నాగార్జున, నాని
శాంతాభాయ్ మెమోరియల్ చారిటీ హస్పిటల్‌కు, ‘దేవదాస్’లకు ఏదో కనెక్షన్ ఉంది. ఆ కనెక్షనే ‘దేవదాసు’ల మధ్య అనుబంధాన్ని పెంచిందట. ఇందుకు గల కారణం మాత్రం వెండితెరపై చూడాల్సిందే. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. ధర్మరాజు సమర్పణలో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్‌కు జోడీగా ‘మళ్లీ రావా’ ఫేమ్ ఆకాంక్షా సింగ్ నటిస్తున్నారు.
నాని సరసన రష్మికా మండన్నా కనిపిస్తారు. డాన్ దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్ దాసు పాత్రలో నాని నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మరో వారం రోజుల పాటు కొనసాగనుందని సమాచారం. మేజర్‌గా నైట్ షూట్ చేస్తారు. ప్రస్తుతం నాగార్జున, నానీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment