సూపర్ స్టార్ వారసుడిగా మరో హీరో
డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. దాదాపు 30 దశాబ్దాలకు పైగా వెండితెరపై మెరిసిన ఈ సూపర్ స్టార్ తరువాత తన వారసుడిగా మహేష్ బాబును పరిచయం చేశాడు. ఆ తరువత కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, నవీన్ కృష్ణలు వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా మరో అందాల నటుడు ఈ ఫ్యామిలీ నుంచి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రముఖ వ్యాపార వేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ల కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకున్న అశోక్ సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడట. తమ సొంత బ్యానర్ లోనే అశోక్ ఎంట్రీ ఉంటుందని గల్లా జయదేవ్ కూడా ప్రకటించటంతో.. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రాబోయే మరో నటుడి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.