ఊహించని మలుపులతో... | Sudheer Babu's new film launched | Sakshi
Sakshi News home page

ఊహించని మలుపులతో...

Published Sat, Mar 7 2015 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

ఊహించని మలుపులతో...

ఊహించని మలుపులతో...

 సుధీర్‌బాబు కొత్త చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. శ్రీరామ్ ఆదిత్యను దర్శకునిగా పరిచయం చేస్తూ, విజయ్‌కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వామికా గబ్బి కథానాయిక. ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ కృష్ణ మూడో కుమార్తె ప్రియదర్శిని కెమెరా స్విచాన్ చేయగా, రెండో కుమార్తె మంజుల క్లాప్ ఇచ్చారు. పెద్ద కుమార్తె పద్మావతి గౌరవ దర్శకత్వం వహించారు.
 
 మంజుల భర్త సంజయ్ స్వరూప్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ - ‘‘పలు లఘు చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య ప్రతిభ మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నా. కొత్త కథతో, ఊహించని మలుపులతో ఆసక్తికరంగా ఉంటూనే, వినోదాన్ని పంచే చిత్రమిది’’ అన్నారు. జూన్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఫ్రెష్‌గా అనిపించే కథా, కథనాలతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ గున్నాల-కార్తీక్, కెమెరా: శ్యామ్ దత్, సంగీతం: ఎం.ఆర్. సన్నీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement