‘నా సినిమా రీమేక్‌ కాదు’ | Director Sriram Aditya Announced That Nani Nagarjuna Movie Is Not A Remake | Sakshi
Sakshi News home page

Published Wed, May 23 2018 12:30 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Director Sriram Aditya Announced That Nani Nagarjuna Movie Is Not A Remake - Sakshi

కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ మూవీ.. రీమేక్‌ అంటూ రూమర్స్‌ వచ్చాయి. సోషల్‌మీడియా హవా కొనసాగుతున్న ఈ తరుణంలో ఇలాంటి రూమర్స్‌ మరింత వేగంగా అందరికి చేరుతాయి. దీనిపై చిత్రదర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య స్పందించారు.

తాను నాగ్‌, నానిలతో రూపొందిస్తున్న మూవీ ఏ సినిమాకు రీమేక్‌ కాదంటూ, బయట వస్తున్నరూమర్స్‌లో ఏ మాత్రం నిజం లేదంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. నిన్న సోషలమీడియాలో ఈ మూవీ బాలీవుడ్‌ సినిమా జానీ గద్దర్‌కు రీమేక్‌ అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement