
కృష్ణార్జున యుద్ధం సినిమాతో షాక్ తిన్న నాని ప్రస్తుతం సీనియర్ హీరో నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా నాని డాక్టర్‌గా నటిస్తుండగా నాగార్జున డాన్ పాత్రలో కనిపించనున్నారు. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అశ్వనిదత్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వినాయకచవితికి ఒక్క రోజు ముందు సెప్టెంబర్ 12న రిలీజ్‌చేయాలని భావిస్తున్నారట.
ఈ సినిమాలో నాగ్ సరసన మళ్ళీరావా ఫేం ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా నాని సరసన ఛలో ఫేం రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతానికి సెప్టెంబర్ బరిలో స్టార్ హీరోల సినిమాలేవి లేకపోవటంతో ఎలాగైన అదే సీజన్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్వ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment