
‘‘నాకు హీరో కావాలనుంది’ అని అశోక్ చిన్నప్పటి నుంచి అనేవాడు.. ‘రాజకుమారుడు’తో మహేశ్‌బాబుని పరిచయం చేశాను. మహేశ్‌లా అశోక్ కూడా టకటకా ముందుకెళ్లిపోతాడు’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ–‘‘శ్రీమంతుడు’కి అశోక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. మహేశ్‌గారు ఎలా నటిస్తున్నారో నోట్ బుక్‌లో రాసుకుంటున్నప్పుడే సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో తెలిసింది’’ అన్నారు. గల్లా పద్మావతి మాట్లాడుతూ– ‘‘నటన అంటే ఇష్టం’ అని అశోక్ చెప్పినప్పుడు లైట్ తీసుకున్నాం. సింగపూర్, అమెరికాలో చదువుకుని వచ్చాక కూడా తనలో నటనపై అదే ప్యాషన్ కనిపించింది. అందుకే నేను, జయదేవ్‌గారు ప్రోత్సహించాం’’ అన్నారు. ‘‘ఈ సంక్రాంతికి మా సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎంపీ గల్లా జయదేవ్. హీరో రానా, నిర్మాత ఆదిశేషగిరి రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment