సూపర్‌స్టార్ మహేశ్ బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. `భలే మంచి రోజు`, `శమంతక మణి`, `దేవదాస్` చిత్రాలతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. కమర్షియల్ విజయాలను దక్కించుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రామానాయుడు స్టూడియోలో నవంబర్ 10న గ్రాండ్ లెవల్లో జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. తనదైన స్టైల్లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నవంబర్ 10న అశోక్ గల్లా డెబ్యూ మూవీ గ్రాండ్ లాంచ్
Published Thu, Nov 7 2019 4:56 PM | Last Updated on Thu, Nov 7 2019 4:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment