Sri Ram Aditya
-
‘జుంబారే.. జుజుంబరే’ రిలోడేడ్ అదిరింది!
-
‘జుంబారే.. జుజుంబరే’ రీమిక్స్ అదిరింది!
సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘జుంబారే.. జుజుంబరే’ రీమిక్స్ సాంగ్ స్పెషల్ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీల చిత్రంలోని ఈ పాట ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన ఈ పాటకి జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. కృష్ణ, పూజా ‘జుంబారే.. జుజుంబరే’ పాటకు డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇదే పాటని సరికొత్త స్టైల్లో రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. (చదవండి: రాజమౌళితో మహేశ్ సినిమా ఆశించొచ్చా?) టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, సత్యా, అర్చనా సౌందర్య నటిస్తున్నారు. 50 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయింది. కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్ నిలిచిపోయింది. తాతగారి పాటకు అశోక్ గల్లా స్టెప్పులు అదిరిపోయాయని అభిమానులు సంబరపడిపోతున్నారు. -
మహేష్ మేనల్లుడి కోసం మెగాపవర్ స్టార్!
హీరో మహేష్ బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ‘భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్’వంటి చిత్రాలతో కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రామానాయుడు స్టూడియోలో నవంబర్ 10న గ్రాండ్ లెవల్లో జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు టాలీవుడ్ టాక్. మహేష్ కోసం అతడి మేనల్లుడిని దీవించడానికే షూటింగ్ పూజాకార్యక్రమంలో రామ్‌చరణ్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికి ప్రకటన రాలేదు. ఇక ఈ చిత్రంలో అశోక్ సరసన ‘ఇస్మార్ట్’బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
మహేశ్ మేనల్లుడు హీరో
హీరో మహేశ్‌బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్’ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 10న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. తనదైన స్టైల్లో డిఫరెంట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు శ్రీరామ్ ఆదిత్య. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి. -
ఈ సారైనా మొదలవుతుందా!
సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రముఖ వ్యాపార వేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ల కుమారుడు గల్లా అశోక్ హీరో ఎంట్రీ ఇచ్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో కృష్ణా రెడ్డి దర్శకత్వంలో అశోక్‌ను హీరోగా పరిచయం చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు గల్లా అశోక్. ఇటీవల నాని, నాగార్జున హీరోగా దేవదాస్ సినిమాను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సారైనా అశోక్ డెబ్యూ సినిమా సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి. -
సీక్వెల్ చేయాలని ఉంది
‘‘సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో సినిమా అయిపోయాక అందరూ లేచి చప్పట్లు కొట్టారు. అది నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్’’ అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా శ్రీరామ్ ఆదిత్య పంచుకున్న విశేషాలు. ► నాగార్జున గారు ఫస్ట్ కాపీ చూశాక ‘శ్రీరామ్ 30 మంది చూశాం. అందరూ బాగా ఎంజాయ్ చేశారు’ అన్నారు. హాలిడే కోసం ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నారు. ఆయన అంత ఎగై్జట్ అయ్యారు. ∙ ఫస్ట్ దత్‌గారు ఈ లైన్ విన్నారు. నాగార్జున, నాని హీరోలుగా ఫిక్స్ అయ్యారు. అప్పటికి జస్ట్ లైన్ మాత్రమే ఉంది. దాని మీద రెండు మూడు నెలలు వర్క్ చేశాను. వైజయంతీ మూవీస్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ► మల్టీస్టారర్ చేయడం బరువుగా అనిపించలేదు. ఎగై్జటింగ్‌గా అనిపించింది. షూటింగ్ లొకేషన్లో నాగ్‌సార్, నానీని మానిటర్లో చూస్తుంటే ఆడియన్స్‌కు ఎప్పుడు చూపించాలా అని ఆత్రుతగా ఉండేది. ► నాగార్జున గారిని, ఆయన చరిష్మాను తిరిగి ‘దేవదాస్’ సినిమాలో చూపించాలనుకున్నాను. నాని లుక్ పాత సినిమాల్లా ఉండకుండా జాగ్రత్త పడ్డాం. ► పూజ పాత్ర కోసం రష్మికా మండన్నాను అనుకున్నప్పుడు ‘గీత గోవిందం’ ఇంకా రిలీజ్ కాలేదు. దాదాపు 30 మందిని ఆడిషన్ చేసి, రష్మికను సెలెక్ట్ చేశాం. ► నాగార్జునగారు ఉట్టి కొట్టే సీన్లో డూప్‌తో చేయిద్దాం అనుకున్నాం. కానీ ఆయన నేనే చేసేస్తా అని సింగిల్ టేక్‌లో చేసేశారు. ఆ ఎనర్జీ చూసి అందరం షాక్ అయ్యాం. ► నెక్ట్స్ ఇంకా ఏం అనుకోలేదు. సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. అందరూ మా సినిమా గురించి మంచిగా మాట్లాడుతున్నారు. హాయిగా నిద్రపోతున్నాను. అలానే నిద్రలేస్తున్నాను. కలెక్షన్స్ గురించి పట్టించుకోను. నచ్చితే ప్రేక్షకులే పెద్ద స్థాయికి తీసుకెళతారు. ► ఇది ఏ హాలీవుడ్ సినిమాకు కాపీ కాదు. హాలీవుడ్ మూవీలను చూసి ఆనందిస్తాను కానీ అనుకరించను. ‘దేవదాస్’కి సీక్వెల్ ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. చూడాలి. అప్పుడింకా హ్యూమర్ యాడ్ చేస్తాను. -
ఈ వారం తర్వాత ఏ కాశీకో వెళ్లిపోతా: నాని
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన సినిమా దేవదాస్. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనిదత్ నిర్మించారు. మణిశర్మ సంగీతమందించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. ‘మహానటి అప్పుడు నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు. ఈ సినిమాకు మాత్రం పెద్ద హీరోలు నాకు తోడుగా, అండగా.. వాళ్ల భుజాలపై వేసుకుని నడిపించిన సినిమా కాబట్టి మీ ముందుకు వచ్చాను. చాలా ఏళ్ల తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి ప్రతిష్మాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వించే సినిమా ఇది అవుతుంది’ అన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. ‘అశ్వినీదత్ గారు ఆఖరి పోరాటం అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ ఇంకా అలాగే ఉంది. దేవ క్యారెక్టర్ ఇంటర్నేషనల్ డాన్ క్యారెక్టర్‌గా తీసుకున్నాం. దాంట్లో వయోలెన్స్ కానీ.. మాఫియా యాక్టివిటీస్ కానీ పెద్దగా చూపించలేదు. దాస్ తో దేవ స్నేహమే దేవదాస్ సినిమా. ఒకరిని ఇంకొకరు ఎలా ఇన్ఫ్లూయెన్స్ చేస్తారనేది సినిమాలో మెయిన్ పాయింట్. సినిమాలో సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కెమెరామెన్ శ్యామ్ తో మరోసారి వర్క్ చేయాలని ఉంది’ అని అన్నారు. హీరో నాని మాట్లాడుతూ.. దాస్ చాలా ఇన్నోసెంట్. సాఫీగా సాగుతున్న లైఫ్ లోకి ఊహించకుండా ఎవరూ లైఫ్ లో చూడని ఓ వ్యక్తి ఫ్రెండ్ గా వస్తే వాడి లైఫ్ ఎలా మారిపోతుంది అనేది కారెక్టర్. ఫోన్ విషయంలో కూడా ఎప్పుడూ తాను చేతిలో పట్టుకునే ఉంటానని నాగ్ సర్ వీడియో చేసారు. అయితే నాగార్జున గారు పక్కనే ఉన్నపుడు అలాంటి ధైర్యం చేయలేదు కానీ వీడియో చేసే సరికి అది వైరల్ అయిపోయింది. నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడమే అదృష్టం. నా లైఫ్ లో మోస్ట్ హెట్టిక్ వీకెండ్ ఇది. మోస్ట్ స్ట్రెస్ ఫుల్ వీక్.. ఎక్సైటింగ్ వీక్ కూడా ఇదే. బిగ్‌బాస్ ఫైనల్ కూడా ఇదే వారం ఉండటంతో ఒత్తిడి ఉంది. ప్లస్ మైనస్ రెండూ ఉన్నాయి. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతాను’ అన్నారు. హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. ‘నా కారెక్టర్ ఇందులో గాల్ నెక్ట్స్ డోర్ లా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని చెప్పారు. మరో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ‘నాగార్జున గారు సీన్ విషయాల్లో చాలా హెల్ప్ చేసారు. ఆయన చెప్పిన టిప్స్ అద్భుతంగా పనిచేసాయి. ఆయనతో పనిచేయడం.. స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని చెప్పారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘సెట్ లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్స్ నాగార్జున గారు. మామూలు సినిమా, మల్టీస్టారర్స్ అని తేడా నాకు ఉండదు. మల్టీస్టారర్ అంటే ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఒకేసారి ఇద్దరు హీరోల బెటర్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఇది ఏ సినిమా రీమేక్ కాదు. సొంత కథతోనే దేవదాస్ తెరకెక్కించాను. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కింది. చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లు ఎన్ని ఉంటాయనేది సినిమా చూసి తెలుసుకోండి’ అని చెప్పారు. -
దేవదాస్‌లు వస్తున్నారు..!
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ లోగోకు మంచి రెస్సాన్స్ వచ్చింది. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అభిమానులకు శుకాంక్షలు తెలిపిన నాగార్జున, నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 7 సాయత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నరిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తుండగా ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
ఆ మల్టీస్టారర్‌కు క్లాసిక్ టైటిల్
నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్‌కు ‘దేవదాస్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ‘శాంతాబాయి మెమోరియల్ చారిటీ హాస్పిటల్’ అనే ఆస్పత్రి రసీదుపై సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు.. ఓ చివర స్టెతస్కోప్, మరో చివర గన్, బుల్లెట్లతో కూడిన పోస్టర్ వినూత్నంగా ఉందంటూ’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవ అనే డాన్ పాత్రలో నాగార్జున, దాస్ అనే డాక్టర్ పాత్రలో నాని కనిపించనున్నారు. నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఛలో ఫేం రష్మిక మందన నానికి జోడీగా యాక్ట్ చేస్తున్నారు. 65 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దేవదాసు’ సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
టాలీవుడ్లో మరో ‘దేవదాసు’?
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగార్జునకు సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా నానికి జోడీగా రష్మికా మందన యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65 శాతానికి పైగా పూర్తయ్యింది. నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా కనిపించనున్న ఈ సినిమాకు దేవదాసు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్లో దేవదాసు పేరుతో మూడు సినిమాలు వచ్చాయి. దేవదాస్ నవల ఆధారంగా ఏఎన్నార్, కృష్ణలుదేవదాసు పేరుతో సినిమాలు చేశారు. ఈ జనరేషన్లో రామ్ హీరోగా వైవీయస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు సినిమా రూపొందింది. ఇప్పుడు మరోసారి నాగార్జున, నానిల మల్టీస్టారర్‌కు దేవదాసు టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ టైటిల్ పై అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
చిందేస్తున్నారు
ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు వినాయకుణ్ణి ప్రార్థించమంటారు పెద్దలు. అలాగే ప్రార్థిస్తున్నారు డాన్ అండ్ డాక్టర్. వినాయకుని ముందు కథానాయకులిద్దరూ కలిసి చిందేస్తున్నారట. ఈ పూజ ఇద్దరూ విడివిడిగా చేసే పని కోసమా? లేక కలసి చేసే మంచి పని కోసమా? తెలియాలంటే మా సినిమా చూడాలంటున్నారు శ్రీరామ్ ఆదిత్య. నాగార్జున, నానీ హీరోలుగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఓ భారీ మల్టీస్టారర్ మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్, నానీ సరసన రష్మికా మండన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం వినాయకుడికి సంబంధించిన ఓ పాటను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓ ప్రముఖ స్టూడియోలో కొంత భాగం తీశారు. ఇప్పుడు మరో ప్రముఖ స్టూడియోలో మిగిలిన పోర్షన్‌ను షూట్ చేస్తున్నారు. జూలై నెలతో నాగార్జున పాత్రకు సంబంధించిన పూర్తి షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
‘నా సినిమా రీమేక్ కాదు’
కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ.. రీమేక్ అంటూ రూమర్స్ వచ్చాయి. సోషల్‌మీడియా హవా కొనసాగుతున్న ఈ తరుణంలో ఇలాంటి రూమర్స్ మరింత వేగంగా అందరికి చేరుతాయి. దీనిపై చిత్రదర్శకుడు శ్రీరామ్ ఆదిత్య స్పందించారు. తాను నాగ్, నానిలతో రూపొందిస్తున్న మూవీ ఏ సినిమాకు రీమేక్ కాదంటూ, బయట వస్తున్నరూమర్స్లో ఏ మాత్రం నిజం లేదంటూ ట్విటర్లో పేర్కొన్నారు. నిన్న సోషలమీడియాలో ఈ మూవీ బాలీవుడ్ సినిమా జానీ గద్దర్‌కు రీమేక్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. My next film with @iamnagarjuna sir and @NameisNani Produced by @VyjayanthiFilms is not a Remake of any film. Its a original script .Just wanted clarify :) — Sriram adittya (@SriramAdittya) 22 May 2018 -
గుడ్ డాక్టర్
డాక్టర్‌గా హీరో నాని చార్జ్ తీసుకున్నారు. కేవలం జీతం కోసం మాత్రమే పనిచేసే డాక్టర్ కాదాయన. పక్కవారి జీవితాలను కూడా బాగుచేయాలనే సామాజిక బాధ్యత ఉన్న గుడ్ డాక్టర్. అందుకే.. తన హాస్పిటల్‌కు వచ్చినవారికి అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారట. అది సరే.. డాక్టర్‌గా నానీ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు అంటే.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున డాన్‌గా నటిస్తుండగా ఆయనకు జోడీగా ఆకాంక్షాసింగ్ చేస్తున్నారు. డాక్టర్‌గా చేస్తున్న నానితో రష్మిక మండన్నా జోడీ కట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో నానీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఓ సన్నివేశంలో నాని దగ్గరకు పోలీస్ జీప్‌లో వస్తారట రష్మిక. ఆమె ఎమైనా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారా? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. యూరప్‌లో హాలీడేలో ఉన్న నాగార్జున వచ్చిన వెంటనే షూట్లో జాయిన్ అవుతారట. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచనట. -
నాగ్ - నాని మల్టీస్టారర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్
కృష్ణార్జున యుద్ధం సినిమాతో షాక్ తిన్న నాని ప్రస్తుతం సీనియర్ హీరో నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా నాని డాక్టర్‌గా నటిస్తుండగా నాగార్జున డాన్ పాత్రలో కనిపించనున్నారు. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అశ్వనిదత్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వినాయకచవితికి ఒక్క రోజు ముందు సెప్టెంబర్ 12న రిలీజ్చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో నాగ్ సరసన మళ్ళీరావా ఫేం ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా నాని సరసన ఛలో ఫేం రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతానికి సెప్టెంబర్ బరిలో స్టార్ హీరోల సినిమాలేవి లేకపోవటంతో ఎలాగైన అదే సీజన్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్వ సంగీతమందిస్తున్నారు. -
నాని కాలనీలోకి నాగ్
కొత్త కాలనీలోకి ఎంటర్ అవ్వడానికి మే 2న మూహుర్తం ఫిక్స్ చేసుకున్నారు నాని. ఎనిమిది రోజుల తర్వాత ఇదే కాలనీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు నాగార్జున. సినిమా కోసం ఇద్దరూ కొత్త కాలనీకి రానున్నారు. నాగార్జున, నాని హీరోలుగా వైజయంతి మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో కోటి రూపాయల సెట్ వేశారు. నాని కాలనీకి చెందిన సెట్ ఇది. ఈ సెట్ తయారు చేయడానికి దాదాపు 2 నెలలు పట్టింది. మే 2న నాని సెట్లో జాయిన్ అవుతారు. 10న హీరో నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మరి.. ఈ కాలనీలో నాగార్జున, నాని ఇరుగు పొరుగుగా ఉంటా రేమో చూడాలి. ఇందులో డాన్ పాత్రలో నాగార్జున, డాక్టర్ పాత్రలో నాని కనిపించనున్నారని సమాచారం. ఇక కథనాయికల విషయానికొస్తే... నాగార్జున సరసన ‘మళ్లీ రావా’ ఫేమ్ ఆకాంక్షాసింగ్, నాని సరసన ‘ఛలో’ ఫేమ్ రష్మిక మండన్నా నటిస్తున్నారు. సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మెట్రో ట్రైన్లో నాని, రష్మిక
హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రారంభమైన తరువాత మొట్ట మొదటిసారి షూటింగ్ జరుపుకుంటున్న సినిమా నాగార్జున, నానిల మల్టీ స్టారర్. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనిదత్ , శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది (మార్చి 18) రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్ లో మియాపూర్ స్టేషన్ లో మెట్రో ట్రైన్ లో కొన్ని చిత్రీకరించారు. గతంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమా చిత్రీకరణ మెట్రో ట్రైన్లో జరిగినా అప్పటికీ మెట్రో ప్రారంభం కాలేదు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రారంభమైన తరువాత చిత్రీకరణ జరుపుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ షెడ్యూల్ అందులో నాని, రశ్మిక మందన్న లతో పాటు సంపూర్ణేష్ బాబు పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. -
డీ బ్రదర్స్ – జోడీ కుదుర్స్
ఒకరు డాన్, మరొకరు డాక్టర్. బ్రదర్స్ లాంటి రిలేషన్షిప్. కానీ బ్రదర్స్ కాదు. ఒకరికేమో జోడీ కుదిరింది. మరొకరు తన జోడీని వెతుక్కునే పనిలో ఉన్నారు. ఇంతకీ ఎవరీ డీ బ్రదర్స్, ఎవరు వాళ్ల జోడీ అంటే?.. నాగార్జున, నానీ హీరోలుగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. రెగ్యులర్ షూటింగ్ ఉగాది రోజున స్టార్ట్ అయింది. ఈ సినిమాలో నాగార్జున డాన్‌గా, నానీ డాక్టర్‌గా కనిపిస్తారని సమాచారం. ఇందులో నానీకి జోడీగా ‘ఛలో’ ఫేమ్ రష్మికా మండన్నాను ఫిక్స్ చేశారు. నాగార్జునకు జోడీగా ఇలియానా పేరును పరిశీలిస్తున్నారట చిత్రబృందం. అమలా పాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక సీన్లోకొస్తుందా? ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనలైజ్ అవుతారా? తెలియాలంటే జస్ట్ వారం పది రోజులు ఆగితే చాలు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్‌కి చాలా స్కోప్ ఉంటుందని చిత్రబృందం తెలిపింది. -
మ్యూజికల్ మల్టీస్టారర్
నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ మూవీ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 18న ఉగాది రోజు నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ మల్టీస్టారర్ కూడా మ్యూజికల్‌గా ఉండాలని పూర్తీగా దృష్టి పెడుతున్నాం. మ్యూజిక్ సిట్టింగ్స్ అమెరికాలో జరుగుతున్నాయి. మా బ్యానర్లో చేసిన మల్టీస్టారర్స్ మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా హిట్ అయి మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకువస్తుంది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్ చేసే డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. నాగార్జున, నాని వంటి హీరోలతో వైజయంతి బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్‌దత్. -
నాగ్ హిట్ లిస్ట్‌లో అతను!
ఫ్రమ్ గీతాకృష్ణ టు కల్యాణ్ కృష్ణ నాగార్జున ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్‌గోపాల్ వర్మ, దశరథ్, లారెన్స్... ఇలా నాగ్ పరిచయం చేసిన దర్శకులు పది మందికి పైనే ఉంటారు. జస్ట్ తాను హీరోగా నటించిన సినిమాల ద్వారానే కాదు.. నిర్మించిన చిత్రాల ద్వారా కూడా కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగ్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నారట. అతని పేరు వంశీ అని తెలిసింది. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాల తర్వాత కొత్త దర్శకుడు వంశీతో చేసే సినిమా మొదలవుతుందని భోగట్టా. సమ్మర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట. నాగ్ ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుల్లో ఆల్మోస్ట్ అందరూ సక్సెస్. సో.. వంశీ కూడా ఆ హిట్ లిస్ట్‌లో చేరతారని ఊహించవచ్చు. -
కన్ఫామ్ : త్వరలో నాగ్, నానీల మల్టీ స్టారర్
ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సీనియర్ హీరో నాగార్జున త్వరలో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. యంగ్ హీరోలతో కలిసి తెరను పంచుకునేందుకు నాగ్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణు, కార్తీ లాంటి హీరోలతో కలిసి నటించిన నాగ్, త్వరలో సక్సెస్ ఫుల్ హీరో నానితో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం రాజుగారి గది 2 ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కింగ్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య, నాగార్జున, నానిల కాంబినేషన్ లో సినిమాను రూపొందించనున్నారు. శ్రీరామ్ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే ఓకె చెప్పానన్న నాగ్, ఈ సినిమాలో నాని క్యారెక్టర్ కడుపుబ్బ నవ్విస్తుందన్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించనున్నారు. -
యంగ్ డైరెక్టర్‌తో నాగ్, నాని..?
టాలీవుడ్ తెరపై మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరోలు సత్తా చాటుతుండటంతో సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం రాజుగారి గది 2 షూటింగ్ తో పాటు అఖిల్ రెండో సినిమా నిర్మాణం, నాగచైతన్య సమంతల పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు సీనియర్ హీరో నాగార్జున. ఈ పనులన్ని పూర్తయ్యాక ఓ మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతున్నారట. తాజా సమాచారం ప్రకారం.. నాని, సీనియర్ హీరో నాగ్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడట. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నా.. నాగ్ నుంచి గాని, నాని నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాని.. ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత నాగ్, నానిల కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఊహించని మలుపులతో...
సుధీర్‌బాబు కొత్త చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. శ్రీరామ్ ఆదిత్యను దర్శకునిగా పరిచయం చేస్తూ, విజయ్‌కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వామికా గబ్బి కథానాయిక. ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ కృష్ణ మూడో కుమార్తె ప్రియదర్శిని కెమెరా స్విచాన్ చేయగా, రెండో కుమార్తె మంజుల క్లాప్ ఇచ్చారు. పెద్ద కుమార్తె పద్మావతి గౌరవ దర్శకత్వం వహించారు. మంజుల భర్త సంజయ్ స్వరూప్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ - ‘‘పలు లఘు చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య ప్రతిభ మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నా. కొత్త కథతో, ఊహించని మలుపులతో ఆసక్తికరంగా ఉంటూనే, వినోదాన్ని పంచే చిత్రమిది’’ అన్నారు. జూన్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఫ్రెష్‌గా అనిపించే కథా, కథనాలతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ గున్నాల-కార్తీక్, కెమెరా: శ్యామ్ దత్, సంగీతం: ఎం.ఆర్. సన్నీ.