‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’ | Kichcha Sudeepa Pehlwaan Telugu Official Trailer Released | Sakshi
Sakshi News home page

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

Published Thu, Aug 22 2019 1:32 PM | Last Updated on Thu, Aug 22 2019 1:32 PM

Kichcha Sudeepa Pehlwaan Telugu Official Trailer Released - Sakshi

సాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుధీప్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం పహిల్వాన్‌. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సుధీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ కుస్తీ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయి బాక్సార్‌గా ఎదిగి నేపథ్యంలో ఎదురైన కష్టాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కబీర్‌ దుహన్‌ సింగ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్‌ జన్య సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement