
సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రముఖ వ్యాపార వేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ల కుమారుడు గల్లా అశోక్ హీరో ఎంట్రీ ఇచ్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో కృష్ణా రెడ్డి దర్శకత్వంలో అశోక్‌ను హీరోగా పరిచయం చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
దీంతో లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు గల్లా అశోక్. ఇటీవల నాని, నాగార్జున హీరోగా దేవదాస్ సినిమాను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సారైనా అశోక్ డెబ్యూ సినిమా సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment