
నాగార్జున, రష్మికా మండన్నా, నానీ
ఒకరు డాన్, మరొకరు డాక్టర్. బ్రదర్స్ లాంటి రిలేషన్‌షిప్. కానీ బ్రదర్స్ కాదు. ఒకరికేమో జోడీ కుదిరింది. మరొకరు తన జోడీని వెతుక్కునే పనిలో ఉన్నారు. ఇంతకీ ఎవరీ డీ బ్రదర్స్, ఎవరు వాళ్ల జోడీ అంటే?.. నాగార్జున, నానీ హీరోలుగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. రెగ్యులర్ షూటింగ్ ఉగాది రోజున స్టార్ట్ అయింది. ఈ సినిమాలో నాగార్జున డాన్‌గా, నానీ డాక్టర్‌గా కనిపిస్తారని సమాచారం.
ఇందులో నానీకి జోడీగా ‘ఛలో’ ఫేమ్ రష్మికా మండన్నాను ఫిక్స్ చేశారు. నాగార్జునకు జోడీగా ఇలియానా పేరును పరిశీలిస్తున్నారట చిత్రబృందం. అమలా పాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక సీన్లోకొస్తుందా? ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనలైజ్ అవుతారా? తెలియాలంటే జస్ట్ వారం పది రోజులు ఆగితే చాలు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్‌కి చాలా స్కోప్ ఉంటుందని చిత్రబృందం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment