చిందేస్తున్నారు | Nagarjuna-Nani gearing up for massive Song | Sakshi
Sakshi News home page

చిందేస్తున్నారు

Published Sat, Jun 2 2018 1:04 AM | Last Updated on Sat, Aug 3 2019 12:30 PM

Nagarjuna-Nani gearing up for massive Song - Sakshi

నానీ, నాగార్జున

ఏదైనా పని స్టార్ట్‌ చేసే ముందు వినాయకుణ్ణి ప్రార్థించమంటారు పెద్దలు. అలాగే ప్రార్థిస్తున్నారు డాన్‌ అండ్‌ డాక్టర్‌. వినాయకుని ముందు కథానాయకులిద్దరూ కలిసి చిందేస్తున్నారట. ఈ పూజ ఇద్దరూ విడివిడిగా చేసే పని కోసమా? లేక కలసి చేసే మంచి పని కోసమా? తెలియాలంటే మా సినిమా చూడాలంటున్నారు శ్రీరామ్‌ ఆదిత్య. నాగార్జున, నానీ హీరోలుగా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు.

నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్, నానీ సరసన రష్మికా మండన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం వినాయకుడికి సంబంధించిన ఓ పాటను  హైదరాబాద్‌లో షూట్‌ చేస్తున్నారు. ఆల్రెడీ ఓ ప్రముఖ స్టూడియోలో కొంత భాగం తీశారు. ఇప్పుడు మరో ప్రముఖ స్టూడియోలో మిగిలిన పోర్షన్‌ను షూట్‌ చేస్తున్నారు. జూలై నెలతో నాగార్జున పాత్రకు సంబంధించిన పూర్తి షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోతుందని సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement