మ్యూజికల్‌ మల్టీస్టారర్‌ | Nani, Akkineni Nagarjuna will unite for Sriram Aditya's next | Sakshi
Sakshi News home page

మ్యూజికల్‌ మల్టీస్టారర్‌

Published Tue, Mar 13 2018 12:06 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Nani, Akkineni Nagarjuna will unite for Sriram Aditya's next - Sakshi

నాని, నాగార్జున

నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఓ మల్టీస్టారర్‌ మూవీ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 18న ఉగాది రోజు నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. ఈ మల్టీస్టారర్‌ కూడా మ్యూజికల్‌గా ఉండాలని పూర్తీగా దృష్టి పెడుతున్నాం.

మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ అమెరికాలో జరుగుతున్నాయి. మా బ్యానర్‌లో చేసిన మల్టీస్టారర్స్‌ మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా హిట్‌ అయి మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకువస్తుంది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఎంటర్‌టైన్‌ చేసే డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ ఇది. నాగార్జున, నాని వంటి హీరోలతో వైజయంతి బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్‌దత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement