Galla Ashok
-
హీరో ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా రానా దగ్గుబాటి
-
మహేశ్‌బాబులా అశోక్ ముందుకెళ్లిపోతాడు: రాఘవేంద్రరావు
‘‘నాకు హీరో కావాలనుంది’ అని అశోక్ చిన్నప్పటి నుంచి అనేవాడు.. ‘రాజకుమారుడు’తో మహేశ్‌బాబుని పరిచయం చేశాను. మహేశ్‌లా అశోక్ కూడా టకటకా ముందుకెళ్లిపోతాడు’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ–‘‘శ్రీమంతుడు’కి అశోక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. మహేశ్‌గారు ఎలా నటిస్తున్నారో నోట్ బుక్‌లో రాసుకుంటున్నప్పుడే సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో తెలిసింది’’ అన్నారు. గల్లా పద్మావతి మాట్లాడుతూ– ‘‘నటన అంటే ఇష్టం’ అని అశోక్ చెప్పినప్పుడు లైట్ తీసుకున్నాం. సింగపూర్, అమెరికాలో చదువుకుని వచ్చాక కూడా తనలో నటనపై అదే ప్యాషన్ కనిపించింది. అందుకే నేను, జయదేవ్‌గారు ప్రోత్సహించాం’’ అన్నారు. ‘‘ఈ సంక్రాంతికి మా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎంపీ గల్లా జయదేవ్. హీరో రానా, నిర్మాత ఆదిశేషగిరి రావు పాల్గొన్నారు. -
తాతకు బహుమతి
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు అశోక్. కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయనకు ఓ బహుమతి అందించింది ఈ చిత్రబృందం. కృష్ణ సూపర్ హిట్ పాటల్లో ‘యమలీల’ సినిమాలోని ‘జుంబారే జుజుంబారే...’ పాట ఒకటి. ఇప్పుడు ఇదే పాటను రీమిక్స్ చేశారు ఆయన మనవడు గల్లా అశోక్. ఈ పాట టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. కృష్ణ స్టెప్స్‌ను అనుకరిస్తూ అశోక్ గల్లా ఈ రీమిక్స్‌కి స్టెప్స్ వేశారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. -
మహేష్ మేనల్లుడు అశోక్ లుక్ రివీల్..
హీరో మహేష్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేశవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో.. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఆదివారం అశోక్ పుట్టిన సందర్భంగా ఈ చిత్రంలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. టేబుల్‌పై కూర్చొని ల్యాంప్ వెలుగులో పుస్తకం చదువుతున్న అశోక్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత పద్మావతి మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని కోరారు. ప్రభుత్వాలు, డాక్టర్లు, పోలీసులు చెబుతున్న సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగస్వాములు కావాలన్నారు. ఇంకా ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, సత్యా, అర్చనా సౌందర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 50 శాతం పూరైనట్టుగా చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. -
అశోక్ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే
‘‘గల్లా జయదేవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను సోదరుడిలా భావిస్తారు. ఆయన నిర్మాతగా కొడుకు అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. పద్మావతిగారికి, అశోక్‌కి, నిధీ అగర్వాల్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయవుతున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రానా కెమెరా స్విచ్చాన్ చేయగా, రామ్‌చరణ్ క్లాప్ ఇచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మంచి కథ, కథనాలతో అశోక్ హీరోగా పరిచయం కాబోతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు రానా. గల్లా జయదేవ్ మాట్లాడుతూ–‘‘టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో అశోక్ డిగ్రీ పూర్తి చేశాడు. మా మామ కృష్ణగారి సినిమాల్లో అశోక్ చిన్నప్పుడు నటించాడు. తన తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే. మహేశ్‌బాబు ‘నాని’ సినిమాలోనూ అశోక్ నటించాడు. మా బ్యానర్లో కేవలం సినిమాలే కాదు.. టెలివిజన్ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘హీరో కావాలని అశోక్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు’’ అన్నారు పద్మావతి. ‘‘ఈ కథకు అశోక్ కరెక్ట్‌గా సరిపోతాడు’’ అని శ్రీరామ్ ఆదిత్య అన్నారు. ‘‘నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’అన్నారు గల్లా అశోక్. ఈ కార్యక్రమంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, నటులు వీకే నరేష్, సుధీర్‌బాబు, సుశాంత్, నిధీ అగర్వాల్, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, రచయిత సత్యానంద్, అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్, నన్నపనేని రాజకుమారి, డా.రమాదేవి పాల్గొన్నారు. -
మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్ ట్వీట్
సూపర్‌స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, వ్యాపారవేత్త, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న తొలి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆదివారం రామానాయుడు స్టూడియాలో ప్రారంభమైన ఈ వేడుకకు ఘట్టమనేని, గల్లా కుటుంబసభ్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల హజరయ్యారు. సీనియర్ హీరో కృష్ణ, హీరోలు రామ్‌చరణ్, రానాలు ముఖ్య అతిథులుగా ఈ వేడుకలో పాల్గొన్నారు. హీరోహీరోయిన్లపై రామ్‌చరణ్ క్లాప్ నివ్వగా.. హీరో రానా కెమెరా స్విచ్చాన్ చేశాడు. సీనియర్ హీరో కృష్ణ చిత్రయూనిట్‌కు మూవీ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఇక తన మేనల్లుడి సినిమా లాంచింగ్ కావడంతో మహేష్ ట్విట్టర్లో స్పందించాడు. ఈ సందర్భంగా తన మేనల్లుడికి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ‘అశోక్ గల్లా తొలి చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఇది నీ జీవితంలో బిగ్ డే. అంతా మంచే జరగాజరగాలని శుభాకాంక్షలు తెలుపుతున్నా. కష్టపడి పనిచేయ్, నీ శక్తి మేరకు ప్రయత్నించు.. విజయం నీ వెనకాల వస్తుంది. చిత్ర యూనిట్‌కు గుడ్ లక్’అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ‘భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్’వంటి చిత్రాలతో కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రంలో అశోక్ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. It’s official !! @AshokGalla_'s first day of shoot !! Want to wish u all the very best on this big day of yours!! Work hard and give it all u’ve got! Success will follow 🤗🤗 good luck to the entire team...👍👍👍 pic.twitter.com/xKtP9TJz0f — Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2019 -
మహేష్ మేనల్లుడి కోసం మెగాపవర్ స్టార్!
హీరో మహేష్ బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ‘భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్’వంటి చిత్రాలతో కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రామానాయుడు స్టూడియోలో నవంబర్ 10న గ్రాండ్ లెవల్లో జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు టాలీవుడ్ టాక్. మహేష్ కోసం అతడి మేనల్లుడిని దీవించడానికే షూటింగ్ పూజాకార్యక్రమంలో రామ్‌చరణ్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికి ప్రకటన రాలేదు. ఇక ఈ చిత్రంలో అశోక్ సరసన ‘ఇస్మార్ట్’బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
మహేశ్ మేనల్లుడితో ‘ఇస్మార్ట్’బ్యూటీ
ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబర్ 10న పలువురు సినీ ప్రముఖు ల సమక్షంలో గ్రాండ్ లాంచ్కానుంది. రీసెంట్గా `ఇస్మార్ట్ శంకర్` వంటి సూపర్‌హిట్ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్‌ను హీరోయిన్గా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
మహేశ్ మేనల్లుడు హీరో
హీరో మహేశ్‌బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్’ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 10న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. తనదైన స్టైల్లో డిఫరెంట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు శ్రీరామ్ ఆదిత్య. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి. -
మహేశ్ బాబు అల్లుడి మూవీ లాంచ్ డేట్ పిక్స్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. `భలే మంచి రోజు`, `శమంతక మణి`, `దేవదాస్` చిత్రాలతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. కమర్షియల్ విజయాలను దక్కించుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో నవంబర్ 10న గ్రాండ్ లెవల్లో జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. తనదైన స్టైల్లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
ఈ సారైనా మొదలవుతుందా!
సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రముఖ వ్యాపార వేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ల కుమారుడు గల్లా అశోక్ హీరో ఎంట్రీ ఇచ్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో కృష్ణా రెడ్డి దర్శకత్వంలో అశోక్‌ను హీరోగా పరిచయం చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు గల్లా అశోక్. ఇటీవల నాని, నాగార్జున హీరోగా దేవదాస్ సినిమాను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సారైనా అశోక్ డెబ్యూ సినిమా సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి. -
మహేష్ మేనల్లుడి సినిమా ప్రారంభం
-
సూపర్ స్టార్ వారసుడి సినిమాలో నభా
డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. దాదాపు 30 దశాబ్దాలకు పైగా వెండితెరపై మెరిసిన ఈ సూపర్ స్టార్ తరువాత తన వారసుడిగా మహేష్ బాబును పరిచయం చేశాడు. ఆ తరువత కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, నవీన్ కృష్ణలు వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా మరో అందాల నటుడు ఈ ఫ్యామిలీ నుంచి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రముఖ వ్యాపార వేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. అశోక్‌ను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను స్టార్ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమాను తెరకెక్కించిన కృష్ణారెడ్డి దర్శకత్వంలో అశోక్ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమాలో అశోక్‌కు జోడిగా నన్ను దోచుకుందువటే ఫేం నభా నటేష్ తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దరశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
సూపర్ స్టార్ వారసుడిగా మరో హీరో
డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. దాదాపు 30 దశాబ్దాలకు పైగా వెండితెరపై మెరిసిన ఈ సూపర్ స్టార్ తరువాత తన వారసుడిగా మహేష్ బాబును పరిచయం చేశాడు. ఆ తరువత కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, నవీన్ కృష్ణలు వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా మరో అందాల నటుడు ఈ ఫ్యామిలీ నుంచి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రముఖ వ్యాపార వేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ల కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకున్న అశోక్ సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడట. తమ సొంత బ్యానర్ లోనే అశోక్ ఎంట్రీ ఉంటుందని గల్లా జయదేవ్ కూడా ప్రకటించటంతో.. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రాబోయే మరో నటుడి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.