంటాయి. ఒక్కో భాగం ఇరవై నిమిషాల పాటు ఉంటుంది. ఈ భాగాల్లోని ఒక దాంట్లో ఆకాంక్ష లీడ్ రోల్ చేస్తున్నారు. తన పాత్ర గురించి ఆకాంక్ష మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు చేయని పాత్రను చేస్తున్నాను. ఈ కథలో నేనే హీరో’’ అన్నారు. -
నేను చాలా లక్కీ
‘‘నా కల నెరవేరినట్లుగా అనిపిస్తోంది. ఇది నిజమేనా? అన్నంత ఉద్వేగంగా ఉంది’’ అన్నారు ఆకాంక్షా సింగ్. ఈ బ్యూటీ ఇంతగా ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ‘మే డే’ సినిమాలో అవకాశం దక్కడమే. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ దేవగణే దర్శకుడు. ఇందులో అజయ్ భార్య పాత్రలో నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘అమితాబ్ సార్, అజయ్ సార్ కాంబినేషన్ సినిమాలో నేను నటించడం ఆనందంగా ఉంది. పైగా ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన ముహూర్తపు సన్నివేశంలో నేను ఉండటం చాలా లక్కీ. నాది చాలా కీలక పాత్ర’’ అన్నారు. ‘మళ్ళీ రావా’ సినిమాతో తెలుగుకి పరిచయమైన ఆకాంక్షా సింగ్ ఆ తర్వాత నాగార్జున సరసన ‘దేవదాస్’లో నటించారు. -
నిరూపించుకునే అవకాశమివ్వండి
‘‘ఫలానా పాత్రను చేసే సామర్థ్యం నటిగా ఉన్నప్పటికీ కొన్ని సార్లు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల కుడా అవకాశాలు చేజారుతుంటాయి. కేవలం ‘అవుట్ సైడర్స్’ అనే కారణం వల్ల’’ అన్నారు ఆకాంక్షా సింగ్. ‘మళ్ళీ రావా’, ‘దేవదాస్’ వంటి తెలుగు సినిమాల్లో నటించారామె. ఇటీవలే కన్నడంలో సుదీప్తో ‘పెహల్వాన్’లోనూ కనిపించారు. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న నెపోటిజం, అవుట్ సైడర్స్ వాదనలో భాగంగా ఆకాంక్షా సింగ్ కూడా తన అభిప్రాయాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘‘కొన్నిసార్లు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా లీడ్ రోల్ లో కనిపించాలని ఉంటుంది, ఆ పాత్రకు మనం న్యాయం చేయగలం అనే నమ్మకం కూడా ఉంటుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల మనల్ని మనం నిరూపించుకోవడానికి వీలున్న అవకాశాలు రావు. అతిథి పాత్రకో, సహాయ నటి పాత్రలకో మాత్రమే మేం గుర్తొస్తాం. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, పెద్ద పెద్ద వాళ్ల తో పరిచయాలు లేకపోయినప్పటికీ అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. మీ సర్కిల్ (వారసులను ప్రోత్సహించేవారిని ఉద్దేశించి అయ్యుండొచ్చు) దాటి వస్తేనే వాళ్లు మీకు కనిపిస్తారు. ప్రస్తుతం చాలా మంది నటీనటులు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇదే. ఇక నటిగా నా గురించి చెప్పాలంటే.. మొదటి నుంచి కూడా నా టాలెంట్ మీద, నా మీద నాకు నమ్మకం ఎక్కువ. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఈ సందర్భంగా దర్శకులకు, నిర్మాత (హిందీ)లకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం (ప్రతిభను నిరూపించుకునే అవకాశం) ఇచ్చి చూడండి. నన్ను నేను నిరూపించుకుంటాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టితో ‘క్లాప్’ చిత్రంలో నటిస్తున్నారు ఆకాంక్షా సింగ్. -
పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు
‘‘నేను ఇప్పటివరకూ చేసినవి దాదాపు హోమ్లీ క్యారెక్టర్లే. అయితే ‘పహిల్వాన్’లో కొంచెం గ్లామరస్ రోల్ చేశా. హోమ్లీ రోల్సే కాదు.. ఏ పాత్ర అయినా చేస్తా’’ అన్నారు ఆకాంక్షా సింగ్. నాగార్జున సరసన ‘దేవదాస్’, సుమంత్‌తో ‘మళ్ళీరావా’, సుదీప్తో ‘పహిల్వాన్’ చిత్రాల్లో నటించిన ఆకాంక్షా సింగ్ చెప్పిన విశేషాలు. ► ‘మళ్ళీరావా’ నుంచి ‘పహిల్వాన్’ వరకూ నా సినిమాలను ప్రేక్షకులు ఆదిరించి, సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌లో ఎక్కువమంది హైదరాబాద్‌వారే కావడం హ్యాపీ జైపూర్‌లో పుట్టి పెరిగాను. తెలుగులో ఎక్కువ కాలం పని చేయాలని ఉంది. ‘బాహుబలి’లో అనుష్కగారి పాత్ర చూసి ‘దేవుడా.. ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఇవ్వు’ అనుకున్నా. ► పెళ్లి చేసుకున్నందు వల్ల నా కెరీర్‌కి ఇబ్బంది అనే ఆలోచనే లేదు. ఎంతో మంది పెళ్లి అయినా హీరోలుగానే చేస్తున్నారు.. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. అలాంటప్పుడు పెళ్లి వల్ల కెరీక్‌కి ఇబ్బంది అని హీరోయిన్లనే ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. సినిమా రంగంలోనే కాదు ఏ రంగంలోనూ పెళ్లి అనేది కెరీర్‌కి అడ్డంకి కాదు. నా భర్త కునాల్ నటుడు కాదు. నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాతే ఎక్కువగా పని చేస్తున్నా. దానికి కారణం ఆయన ప్రోత్సాహమే. ప్రస్తుతం తెలుగు, తమిళ ద్విభాషా సినిమాలో హాకీ ప్లేయర్ పాత్ర చేస్తున్నా. -
అథ్లెటిక్ నేపథ్యంలో...
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్లాప్’. ప్రిత్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, యం.రాజశేఖర్ రెడ్డి తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. రెండు విభిన్నమైన పాత్రల్లో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటను హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నాం. దినేశ్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్న ఈ స్పెష్ల్ సాంగ్‌లో మోనాల్ గజ్జర్ చిందేస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్. -
నా జీవితంలో ఈగను మర్చిపోలేను
‘‘ఒకప్పుడు సౌత్ ఫిల్మ్స్.. నార్త్ ఫిల్మ్స్ అని ఒక వ్యత్యాసం ఉండేది. కానీ ఈ రోజు నార్త్.. సౌత్ అనేది లేదు. మొత్తం ఇండియన్ ఫిల్మే అయ్యింది. అంటే ఎక్స్ఛేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అక్కడివాళ్లు ఇక్కడ, ఇక్కడివాళ్లు అక్కడ చేస్తున్నారు. ఇది శుభపరిణామం. తెలుగు సినిమాల డబ్బింగ్ రైట్స్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇలా అన్ని రాష్ట్రాల మధ్య సంబంధాలు ఒకేలా కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఎస్. కృష్ణ దర్శకత్వంలో సుదీప్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్’. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటించారు. స్వప్న కృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘జీవితంలో మనం అందరం మన కోసం సాధించుకుంటాం. కానీ దేశం కోసం సాధించిన సింధుగారిని అభినందించాలి. ఈ మధ్య భారతదేశం సాధించిన ఒక గొప్ప విజయం, విషయం ఏంటంటే చంద్రయాన్. ‘చంద్రయాన్’ అనే రాకెట్‌ని క్షక్ష్యలోకి ప్రవేశపెట్టి దేశం మొత్తం మనవైపు చూసేలా చేశారు. బ్యాడ్మింటన్ రాకెట్‌తో దేశం మొత్తం మనవైపు చూసేలా చేశారు సింధుగారు. ఇక కన్నడ ప్రజలు, తెలుగు ప్రజలు కవల పిల్లలులాంటివారు. తెలుగు పరిశ్రమకు కన్నడ రాష్ట్రం ఎంత సపోర్ట్ చేస్తుందో మాకు తెలుసు. తెలుగు సినిమాను కూడా కన్నడ సినిమాలానే ఫీల్ అవుతారు. మనవాళ్లు కూడా ఒక మంచి కన్నడ చిత్రం వచ్చిందంటే తెలుగు సినిమా కన్నా ఎక్కువగా నెత్తిన పెట్టుకుని చూస్తారు. దానికి ఉదాహరణ ‘కేజీఎఫ్’. అలాగే ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. సుదీప్ ఏ భాషలో నటించినా అక్కడి ప్రజల మనసును పరిపూర్ణంగా చూరగొనే ఆర్టిస్ట్. సుదీప్ ఆల్రెడీ సర్టిఫైడ్ హీరో. కానీ ఆయన ఆ బౌండరీలో లేడు. ఏ రాష్ట్రం వారు పిలిచినా ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందంటే ఆ రాష్ట్రానికి వెళతాడు. నటిస్తాడు. ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేసి వస్తాడు. ఈ సినిమా కోసం సుదీప్ బాడీ షేపప్ చేశాడు.. చాలా తగ్గాడు. అఫ్కోర్స్... మన ఇండియన్ హీరోలంతా అంతే. మన తెలుగు వాళ్లలో ఉదాహరణకు... ప్రభాస్, మహేశ్, చరణ్, తారక్.. ఇలా అందరూ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తగ్గుతారు. ఇప్పుడు బాలకృష్ణ 11 కేజీలు తగ్గారు. ‘సరైనోడు’ కోసం బన్నీ, ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్.. ఇలా ఎవరికి వారు డైరెక్టర్ని బాడీ ఎలా కావాలి? ఒక కథకు ఏం కావాలి? అని అడిగి తమను తాము మౌల్డ్ చేసుకుంటున్నారు. ఈ కోవలో సుదీప్ కూడా ఉన్నారు. సాయి కొర్రపాటిగారు మంచి మూవీ లవర్. మన సినిమాలను ఇతర భాషల్లో, ఇతర భాషల్లోని సినిమాలను మనకు చూపించాలని తాపత్రయపడుతుంటారు. అందుకు ఓ ఉదహరణ ఈ ‘పహిల్వాన్’ సినిమా. ఇంతకుముందు ఆయన తెలుగులో విడుదల చేసిన ‘కేజీఎఫ్’ చిత్రానికి మంచి రెవెన్యూ వచ్చింది. ‘పహిల్వాన్’ కూడా అంత మంచి సినిమా అవ్వాలి. దర్శకుడు కృష్ణగారు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. సింధు గోల్డ్ మెడల్ కొట్టినట్లే ఈ సినిమా కూడా అంతటి స్థాయిలోకి వెళ్లాలి’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమాలు చాలామందికి స్ఫూర్తిని ఇస్తాయి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. ట్రైలర్ చూశాను. సుదీప్‌గారు చాలా కష్టపడ్డారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనపై నమ్మకం ఉంచి ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. కష్టపడితేనే పైకి రాగలం. ముందు ముందు దేశానికి ఇంకా మంచి పేరు తీసుకురావడానికి కష్టపడతాను. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వేదికపై ఉండటం హ్యాపీ. ‘పహిల్వాన్’ సినిమా చూడండి’’ అన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ‘‘ఈ వేదికపై సింధుగారు ఉండటం మాకు చాలా గౌరవంగా ఉంది. సింధుని ఇండియాకి ఇచ్చిన ఆమె తల్లిదండ్రులకు థ్యాంక్స్. వేదికలపై నేను అంతగా మాట్లాడలేను. నెక్ట్స్ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతాను. గ్రామర్ తప్పులు లేకుండా మాట్లాడతాను. తెలుగు ప్రేక్షకులు నాకు చాలా గౌరవాన్ని, ప్రేమను అందిస్తున్నారు. నా జీవితంలో ‘ఈగ’ చిత్రాన్ని, రాజమౌళిగారిని, తెలుగు ప్రేక్షకులను మర్చిపోలేను. నిర్మాత సాయిగారు నాకు వెరీ స్పెషల్. మంచి మానవతావాది ఆయన. నన్ను అభినందించిన బోయపాటిగారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం దర్శకుడు కృష్ణ నిర్మాతగా మారారు. చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను. భవిష్యత్‌లో సింధు మేడమ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుదీప్. ‘‘పహిల్వాన్’ సినిమాతో హైదరాబాద్‌కు స్పెషల్ కనెక్షన్ ఉంది. సినిమా చిత్రీకరణ ఇక్కడే మొదలైంది. మేజర్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరిగింది. ఈ సినిమాను తెలుగులో ఈ స్థాయిలో విడుదల చేస్తున్న సాయిగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు కృష్ణ. ‘‘ఈ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అన్నారు’’ చాముండేశ్వరీనాథ్. ‘‘తెలుగు రాష్ట్రాల్లో సుదీప్‌గారికి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించిన ప్రతి తెలుగు చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్. ‘పహిల్వాన్’ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. బ్రహ్మాండమైన ఆల్బమ్ కుదరింది. ఈ చిత్రం ద్వారా అర్జున్ జన్యలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు రామజోగయ్య శాస్త్ర్రి. ‘‘ఈ సినిమాలో రుక్మిణి పాత్ర చేశాను. నాది రొటీన్ హీరోయిన్ పాత్ర కాదు’’ అన్నారు ఆకాంక్షా సింగ్. కబీర్ దుహాన్ సింగ్, కార్తీక్, రామారావు, సాయి కొర్రపాటి తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు
‘బలం ఉందన ్న అహంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’ అనే డైలాగులతో ప్రారంభమైన ‘పహిల్వాన్’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ‘ఈగ’ ఫేమ్ సుదీప్ హీరోగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్’. ఈ సినిమాను అదే పేరుతో వారాహి చలన చిత్రం తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. సెప్టెంబర్ 12న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపిస్తారు. చిరంజీవిగారు ఇటీవల విడుదల చేసిన ‘పహిల్వాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. గురువారం విడుదలైన ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. ‘‘కె.జి.యఫ్’ని తెలుగులో రిలీజ్ చేసి ఘనవిజయం అందుకున్న వారాహి చలన చిత్రం సంస్థ ఇప్పుడు ‘పహిల్వాన్’ను ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటించారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: కరుణాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. దేవరాజ్. -
‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’
సాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుధీప్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం పహిల్వాన్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సుధీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ కుస్తీ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయి బాక్సార్‌గా ఎదిగి నేపథ్యంలో ఎదురైన కష్టాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కబీర్ దుహన్ సింగ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతమందిస్తున్నాడు. -
పహిల్వాన్ వస్తున్నాడు
‘ఈగ’తో ఇబ్బందులు పడి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్. తాజాగా ‘పహిల్వాన్’ అనే చిత్రంలో నటించారాయన. ఇందులో మల్ల యోధుడి పాత్రలో కనిపించనున్నారు. కన్నడంలో రూపొందిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఎస్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘ఆల్రెడీ రిలీజయిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం’’ అని నిర్మాతలు తెలిపారి. ‘కేజిఎఫ్’ను తెలుగులో రిలీజ్ చేసింది వారాహి బ్యానరే కావడం విశేషం. -
క్లాప్‌కి ఇళయరాజా క్లాప్
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా రూపొందనున్న చిత్రం ‘క్లాప్’. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఐబి కార్తికేయన్, యం. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనున ్న ‘క్లాప్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా క్లాప్ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తమిళ వెర్షన్‌కు హీరో నాని క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తదితరులు ‘క్లాప్‘ బౌండెడ్ స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పాను. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకంటే మా సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ కథపై ఏడాది వర్క్ చేశాను. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది’’ అన్నారు పృథ్వి ఆదిత్య. ‘‘మిత్రుడు రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు.. కథ విని ఇంప్రెస్ అయి ఈ చిత్రంలో భాగమయ్యాను. ఇళయ రాజాగారి మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్ ఎస్సెట్ కానుంది. ఈ నెల 17నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, మధురైలలో షూటింగ్ జరుపుతాం. నాలుగు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ప్రవీణ్ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్ష. -
ఆది పినిశెట్టి ‘క్లాప్’మూవీ ప్రారంభమైంది
-
ప్రారంభమైన ఆది పినిశెట్టి ‘క్లాప్’
విభిన్నమైన పాత్రలను చేస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ‘క్లాప్’ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో ఆది హీరోగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారధులు మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి. కళ్యాణ్, చంటి అడ్డాల, శ్రీమతి శోభారాణి, కొమర వెంకటేష్, హీరోలు నాని, సందీప్ కిషన్, ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, రచయిత చిన్నికృష్ణ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పూజాకార్యక్రమాల అనంతరం హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా క్లాప్ నివ్వగా మెగా నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తమిళ్ చిత్రానికిగాను హీరో నాని క్లాప్ నిచ్చారు. ‘క్లాప్’ బౌండెడ్ స్క్రిప్ట్‌ను ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్లు చిత్ర యూనిట్‌కు అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తాను అని చెప్పాను. అంతలా ఇంప్రెస్ అయ్యాను. వెరీ ఆర్ట్ టచ్చింగ్ మూవీ . డైరెక్టర్ చాలా టాలెంట్ వున్న వ్యక్తి. ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే ఈ క్లాప్ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ కన్విక్షన్ బాగా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. రెండు షేడ్స్ వున్న పాత్రల్లో నటిస్తున్నాను. బాగా చెయ్యాలనే తపనతో వున్నాను. నిర్మాత కార్తికేయన్ నేను ఎప్పటినుండో సినిమా చెయ్యాలనుకుంటున్నాం, ఇన్నాళ్లకు కుదిరింది’ అన్నారు. దర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ.. ఇది వెరీ స్పెషల్ డే నాకు. వన్ ఇయర్ నుండి ఈ కథపై వర్క్ చేశాను. కార్తికేయన్‌కి పాయింట్ చెప్పగానే నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయమన్నారు. ఆది కథ విని వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది’ అన్నారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇది నా మూడవ సినిమా. తమిళ్లో ఫస్ట్ సినిమా. చాలా ఎక్సయిటింగ్‌గా వుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూర్స్కి థాంక్స్’ అన్నారు. -
‘ఇది నిజమేనా.. నన్నెవరైనా నిద్ర లేపండి’
తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన కన్నడ స్టార్ సుధీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పహిల్వాన్. సుధీప్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ టీజర్‌కు బాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా సల్మాన్ పహిల్వాన్ టీజర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేయటంతో సుధీప్ స్పందిస్తూ ‘సార్.. ఇది నిజమేనా.. నన్నెవరైనా నిద్ర లేపండి. సుల్తాన్ ట్వీట్ చేశారు. థాంక్యూ’ అంటూ కామెంట్ చేశారు. Sirrrrrrr 😯.... ✨✨✨✨😃😃... is this real ,,,lemme wake upppp.. The sultan @BeingSalmanKhan tweets !! U jussssss made my day..thank uuuuuuuuuuuuuu..... Hugs hugs n hugs . https://t.co/ttQBrNwuou — Kichcha Sudeepa (@KicchaSudeep) 15 January 2019 అంతేకాదు టీజర్‌ను ప్రంశసిస్తూ ట్వీట్ చేసిన ప్రతీ ఒక్కరికి సుధీప్ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, రితేష్ దేశ్‌ముఖ్‌లతో పాటు ధనుష్, రవి కిషన్, రామ్ గోపాల్ వర్మ లాంటి స్టార్స్ పహిల్వాన్ టీజర్‌పై ప్రశంసలు కురింపించారు. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళ్ళీరావా ఫేం ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. -
పహిల్వాన్‌గా కిచ్చ సుదీప్
స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మిస్తున్న పహిల్వాన్. ఈ సినిమాలో కన్నడ హీరో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే కసరత్తులు సైతం చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సైతం ఈ సినిమాలో నటిస్తుండటంతో విశేషం. తొలిసారిగా సుదీప్ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. సినిమాకు ఎస్.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అర్జున్ జన్యా సంగీతాన్ని అందిస్తున్నారు. స్టంట్స్ కోసం హాలీవుడ్ నుంచి లార్వెన్ సోహైల్ అనే నిపుణున్ని పిలిపించారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహాన్‌సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఏకంగా 20 సెట్లను రూపొందించారు. -
మల్టీస్టారర్ అంటే ఇగో ఉండకూడదు
‘‘దేవదాస్’ విడుదల టైమ్‌లో నేను ఇక్కడ లేను. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌కి వెళ్లా. ఆ ట్రిప్ చాలా సరదాగా జరిగింది. ‘శైలజారెడ్డి అల్లుడు, యూ టర్న్, దేవదాస్’ వంటి మూడు సక్సెస్ఫుల్ సినిమాలు సెప్టెంబర్‌లో విడుదలవడంతో పాటు, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ టీజర్ రిలీజ్ కావడంతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంత సంతోషంగా హాలిడే ట్రిప్‌కి వెళ్లామో అంతే సంతోషంగా తిరిగొచ్చాం’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా రష్మికా మండన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్స్‌గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘దేవదాస్’ సినిమా వారానికే 41కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటే సంతోషంగా ఉంది. కుటుంబమంతా హాయిగా నవ్వుతూ చూడదగ్గ చిత్రమిది. డాక్టర్ దాస్ పాత్రలో నాని లీనమయ్యాడు. మల్టీస్టారర్ సినిమా అంటే ఇగో ఉండకూడదు. నీ రోల్, నా రోల్ అనుకుంటే సినిమా చెడిపోద్ది. సినిమా బావుంటే మనం బాగుంటాం అనుకుని నేను, నాని చేయబట్టే మా మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి. శ్రీరామ్ ఆదిత్యకు మంచి భవిష్యత్ ఉంది. ‘ఆఖరి పోరాటం’ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా గ్రాండ్‌గా ఉండాలంటూ అశ్వినీదత్‌గారు డైరెక్టర్ రాఘవేంద్రరావుగారితో పోట్లాడేవారు. ఇప్పటికీ ఆయనకు అదే ప్యాషన్ ఉంది. ఎప్పటికీ వైజయంతీ మూవీస్ పతాకం జెండా ఎగురుతూనే ఉంటుంది. ఎన్టీ రామారావుగారు శంఖం ఊదుతూనే ఉంటారు. ‘దేవదాస్’ సినిమా ఆయనకు కమ్‌బ్యాక్ మూవీ అంటున్నారు. ఆయనకు కమ్ బ్యాక్ మూవీ ఏంటండీ? ఎన్ని హిట్స్ లేవు. ‘మహానటి’ కూడా సూపర్‌హిట్టే. ‘డాన్’ దేవ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఆదరించిన విధానం బాగుంది. ఇలాంటి పాత్రలు మరికొన్ని చేయొచ్చనే భరోసా ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘శివ’ సినిమా విడుదలై అప్పుడే 29ఏళ్లు అయిందా? అని పొద్దున్నే అనిపించింది. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చాలా రికార్డులు సాధించింది. ‘అల్లరి అల్లుడు’ సినిమా మాస్‌లోకి తీసుకెళ్లింది’’ అన్నారు. ‘‘భారతదేశ చలన చిత్ర చరిత్రలో అధిక మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత ఎన్టీఆర్–ఏఎన్ఆర్లదే. వారితో మా బ్యానర్లో 14 సినిమాలు చేస్తే రెండు మూడు మినహా అన్నీ హిట్లే. తెలుగులో ఎక్కువ మల్టీస్టారర్ చిత్రాలు తీసిన ఘనత మాదే. కర్నాటకలో మా ‘దేవదాస్’ వారానికి 2కోట్ల 37లక్షల షేర్ రాబట్టింది’’ అన్నారు అశ్వినీదత్. ‘‘దేవదాస్’ చేసే అవకాశమిచ్చిన అశ్వినీదత్, నాగార్జున, నానిగార్లకు థ్యాంక్స్. ప్రేక్షకులతో కలిసి ఆరేడుసార్లు ఈ సినిమా చూశా. బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. -
ఆ ఇద్దరికీ నేను ఫిదా
‘‘ ఏ సినిమా చేయాలన్నా క్యారెక్టర్ నచ్చాలి. అదే ముఖ్యం. నాగార్జున, నానీల బ్రోమాన్స్ (నవ్వుతూ) ఈ సినిమాకు హైలైట్. నేనైతే వాళ్లిద్దరి కాంబినేషన్ చూసి ఫిదా అయిపోయాను. వైజయంతీ మూవీస్ లాంటి బ్యానర్లో నటించే అవకాశం వచ్చినప్పుడు నమ్మలేదు. సినిమా ప్రమోషన్స్ అప్పుడు పర్సనల్ విషయాలు డిస్కస్ చేస్తే న్యూస్ డైవర్ట్ అయిపోతుంది. అందుకే వ్యక్తిగత విషయాలు చెప్పను’’ అని రష్మికా మండనా అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా కథానాయికలు. అశ్వనీదత్ నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా రష్మిక పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘దేవదాస్’ సినిమాలో నానీగారు డాక్టర్లా కనిపిస్తారు. నేను ఆయన పేషెంట్‌ని. రోజూ ఏదో ప్రాబ్లమ్ అని చెప్పి క్లినిక్‌కి వెళ్తుంటాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు పూజ. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ► ఇది మల్టీస్టారర్ అయినప్పటికీ నా పాత్ర బావుంటుంది. ‘గీత గోవిందం’లో నాది హీరోకు సమానంగా ఉండే పాత్ర. కానీ ఈ సినిమా కథ మొత్తం నాగార్జున, నానీగార్ల చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ పాత్రలకు స్క్రీన్ టైమ్ తక్కువ ఉన్నా సర్ప్రైజ్ విషయాలు ఉంటాయి. ► నాని సార్‌తో వర్క్ చేయడం లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతి సీన్‌ను ఎలా ఇంప్రూవ్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఏ హెల్ప్ కావల్లన్నా నానీగార్ని అడిగేదాన్ని. ► నాగార్జున గారితో పని చేసింది కేవలం రెండు రోజులే. కానీ రెండు రోజులూ నవ్వుతూనే ఉన్నాం. ఆయన చాలా సరదా మనిషి. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ► ఏ సీన్ అయినా నా దర్శకుడు, హీరో, కెమెరామేన్ ఓకే అన్నాకే మానిటర్లో చూసుకుంటాను. వాళ్లకు నచ్చాలి అన్నది మెయిన్ పాయింట్ అని నమ్ముతాను. ► నెక్ట్స్ విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ చేస్తున్నాను. అందులో క్రికెటర్‌గా నటిస్తున్నాను. పాత్రకోసం ప్రిపేర్ అవుతుంటే చిన్న గాయం అయింది. మళ్లీ మొదలెట్టాలి. కన్నడంలో ఓ సినిమా చేస్తున్నాను. వేరే సినిమాలున్నాయి. వాటి గురించి ప్రొడక్షన్ హౌజ్‌లు అనౌన్స్ చేస్తాయి. తమిళంలో ఆఫర్స్ వస్తున్నాయి. కానీ కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాం అంటే ఆ అంచనాలు అందుకునే స్క్రిప్ట్ రావాలని అనుకుంటున్నాను. -
నేను అనుకున్నవన్నీ జరుగుతాయి
‘‘మనందరి ప్రేమాభిమానాల్లో ఏయన్నార్‌గారు ఎప్పుడూ నిలిచి ఉంటారు. ఈ సినిమా చేయడానికి మూడు కారణాలు. స్క్రిప్ట్, అశ్వనీదత్‌గారు, నాని’’ అన్నారు నాగార్జున. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. గురువారం అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి, ఈ చిత్రం ఆడియోను రిలీజ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఒక సీత కథ’ తర్వాత అశ్వనీదత్‌గారు 24 ఏళ్ల వయసులో తెల్లవారుజామున 4 గంటలకు ఎన్టీఆర్‌గారి ఇంటి ముందు నిల్చున్నారు సినిమా కోసం. ఎన్టీఆర్‌గారు ‘ఎదురులేని మనిషి’ సినిమా చేశారు. పెద్ద హిట్ అయింది. ఆయన ఫొటోనే ఈ సంస్థ లోగోలో ఉంటుంది. సాధారణంగా నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. మల్టీస్టారర్ చేస్తే నానీతో చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. అతని డైలాగ్ డెలీవరీ చక్కగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఓ అందమైన అమ్మాయి ఆకాంక్షను నాకు హీరోయిన్గా తీసుకువచ్చారు. రష్మికకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అన్నింటినీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ మన (ఫ్యాన్స్‌ను ఉద్దేశించి) నెల. నాన్నగారి బర్త్‌డే. మొగుడు పెళ్లాల సినిమాలు ఒకే రోజు రిలీజవుతాయా? అయ్యాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రెండూ బాగా ఆడాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రివ్యూస్ చూసి సమంత కంగారు పడింది. ఏం ఫర్లేదు.. సాయంత్రానికి ఓకే అవుతాయి అన్నాను. సెట్ అయింది. నా సినిమాకు కలెక్షన్స్ రావడం లేదు అంది. సండేకి సెట్ అవుతుంది అన్నాను.. అయింది. ఈ 27న వస్తున్న ‘దేవదాస్’ని కూడా నాన్నగారు చూసుకుంటారు. గణేశ్, దసరా పండగ మధ్యలో ‘దేవదాస్’ పండగ వస్తుంది. నవ్వులు.. ఓన్లీ నవ్వులే. సీక్వెల్ చేద్దామా నానీ? తప్పకుండా చేద్దాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూసినప్పటి నుంచి తాతగారు అనే పేరు వింటే మా తాతకంటే ఏయన్నార్‌గారు కనిపిస్తారు. నాగార్జున ఇంత అందంగా ఉంటారు. రోజూ ఏం తింటున్నారో, తాగుతున్నారో కనుక్కోమని నా అసిస్టెంట్స్‌కి చెప్పాను. అది ట్రై చేసి ఆయనలా అయిపోదాం అని. కానీ మనం తినేవే తింటున్నారు సర్ అని చెప్పారు. మామూలువే తిని మామూలువే తాగితే ఆయనెందుకు అలా ఉన్నారు? మనమంతా ఇలా ఎందుకు ఉన్నాం? ఆ అందానికి కారణం సరదాగా ఉండటమే. ప్యూర్‌గా ఉండటమే. లోపల ఏం పెట్టుకోరు. అశ్వనీదత్‌గారు కెరీర్ స్టార్టింగ్‌లో నా ఆల్బమ్ చూసి ‘నీకెందుకు యాక్టింగ్ బాగా చదువుకో’ అన్నారు. ఇప్పుడు ఆయన బ్యానర్లో రెండో సినిమా చేస్తున్నాను. స్వప్నా, నేను ‘ఎవడే సుబ్రమణ్యం’ ముందు గొడవపడ్డాం. సినిమా హిట్. ఈ సినిమా స్టార్ట్ కాకముందే గొడవపడ్డాం. సినిమా బ్లాక్బాస్టర్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అందర్నీ బాగా హ్యాండిల్ చేశాడు. మణిగారితో మళ్లీ వర్క్ చేయడం చాలా హ్యాపీ’’ అన్నారు. ‘‘మామయ్యా మజాకా. బంగార్రాజు పాత్ర తర్వాత అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాని నా ఫేవరెట్ కోస్టార్’’ అన్నారు సమంత. ‘‘అన్నయ్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ పోస్టర్ చూసి ‘ఏమున్నాడు మా అన్నయ్య’ అన్నాను. ఇప్పుడు మా నాన్నగారిని చూసి ‘ఏమున్నాడయ్యా బాబు మా నాన్న’ అనాలనిపిస్తుంది. నాని అంటే నాకిష్టం. యాక్టింగ్‌లో తన ఈజ్ కుళ్లు తెప్పిస్తోంది’’ అన్నారు అఖిల్. ‘‘వైజయంతీలో సినిమా చేయడం హానర్‌గా ఫీలవుతున్నాను. నాగార్జునగారితో అప్పట్లో ఓ ఫొటో దిగాను. బయటా హీరోలానే ఉన్నాడమ్మా అని మా అమ్మగారితో అంటే, సినిమా చేయమన్నారు. అది నెరవేరడానికి 4 ఏళ్లు పట్టింది’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. అశ్వనీ దత్ మాట్లాడుతూ: ‘‘నా అభిమాన నటులు నాగేశ్వరరావుగారు ఒకరు. మా సంస్థలో అత్యధిక సినిమాలు చేసిన హీరో నాగార్జున. నాకు రెండో సినిమా చేస్తున్న హీరో నాని. యంగ్ డైరెక్టర్స్ అందరూ ట్రెండ్ మారుస్తున్నా రు. ఈ సంస్థను నడిపిస్తుంది రెండు మహాశక్తులు. వయాకామ్ ఒకరైతే, స్వప్నా–ప్రియాంకలు మరొకరు’’ అన్నారు. ‘‘ఈ లెగసీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని వయాకామ్ ప్రతినిథి అజిత్ అన్నారు.‘‘అక్కినేని గారి పుట్టినరోజంటే నాకు పండగే. నా గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటాడు. తండ్రికి మించిన తనయుడు లాగా నాగార్జున కూడా నవయువకుడిలా ఉంటాడు. మనం గర్వించదగ్గ నిర్మాత అశ్వనీదత్. ఈ ‘దేవదాస్’ కూడా ఆ ‘దేవదాసు’ అంత పేరు సంపాదించాలి. నాని చేసిన సినిమాలన్నీ హిట్టే’’ అన్నారు సుబ్బిరామిరెడ్డి. ‘‘నన్ను పరిచయం చేసింది దత్గారే. నాగార్జునతో మళ్లీ సినిమా చేయడం రహ్యాపీ’’ అన్నారు మణిశర్మ. -
డీ బ్రదర్స్ జోడీ అదుర్స్
డాన్, డాక్టర్ అంటూ ఇన్ని రోజులు ‘దేవదాస్’లు నాగార్జున, నాని గురించే మాట్లాడుకున్నాం. మరి వాళ్ల జోడీ ఎలా ఉంటారో సోమవారం రివీల్ చేసింది ‘దేవదాస్’ చిత్రబృందం. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ ‘దేవదాస్’. అశ్వనీదత్ నిర్మించారు. ఇందులో నాగార్జున సరసన ‘మళ్ళీ రావా’ ఫేమ్ ఆకాంక్షా సింగ్, నానీకు జతగా రష్మికా మండన్నా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ బ్యూటీలిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను రిలీజ్ చేశారు. ‘జాహ్నవీ’ పాత్ర పోషించిన ఆకాంక్ష సింగ్ లుక్ రిలీజ్ చేస్తూ – ‘‘చాలా రోజుల తర్వాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి. ఏయ్!! మళ్లీ రొమాన్స్’’ అని నాగార్జున పేర్కొన్నారు. ‘‘ఫస్ట్ టైమ్ మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే.. లోపల ఏదో రింగ్ అయింది పూజగారు. మళ్లీ ఎప్పుడు?’’ అంటూ పూజా పాత్రలో రష్మికా మండన్నా లుక్‌ను నాని రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ‘ఆడియో పార్టీ’ ఈ నెల 20న జరగనుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వయాకమ్ 18 ప్రొడక్షన్లో భాగమైందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. -
నాగ్ పక్కన ఓ అందమైన అమ్మాయి!
టాలీవుడ్ కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టిస్టారర్ దేవదాస్. దేవ పాత్రలో డాన్‌గా నాగార్జున, దాసు పాత్రలో డాక్టర్‌గా నాని నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ‘దేవదాస్’ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పాత్రను పరిచయం చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందంటూ ట్వీట్ చేశాడు నాగ్. సోమవారం సాయంత్రం వీరిద్దరికి సంబంధించిన ఓ డ్యూయెట్ లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ కానున్నట్లు ట్వీట్ చేశాడు నాగ్. ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. చాలా రోజులు తరవాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి!! Yaayy romance again😊#Akanksha_s30 #devadasonsept27th lyrical video this evening 👉👉👉 pic.twitter.com/rWSLPOuE6O — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 17, 2018 -
మళ్లీ వస్తున్నా!
‘పదమూడేళ్ల తరువాత అంజలి మళ్లీ నన్ను చూసింది. అంజలిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. గుర్తు పట్ట లేదు. గుర్తు కూడా లేనా!’ ‘మళ్లీ రావా’ సినిమాలో అంజలిని చూస్తూ కార్తిక్ మనసులో అనుకున్న మాటలివి. ‘మళ్లీ రావా’ మంచి సినిమా అనిపించుకోవడంతో పాటు ‘ఎవరీ అంజలి? బాగా చేసింది’ అనే ప్రశంస కూడా వచ్చింది. ‘మళ్లీ రావా’ తరువాత మళ్లీ కనిపిస్తుందో లేదో అనుకున్న ఆకాంక్ష సింగ్... అదేనండీ అంజలి త్వరలో నాగార్జున–నానీల ‘దేవదాస్’లో కనిపించబోతుంది. ఆకాంక్ష తన గురించి చెప్పిన కొన్ని విషయాలు... చిన్నప్పుడు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్సర్ కావాలనుకునేదాన్ని. అమ్మ, సోదరి థియేటర్ ఆర్టిస్ట్‌లు. పదిహేనో యేట థియేటర్ ఆర్టిస్ట్‌గా నా ఆరంగేట్రం మొదలైంది. పదికి పైగా నాటకాల్లో నటించాను.‘ఇక్కడ చేయడానికి ఎంతో ఉంది’ అనిపించింది. ఒకప్పుడు అద్దం ముందు నిల్చొని సరదాగా డైలాగులు చెప్పేదాన్ని. అలాంటి నేను థియేటర్ ఆర్టిస్ట్‌గా నటనను సీరియస్‌గా తీసుకున్నాను. మొదటి నుంచి చదువులో ముందు ఉండేదాన్ని. సినిమా రంగంలో అస్థిరత్వం ఎక్కువ. ఇవ్వాళ ఉన్నట్లు రేపు ఉండకపోవచ్చు. రేపు ఏమిటనేది ఎవరూ చెప్పలేరు. ఈ భావన అంతర్లీనంగా ఉండేదేమో తెలియదుగానీ నాకు చదువుపై శ్రద్ధ ఎక్కువగా ఉండేది. చదువు అనేది ఎప్పటికీ ముఖ్యమైనదే. మనం ఏదీ కావాలనుకున్నా ‘చదువు’ అనే పునాది గట్టిగా ఉండాలి. థియేటర్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడే కలర్స్ టీవీలో ‘న బోలే తుమ్ న మైనే కుచ్ కహా’ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. ‘చేయగలనా?’ అనిపించింది. ఎందుకంటే అది విడో పాత్ర. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఛాలెంజింగ్‌గా అనిపించింది.ఫ్లైవోవర్ కూలిన దుర్ఘటనలో మేఘావ్యాస్ అనే యువతి భర్తను కోల్పోతుంది. నాసిరకం సామగ్రిని ఉపయోగించి నిర్మించిన ఫ్లైవోవర్ తన భర్తను బలితీసుకుంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన మేఘావ్యాస్ దీనిపై న్యాయపోరాటానికి దిగుతుంది. లోతైన భావోద్వేగాలు ఉన్న పాత్ర ఇది. మేఘావ్యాస్ నటనపరంగా నన్ను రెండు మెట్లు పైకి ఎక్కించింది. అందుకే ఆ పాత్ర విషయంలో... ‘నో రిగ్రేట్స్’ అని చెబుతుంటాను. ‘బాహుబలి’కి ముందు హిందీలోకి డబ్ అయిన తెలుగు సినిమాలు చూడడం తప్ప వాటి గురించి పెద్దగా తెలియదు. ‘బాహుబలి’ నాకు బాగా నచ్చింది. ప్రభాస్, విక్రమ్, మాధవన్‌లతో నటించాలని ఉంది. ‘మళ్లీ రావా’ సినిమాతో తొలిసారిగా తెలుగులో నటించే అవకాశం వచ్చింది. నిజానికి భాష తప్ప అక్కడికి(ముంబై) ఇక్కడికి పెద్ద తేడా అనిపించలేదు. ఇక్కడ ఆతిథ్యం, అభిమానం గొప్పగా ఉంటాయి. ఈ సినిమాలో డైలాగులను బట్టీ పట్టడం కాకుండా వాటి అర్థాన్ని, భావోద్వేగాలను, యాసను తెలుసుకునేదాన్ని. అరువు గొంతు కంటే సినిమాలో నా గొంతు వినబడడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఏదైనా త్వరగా నేర్చుకుంటానని ‘క్విక్ లెర్నర్’ అని నాకు పేరు. ఇప్పుడు చిన్న చిన్న తెలుగు పదాలకు అర్థాలు తెలుసు. ‘మళ్లీరావా’ సినిమా ద్వారా నాగార్జున ‘దేవదాస్’లో నటించే అవకాశం వచ్చింది. ‘మళ్లీరావా’తో తెలుగుతో కలిగిన పరిచయం ఈ సినిమాకు ఉపయోగపడుతుంది. బాలీవుడ్ సినిమా ‘బద్రీనాథ్ కీ దునియా’లో చిన్న పాత్రలో కనిపించాను. అది చిన్న పాత్ర అయినా మంచి గుర్తింపు తెచ్చింది.