హీరో మహేష్ బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ‘భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్’వంటి చిత్రాలతో కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రామానాయుడు స్టూడియోలో నవంబర్ 10న గ్రాండ్ లెవల్లో జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
అయితే ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు టాలీవుడ్ టాక్. మహేష్ కోసం అతడి మేనల్లుడిని దీవించడానికే షూటింగ్ పూజాకార్యక్రమంలో రామ్‌చరణ్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికి ప్రకటన రాలేదు. ఇక ఈ చిత్రంలో అశోక్ సరసన ‘ఇస్మార్ట్’బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment