డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. దాదాపు 30 దశాబ్దాలకు పైగా వెండితెరపై మెరిసిన ఈ సూపర్ స్టార్ తరువాత తన వారసుడిగా మహేష్ బాబును పరిచయం చేశాడు. ఆ తరువత కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, నవీన్ కృష్ణలు వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా మరో అందాల నటుడు ఈ ఫ్యామిలీ నుంచి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రముఖ వ్యాపార వేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. అశోక్‌ను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను స్టార్‌ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమాను తెరకెక్కించిన కృష్ణారెడ్డి దర్శకత్వంలో అశోక్ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమాలో అశోక్‌కు జోడిగా నన్ను దోచుకుందువటే ఫేం నభా నటేష్ తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దరశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment