new film
-
అమర్ దీప్-సుప్రిత సినిమా: ఆడియన్స్‌తోనే టైటిల్ రివీల్
ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు సినిమాల ప్రమోషన్స్ వినూత్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల మేకర్స్.. తమ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. డిఫరెంట్‌గా ప్లాన్ చేసి.. సినిమాపై బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ సినిమా మేకర్స్ కూడా ప్రమోషన్స్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. సినిమాకి టైటిల్ పెట్టే చాన్స్ ఆడియన్స్‌కే ఇచ్చేశారు. అదే బిగ్‌బాస్ ఫేం అమర్దీప్ కొత్త సినిమా. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే షూటింగ్ పూర్తి కాకముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.‘సినిమా మాది - టైటిల్ మీది’ అని ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేస్తూ, తమ సినిమా సూట్ అయ్యే టైటిల్ ను ఆడియన్స్ నిర్ణయించాలని కోరారు. అనుకున్న టైటిల్ ని+91 8985713959 నంబర్‌కి వాట్సాప్ ద్వారా పంపించాలని ప్రేక్షకులను ఆహ్వానించారు. సెలెక్ట్ అయిన టైటిల్ ని సినిమా టీం స్వయంగా ప్రేక్షకుల ఇంటి వద్దకి వచ్చి వారితోనే టైటిల్ రివీల్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. View this post on Instagram A post shared by M3 Media (@m3_media959) -
కాంతార తరహాలో.. ఆది పినిశెట్టి హీరోగా కొత్త చిత్రం
నటుడు ఆది పినిశెట్టి తమిళంలో కథానాయకుడిగా నటించి చాలా కాలం అయ్యింది. ఈయన ఇటీవల విలనిజం ప్రదర్శించేందుకే మొగ్గుచూపుతున్నారు. అలా ఇటీవల ది వారియర్ వంటి కొన్ని చిత్రాల్లో నటించి దుమ్ము రేపారు. కాగా తాజాగా ఒక తమిళ చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ఎంపీ.గోపి దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మలైయన్, వేల్ మురుగన్ బోరింగ్ వెల్స్ చిత్రాలను తెరకెక్కించారు. కాగా తాజాగా ఇటీవల విడుదలై కన్నడతో పాటు దక్షిణాది భాషల్లోనూ సంచలన విజయాన్ని సాధించిన కాంతార చిత్రం తరహాలో గ్రామ దేవత ఇతివృత్తంతో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని దర్శకుడు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. -
కొత్త సినిమాను అనౌన్స్ చేసిన నాగశౌర్య
నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘రంగబలి’ టైటిల్ ఖరారు చేశారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఉగాది సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినూత్నమైన కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: దివాకర్‌మణి. -
ఎన్టీఆర్ బావమరిది కోసం రంగంలోకి దిగిన ప్రముఖ నిర్మాత
నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది జూ.ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నితిన్ నార్నే కూడా హీరోగా లాంచ్ అయ్యాడు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగ్నేష దర్శకత్వంలో ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. కొఆగిపోయిన ఈ సినిమాను నిర్మాత నాగవంశీ భుజాన వేసుకొని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడట. ఎన్టీఆర్‌కు నాగవంశీ వీరాభిమాని అని పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ అభిమానంతో, కథ కూడా నచ్చడంతో కొన్ని మార్పులు చేసి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారట. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
మోహన్‌బాబు, మంచు లక్ష్మీ కలిసి నటించిన సినిమా షూటింగ్ పూర్తి
మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వంశీకృష్ణ మళ్ల మాట్లాడుతూ.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. ఇందులోని ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌కి నచ్చేలా ఉంటుంది అన్నారు. సముద్ర ఖని, సిద్ధిక్, విశ్వంత్, చైత్రా శుక్ల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజామణి, కెమెరా: గోకుల్ భారతి -
'యజ్ఞం' డైరెక్టర్‌తో రాజ్‌తరుణ్ కొత్త సినిమా ఆరంభం
యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి హిట్ చిత్రాల ఫేమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరా సామి’ అనే సినిమా ఆరంభమైంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియాపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎస్ రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. మరో నిర్మాత పోకూరి బాబూరావు స్క్రిప్‌్టను ఏఎస్ రవికుమార్కి అందించారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, దర్శకులు వీరశంకర్, రాజా వన్నెం రెడ్డి, నిర్మాతలు టి.ప్రసన్న కుమార్, బెక్కెం వేణుగోపాల్, డీయస్ రావు, నటి–నిర్మాత జీవితా రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, సంగీతం: జేబీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత. బెక్కెం రవీందర్. తిరగబడరా సామి! -
రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్.. బాలీవుడ్ నటి ఫిదా
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఆర్సీ15'. డైరెక్టర్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పూర్తిస్థాయిలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. తాజాగా రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టన్నింగ్ లుక్‌లో ఉన్న పిక్స్ చెర్రీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'స్టిల్ ఇన్ థాట్స్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. చరణ్ లుక్ చూసి ఫిదా అయినా బాలీవుడ్ కత్రినా కైఫ్ లైక్ చేసింది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌లో షూట్లో ఉన్నా ఫోటోను కియారా అద్వానీ అతని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు ఎస్జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథ అందించగా.. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
విష్ణు విశాల్ కొత్త సినిమా 'మట్టి కుస్తీ' రిలీజ్ డేట్ ఫిక్స్
వెండితెరపై రెజ్లర్‌గా తన సత్తా ఏంటో చూపేందుకు విష్ణు విశాల్ రెడీ అయ్యారు. విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మట్టి కుస్తీ. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఎఫ్ఐఆర్ చిత్రం తర్వాత హీరోలు రవితేజ, విష్ణు విశాల్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా డిసెంబర్2న రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: జస్టిన్ ప్రభాకరణ్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
చెఫ్‌గా మారిపోయిన హీరోయిన్ అనుష్క.. ఫోటో వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి గరిట పట్టారు. తన వంటలను కస్ట్మర్స్కి రుచి చూపించేందుకు చెఫ్‌గా మారారు. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. ఆమె నటిస్తున్న తాజా చిత్రం కోసమే. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తున్నారు. కాగా సోమవారం (నవంబర్ 7) అనుష్క బర్త్‌డేని పురస్కరించు కుని అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘మా సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. On my Birthday I am happy to Introduce myself as Masterchef 'Anvitha Ravali Shetty' from my upcoming project with @NaveenPolishety #MaheshBabuP #NiravShah @UV_Creations 😊 Can’t wait to meet u all on Big Screen 🤞🏻❤️ pic.twitter.com/jsVFlTDwMM — Anushka Shetty (@MsAnushkaShetty) November 7, 2022 -
గ్రాండ్‌గా నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం
నాగశౌర్య హీరోగా ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. బేబీ అద్వైత, భవిష్య సమర్పణలో వైష్ణవి ఫిలింస్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా.అశోక్ కుమార్ చింతలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబ శివారెడ్డి, ఫ్రాటెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందజేశారు. ‘‘యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలున్నాయి. నాగశౌర్య కెరీర్లో 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు శౌర్య’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జయరాజ్, కెమెరా: వెట్రి పళనిసామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి భాస్కర్. -
ఆసక్తికరమైన టైటిల్‌తో ‘తీస్ మార్ ఖాన్’ డైరెక్టర్ కొత్త చిత్రం!
నాటకం, సుందరి, తీస్ మార్ ఖాన్ వంటి సినిమాలతో దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కల్యాణ్ జీ గోగణ. ఫలితాలతో సంబంధం లేకుండా భిన్న చిత్రాలు, విభిన్నమైన జానర్లలో సినిమాలు తీస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. ఇటీవల తీస్మార్ ఖాన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పకలరించిన కల్యాణ్.. తాజాగా మరో విభిన్నమైన తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. నవయుగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రాబోతోన్న ఈ చిత్రానికి కళింగరాజు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవికుమార్ , ఐ. రవి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేహా సింగ్ సమర్పకురాలిగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఖుషీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నటుడు ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది. -
వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నరేష్ అగస్త్య కొత్త చిత్రం
‘పూలరంగడు’ ఫేమ్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సేనాపతి చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని జయదుర్గాదేవి మల్టీమీడియా & డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అనిల్ రెడ్డి సమర్పణలో నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. జులై నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..'దర్శకులు వీరభద్రం చౌదరితో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. వీరభద్రం చౌదరి గారు ఒక అద్భుతమైన కథ చెప్పారు. కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం. కథ చాలా వండర్ ఫుల్ గా వచ్చింది. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే వెల్లడిస్తాం' అన్నారు. -
Naga Shaurya:బర్త్‌డే గిఫ్ట్ అదిరిందిగా
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్య పుట్టినరోజు కానుకగా తనకొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ. నటుడుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న నాగ శౌర్య ప్రస్తుతం నాలుగు మూవీలతో బిజీబిజీగా ఉన్నాడు. 'కృష్ణ వ్రింద విహారి' సరికొత్త మూవీలో వెరైటీ లుక్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శౌర్య ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతున్నాడు. కృష్ణ వృంద ప్రేమ కథగా ఈ మూవీతెరకెక్కనుంది.(Naga Shaurya: టాలెంటెడ్ హీరో కెరియర్ అండ్ గ్రోత్ ఎలా ఉందంటే!) అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మూవీలో షిర్లీ సేతియా హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో సినియర్ నటి రాధిక ఒక ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. కాగా నాగశౌర్య తన లేటెస్ట్ ‘లక్ష్య, వరుడు కావలెను’ మూవీలను ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. It's a Crazy experience & #Krishna will be Loved by all! ❤️ Here's the First Look Poster of #NS22 #IRA4 😍 ✨ #𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐕𝐫𝐢𝐧𝐝𝐚𝐕𝐢𝐡𝐚𝐫𝐢 ✨@ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @mahathi_sagar @YEMYENES @ira_creations @UrsVamsiShekar pic.twitter.com/VHbemaEPFv — Naga Shaurya (@IamNagashaurya) January 22, 2022 -
హీరోగా డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా.. షూటింగ్ స్టార్ట్
చెన్నై: డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సంతోష్ విజయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మినీ స్టూడియో పతాకంపై ఎస్.వినోద్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభుదేవాకి జంటగా వరలక్ష్మీశరత్‌కుమార్, రైసా విల్సన్ కథానాయికలుగా నటించనున్నారు. దీనికి బల్లు ఛాయాగ్రహణం, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యానర్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. -
రాఖీ.. రాణీ ప్రేమకథ!
‘గల్లీబాయ్’ వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ సినిమాలో జంటగా నటించనున్నారు. దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ (2016) తర్వాత కరణ్ మళ్లీ దర్శకత్వం వహించనున్న చిత్రం ఇదే. ‘‘నాకు ఎంతో ఇష్టమైన దర్శకత్వ బాధ్యతలను మరోసారి స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు కరణ్. ఇక ఈ చిత్రంలో సీనియర్ తారలు ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. రణ్వీర్ గ్రాండ్ మదర్‌గా జయా బచ్చన్, ఆలియా భట్ గ్రాండ్ పేరెంట్స్‌గా ధర్మేంద్ర, షబానా కనిపిస్తారని టాక్. -
ఆది సాయికుమార్ కొత్త సినిమా.. కీలక పాత్రలో సునీల్
వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ చెప్పిన కథ నచ్చింది. ఆది సాయికుమార్‌ను మరో కొత్త డైమన్షన్‌లో ప్రెజంట్ చేసే చిత్రమిది. అలాగే హీరో సునీల్‌గారు మా చిత్రంలో ఓ కీ రోల్లో కనిపించబోతున్నారు. అదేంటనేది సినిమా చూడాల్సిందే. పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి.. సునీల్‌గారైతే బావుంటుందని ఆయన్ని కలిసి అడగ్గానే ఆయన నటించడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్. ఈ చిత్రాన్ని మా బ్యానర్‌పై ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నాం. ఎన్నో చిత్రాలకు సక్సెస్ఫుల్ మ్యూజిక్‌ను అందించిన సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మణికాంత్ ఎడిటర్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోయే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు. -
అంతరిక్షంలో షూటింగ్ జరుపుకోనున్న తొలి చిత్రం ఇదే!
అంతరిక్షం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నిజంగా అంతరిక్షంలోనే షూటింగ్ జరిగితే! సాధ్యమేనా అనుకుంటున్నారా! సాధ్యం కానుంది. రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మోస్ త్వరలో అంతరిక్షంలో షూటింగ్ జరపనున్నామని ప్రకటించింది. ‘ఛాలెంజ్’ టైటిల్‌తో ఓ స్పేస్ ఫిల్మ్ తీయనున్నామని, ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలోనే జరుపుతామని సదరు ఏజెన్సీ పేర్కొంది. రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ (36) ప్రధాన పాత్రలో క్లిమ్ షిఫెన్కో (37) దర్శకత్వంలో ‘ఛాలెంజ్’ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్ రాకెట్ ద్వారా ఈ సినిమాని లాంచ్ చేస్తారట. ఈలోపు యూలియా, క్లిమ్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుందట ఈ సినిమాను తీసే రష్యన్ ఏజెన్సీ. జీరో గ్రావిటీ ఉన్నప్పుడు విమానాన్ని నడపడం, ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో కిందకు దిగడం వంటి అంశాల్లో యూలియా, క్లిమ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారు. ఈ ఇద్దరితో పాటు అలెనా మోర్డోవినా, కెమెరామేన్ అలెక్సీ డుడిన్ కూడా అంతరిక్షానికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే టామ్‌క్రూజ్ ప్రధాన పాత్రధారిగా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఓ సినిమా చేయాలనుకుంది. ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలో జరుపుతామని దాదాపు ఏడాది క్రితం నాసా పేర్కొంది. ఇప్పుడు అంతరిక్షంలో షూటింగ్ చేసేందుకు రష్యా రెడీ అవుతోంది. దీంతో అంతరిక్షంలో షూటింగ్ జరిపిన తొలి దేశంగా గుర్తింపు పొందేందుకు రష్యా, అమెరికా పోటీ పడుతున్నాయని హాలీవుడ్ వర్గాల్లో కథనాలు వస్తున్నాయి. చదవండి: ఈ సినిమాలో ఒకటే పాత్ర ఉంటుందట -
‘ది కశ్మీరీ ఫైల్స్’.. బెదిరింపులకు భయపడను
వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించిన చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, ప్రకాశ్ బెల్వాడి, మృణాల్ కులకర్ణి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించిన నిజాలు ఇప్పటి తరంలో చాలామందికి తెలియదు. అందుకే ఈ సినిమా తీయాలనుకున్నాను. ఏప్రిల్‌లో సినిమా రిలీజ్ అనుకుంటున్నాం. ఈ సినిమా షూటింగ్‌ను జమ్మూ–కశ్మీర్లో చేసినప్పుడు ఇబ్బందులు ఎదురవలేదు. కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ నన్ను డైరెక్ట్‌గా బెదిరించలేదు. కానీ బెదిరిస్తున్నట్లు ముంబైలో ఉన్న నా స్నేహితులు చెప్పారు. మా సినిమా పోస్టర్, టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. అలాంటప్పుడు సినిమా ఎలా ఉంటుందో వారి కెలా తెలుస్తుంది? ప్రజలకు వాస్తవాలు చూపిస్తున్నప్పుడు భయమెందుకు? ఎవరి బెదిరింపులకూ భయపడి సినిమా రిలీజ్ ఆపం. ఈ సినిమా వెనక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదు. ఇలాంటి వాస్తవ కథలను తెరకెక్కిస్తున్నప్పుడు ప్రభుత్వాలు అండగా ఉండాలి. అప్పుడే మరిన్ని సినిమాలను ధైర్యంగా తీయగలుగుతాం. ప్రస్తుతం ‘ది కశ్మీరీ ఫైల్స్, ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘రాజ రాజ చోర’ చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘కార్తికేయ 2, గూఢచారి 2, అబ్దుల్ కలాం బయోపిక్’ త్వరలో ఆరంభమవుతాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ని హిందీ–తెలుగులో నిర్మిస్తాం’’ అన్నారు. -
తల్లీ కొడుకుల అనుబంధం
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ పూర్తయింది. శ్రీకార్తీక్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్లో 30వ చిత్రం కావడం విశేషం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు (‘ఖైదీ’ నిర్మాత) నిర్మించారు. రీతూ వర్మ కథానాయికగా నటించగా, నటి అక్కినేని అమల ఒక ముఖ్య పాత్ర చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు రాయడం విశేషం. ‘‘ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకుల్లో శర్వానంద్‌కు అమితమైన ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులనే కాకుండా అటు యూత్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సంగీతం: జేమ్స్ బిజోయ్, కెమెరా: సుజీత్ సారంగ్. -
సుకుమార్ స్క్రీన్‌ప్లేతో..
సాయితేజ్ కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎ¯Œ ప్రసాద్ ఈ చిత్రం నిర్మించనున్నారు. సుకుమార్ వద్ద రచన శాఖలో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని రాయడంతోపాటు షట్‌చక్రంలో ఓ కన్నుని ఈ పోస్టర్లో పొందుపరిచారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. -
రజనీతో లారెన్స్ సినిమా?
రజనీకాంత్‌కి కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ వీరాభిమాని. తన అభిమాన హీరోని డైరెక్ట్ చేయాలని ఏ డైరెక్టరైనా అనుకుంటారు. లారెన్స్ కూడా అనుకున్నారు. ఇప్పుడు ఆ కల నిజం కాబోతోందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ చేయబోయే తదుపరి చిత్రాల్లో లారెన్స్ సినిమా కూడా ఒకటనే వార్త తమిళ ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ అనే సినిమా చేస్తున్నారు రజనీ. అది రజనీ కెరీర్లో 168వ సినిమా. ఆ తర్వాత కమల్‌హాసన్ బ్యానర్లో ఓ సినిమా (169వ చిత్రం) కమిట్ అయ్యారు. 170వది రాఘవ లారెన్స్ సినిమా అవుతుందని టాక్. ప్రస్తుతం రజనీతో కథా చర్చలు జరుపుతున్నారట లారెన్స్. -
నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం
-
‘మృగం’ స్క్రిప్ట్ రెడీ.. స్టార్ హీరోతో చేస్తా
‘‘రాహు’ సినిమాలో కథానాయికకు ఓ వ్యాధి ఉంటుంది. రక్తం చూసినప్పుడు కళ్లు కనిపించవు.. ఒత్తిడికి గురవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ప్రవేశిస్తే ఏమవుతుంది? అనేది ఆసక్తికరంగా చూపించాం’’ అన్నారు సుబ్బు వేదుల. అభిరామ్ వర్మ, కృతీ గార్గ్ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఏవీఎస్ఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా సుబ్బు వేదుల చెప్పిన విశేషాలు. ♦నాది వైజాగ్. న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఆ సమయంలోనే రచయిత కోన వెంకట్‌గారితో నాకు పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కొన్ని కథలకు కలిసి పనిచేశాం. ఆయన బ్యానర్లో ‘గీతాంజలి 2’ సినిమా నేను చేయాల్సి ఉంది.. కొన్ని కారణాల వల్ల మా కాంబినేషన్లో సినిమా ప్రారంభం కాలేదు.. కానీ, ఆయన నాకు మంచి సహకారం అందించారు. ♦‘రాహు’సినిమాకి కథే హీరో. దాదాపు ఏడాది పాటు ఈ కథపై పనిచేశా. చిత్ర నిర్మాతలు కథ వినగానే సినిమా చేద్దామన్నారు. నా కథపైన నమ్మకంతో నేను కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాను. మా నిర్మాతల సహకారం మరువలేనిది. 52 రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాం. ♦థ్రిల్లర్ జోనర్లో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా థ్రిల్‌ని అందించడంతో పాటు తాజా అనుభూతి ఇస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు పాటలు రాశాను. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, నేపథ్య సంగీతం హైలైట్. నేను, నా కూతురు ఈ సినిమాలో నటించాం. ‘మధుర’ శ్రీధర్‌గారు మాకు మంచి సహకారం అందించారు. సురేష్ బాబుగారు మా సినిమాను విడుదల చేయడం, జీ చానల్ వాళ్లు డిజిటల్ రైట్స్ తీసుకోవడం విడుదలకు ముందే మేం సాధించిన విజయాలు. ♦డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారి సినిమాలంటే ఇష్టం. ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రం నా ఫేవరెట్. ఇళయరాజాగారి సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన కథానాయకుడు అల్లు అర్జున్.. ఆయన నటన సూపర్బ్. ♦పెద్ద స్టార్ట్స్‌తో సినిమా చెయ్యాలంటే నన్ను నేను నిరూపించుకోవాలి. ‘రాహు’ తర్వాత స్టార్ హీరోలను సంప్రదిస్తా. ఒక స్టార్ హీరో కోసం ‘మృగం’ అనే సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. -
యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం
-
భాయ్ బంపర్ ఆఫర్ ఇచ్చారా?
నార్త్‌లో ‘కబీర్ సింగ్’ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. షాహిద్ కపూర్‌కి సోలో హీరోగా ఇది తొలి వంద కోట్ల చిత్రం అవ్వడమే కాకుండా రెండొందల కోట్ల సినిమా కూడా కాబోతోందని టాక్. తన సూపర్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను షాహిద్‌తో ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేశారు సందీప్ వంగా. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా నడుస్తోంది. హిందీకి సౌత్ సినిమా స్టామినా ఏంటో మరోసారి నిరూపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్లో బడా చాన్స్ కొట్టేశారట సందీప్ వంగా. సల్మాన్ హీరోగా టీ సిరీస్ సంస్థ నిర్మించబోయే సినిమాకు దర్శకుడిగా సందీప్ పేరుని పరిశీలిస్తున్నారట. ‘కబీర్ సింగ్’కు టీ–సిరీస్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామి అనే సంగతి తెలిసిందే. మరి.. సల్మాన్‌తో సందీప్ సినిమా ఉంటుందా? అంటే వేచి చూడాల్సిందే. ఈ సినిమా సంగతి అలా ఉంచితే సందీప్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌కు ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేయనున్నారు. -
సిస్టరాఫ్ జీవీ
తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన వారిలో జీవీ ప్రకాశ్ ఒకరు. తమిళ సినిమాలో ప్రస్తుతం మినిమమ్ గ్యారెంటీ హీరోల లిస్ట్‌లో జీవీ ఉన్నారు. చేతిలో రెండు, మూడు సినిమాలు ఉండేట్టు వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ప్రకాశ్ సోదరి జీవీ భవాని శ్రీ కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్ సేతుపతి – విరుమాండి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో కీలక పాత్రలో భవాని శ్రీ కనిపిస్తారట. ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయింది. ఇటీవల అమల చేసిన ‘హై ప్రీస్టెస్’ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటించారామె. -
కెప్టెన్ లాల్
స్క్రీన్ మీద విభిన్న పాత్రలు పోషించిన విలక్షణ నటుడు మోహన్‌లాల్. యాక్టర్‌గా 25 ఏళ్ల ప్రయాణం తర్వాత ఓ కొత్త పాత్ర పోషించడానికి రెడీ అయ్యారు. అయితే ఈ రోల్ స్క్రీన్ మీద కాదు ఆఫ్ స్క్రీన్. మోహన్‌లాల్ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారనున్నారు. ‘బారోజ్ – గార్డియన్ ఆఫ్ డి గామా ట్రెషర్’ అనే సినిమాలో నటించడమే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరిస్తారు. 400 ఏళ్లుగా గోవాలోని వాస్కోడిగామ ప్రాంతంలో ఉన్న నిధిని కాపాడే సంరక్షకుడి కథ ఇది. జిజో పూన్నోస్ ఈ కథను రాశారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ మోహన్‌లాల్ త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు కనిపిస్తారట. మోహన్‌లాల్ కొత్త చిత్రం ‘ఇట్టిమణి – మేడ్ ఇన్ చైనా’ షూటింగ్ బుధవారం స్టార్ట్ అయింది. -
ప్రమోషన్స్ ఎంజాయ్ చేయలేను
సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. బాలీవుడ్ స్టార్స్ అయితే సినిమా ప్రమోషన్స్ కోసం నెలకుపైనే సమయాన్ని వెచ్చిస్తుంటారు. అయితే ప్రమోషన్ చేయడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయలేను అంటున్నారు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘బొంబేరియా’. ఈ సినిమాలో రాధికా ఆప్టే పీఆర్ (పబ్లిక్ రిలేషన్) ఏజెంట్‌గా పాత్ర చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ – ‘‘హీరోయిన్గా రోజూ చాలా మంది పీఆర్‌లతో జర్నీ చేస్తుంటాం. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమాలో చేసిన పాత్ర తర్వాత తెలుసుకున్నాను. ఏదైనా పని చేయించుకోవడానికి వాళ్లు చాలా మంది ఈగోని సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఎంతో మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో కీలక భాగమై ఉంటారు. ప్రమోషన్స్ చేసే విషయానికి వస్తే.. నేను ఎంజాయ్ చేయలేని పని ఏదైనా ఉందంటే అది సినిమా ప్రమోషన్సే. నటిగా నా సినిమాలను నేను ప్రమోట్ చేయాలి.. అది నా బాధ్యత. కానీ ఆ పనిని ఎంజాయ్ చేయలేను. సినిమా షూటింగ్ చేయడమో, చేయబోయే క్యారెక్టర్ని ఇంకా బాగా స్టడీ చేయడమో లాంటి పనులను బాగా ఇష్టపడతాను’’ అని పేర్కొన్నారు రాధికా ఆప్టే. -
వెంటనే స్టెప్పేశా
‘అవకాశం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా చాన్స్ మిస్ చేసుకుంటాం’ అని అంటున్నారు అమైరా దస్తూర్. ధనుశ్ సరసన నటించిన ‘అనేకుడు’ (డబ్బింగ్) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమైరా.. స్ట్రయిట్ సినిమా ‘మనసుకు నచ్చింది’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఈ భామ ప్రభుదేవాతో నటించే చాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘కాదలై తేడి నిత్యానంద’ సినిమా చేస్తున్నారామె. ఆ సినిమా తర్వాత ప్రభుదేవా కీలక పాత్రధారిగా ఆదిక్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభుదేవాతో యాక్ట్ చేసే చాన్స్ వచ్చిందని ఎగై్జట్ అవుతున్నారు అమైరా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘కాదలై తేడి..’ సమయంలోనే ఈ సినిమా గురించి దర్శకుడు చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. ఇందులో భాగమవ్వాలని అనుకున్నాను. ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తావా? అని ఆయనే అడిగారు. ప్రభుదేవా సరసన చాన్స్ వస్తే ఎవరు మిస్ చేసుకుంటారు? వెంటనే యస్ చెప్పాను. స్క్రిప్ట్‌పరంగా ఫస్ట్ హాఫ్‌లో సంప్రదాయంగా కనిపిస్తా. సెకండ్ హాఫ్‌లో చాలా బోల్డ్‌గా, సెక్సీగా కనిపిస్తాను. అలాగే ప్రభుదేవాగారితో కాబట్టి డ్యాన్స్ విషయంలో బాగా కేర్ తీసుకుంటున్నాను’’ అన్నారు అమైరా. -
అమీర్ ఫ్యాన్స్ దెబ్బ, కమల్ అబ్బా..
సాక్షి: కమల్ ఖాన్ బాలీవుడ్లో సెలబ్రిటీ. ఎల్లప్పుడూ వివాదాల్లో ఉంటాడు. హీరోలను విమర్శించడం ఆపై అభిమానుల నుంచి చివాట్లు తినడం ఆయనకు అలవాటు. అయినా తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోరు. వివాదాలను ఇంటి చూట్టు తిప్పుకుంటా నేను ఇంతే అనే రేంజ్లో ఫీల్ అవుతారు. కానీ సెలబ్రిటీకి కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమీర్‌ఖాన్ అభిమానుల దెబ్బకు ఖంగుతున్నాడు. తమ అభిమాన నటుడిపై విమర్శలు చేసినందుకు ఏకంగా కమల్‌ఖాన్ ట్వట్టర్ అకౌంట్‌నే బ్లాక్ చేశారు. వివరాల్లోకి వెళ్తే అమీర్ ఖాన్ తాజాగా నటించిన సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా క్లైమాక్స్‌ను రివీల్ చేస్తూ ఓ సమీక్ష రాశాడు. అయితే ఇంకా విడుదల కాకుముందే కథను సోషల్ మీడియాలో చెప్పడంతో అమీర్‌ఖాన్ అభిమానులకు కోపం వచ్చింది. దీంతో కమల్ ఖాన్ అకౌంట్‌పై ట్వట్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్‌ఖాన్ అకౌంట్ ఆగిపోయింది. గతంలో కమల్ బాహుబలి సినిమా, మహేష్ బాబు, పవన్‌కల్యాణ్‌పై కూడా విమర్శలు చేశారు. దీనిపై కమల్‌ఖాన్ మీడియాకు ఓలేఖ రాశాడు. కేవలం సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాయడం వల్లే తన ట్విట్టర్ ఖాతా కోల్పోయాననని తెలిపాడు. గత నాలుగేళ్లలో ఎంతో డబ్బు సినిమాలకు ఖర్చుపెట్టానని, తన ఖాతాకు 6మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని పేర్కొన్నాడు. అంతేకాడు అమీర్‌ఖాన్‌పై విమర్శలు ఎక్కుపెట్టాడు. 'అమీర్ నన్ను ట్విట్టర్లో ఉండనీయాలనుకోవట్లేదు. ఎందుకంటే ట్విట్టర్‌కు యజమాని అమీర్ కాబట్టి నేను మరో కొత్త ఖాతా తెరవాలనుకోవట్లేదు అంటూ విమర్శించాడు. -
కొత్త చిత్రానికి ప్రభాస్ కొబ్బరికాయకొట్టాడోచ్
హైదరాబాద్: దాదాపు నాలుగేళ్లపాటు బాహుబలి సినిమాకోసం తీవ్రంగా శ్రమించి బాహుబలి-2కి గత నెల (జనవరి) 6నే గుమ్మడి కాయకొట్టి విశ్రాంతి తీసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్పుడే కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. రన్ రాజా రన్ మూవీ ఫేం సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ సినిమాకు రెడీ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి పూజకార్యక్రమాలు సోమవారం జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో సుజీత్, చిత్ర నిర్మాతలు, ప్రభాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాహుబలి-2 చిత్ర షూటింగ్ పూర్తయ్యాక గడ్డం, పొడుగాటి జుట్టుతోనే కనిపించిన ప్రభాస్.. కొత్త చిత్ర ముహూర్తం రోజు కూడా అదే గెటప్‌లో కనిపించారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో ఈ సినిమా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రంపై వస్తోంది. దీనికి శంకర్ ఈ ఎశాన్ లాయ్ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
సినిమా రివ్యూ: ఎంఎస్ ధోనీ
కొత్త సినిమా గురూ! ఒక టికెట్ ఇస్తారా ప్లీజ్... లక్ష్యం నిన్ను ఎంచుకుంటుంది. నువ్వు చేయాల్సిందల్లా లక్ష్యాన్ని ఎంచుకోవడమే. ధోనికి అసలు క్రికెట్ అంటే పెద్ద ఇష్టం లేదు. రాంచీ స్కూల్లో ఫుట్‌బాల్ ఆటలో ఆసక్తి కలిగి ఉంటాడు. గోల్ కీపర్‌గా మంచి చలాకీ. కాని ఆ స్కూల్ క్రికెట్ టీమ్‌లో వికెట్ కీపర్ లేకపోవడంతో స్కూల్ స్పోర్ట్స్ టీచర్ కన్ను ధోని మీద పడుతుంది. ‘క్రికెట్ ఆడతాడేమో కనుక్కో’ అని కబురు చేస్తే ‘పెద్ద బాల్ని వదిలేసి చిన్నబాల్తో ఆడతారా ఎవరైనా?’ అని జవాబు చెప్తాడు. కాని లక్ష్యం అతని కోసం కాచుకుని ఉంది. అది పదే పదే అతడి వెంట పడింది. చివరకు ధోని ఫుట్బాల్ని వదిలి క్రికెట్లోకి వస్తాడు. చేతికి గ్లవ్స్... దూసుకొచ్చే బాల్‌ను ఒడిసి పట్టడం డ్యూటీ. ‘సార్... నాకు బ్యాటింగ్ అంటే ఇష్టం’ అని టీచర్‌కు చెప్తే ‘నీ ముఖం... కీపింగ్ చెయ్’ అని చెప్తాడు. సంతలో దేవుని పటాలన్నింటి మధ్య సచిన్ పోస్టర్ ఉంటే కొనుక్కున్న కొడుకును చూసి తండ్రికి దిగులు. వీడు బాగా చదువుతాడా... చదువులో పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాడా అని. తల్లికి మాత్రం తెలుసు- వాడికి ఆనందం ఆటల్లోనే అని. ధోని లోకల్ గల్లీలలో హీరో అవుతాడు. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లో నిలబడితే కొడుతూనే ఉంటాడు. చివరకు స్కూళ్లకు సెలవులిచ్చి జనమంతా వచ్చి నిలుచునేంత క్రేజ్. కాని చిన్న ఊరి కుర్రవాడు. మధ్యతరగతి కుటుంబం. బతుకు భయం. ఎదగాలంటే ఎన్నో అడ్డంకులు. రైల్వే అధికారి ఒకరు అతడి ప్రతిభను గుర్తించి రైల్వేలో టిసి ఉద్యోగం ఇచ్చి రైల్వే క్రికెట్ టీమ్‌లో ఎంపిక చేసుకుంటాడు. నెలకు ఐదు వేల జీతం. ఖాళీ ఉన్నప్పుడల్లా క్రికెట్ ప్రాక్టీస్. డౌన్ వచ్చే రైలు... అప్ వెళ్లే రైలు... మధ్యలో టికెట్ కలెక్షన్... లేని వాళ్లకు ఫైన్ వేయడం... రోజులు గడుస్తున్నాయి. కొంత ఏమరపాటుకు లోనైతే ఇక్కడే ఫినిష్ అయిపోయే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఇలాంటి సందర్భం ప్రతి మనిషి జీవితంలోనూ వస్తుంది. ఉండాలా... వదిలేసి వెళ్లాలా... అందరి దగ్గరా టికెట్ కలెక్ట్ చేసే మనిషి తన లక్ష్యం కోసం తెగింపు అనే టికెట్‌ను కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరకు ధోని నిర్ణయం తీసుకుంటాడు. రైలుకు టాటా. డియర్ క్రికెట్... అయామ్ కమింగ్. ప్రతిభ నగరాల్లో మాత్రమే ఉండదు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉంటారు. దాల్మియా హయాంలో బి.సి.సి.ఐ చిన్న ఊళ్లలో ఉన్న టాలెంట్‌ను వెతికి పట్టే కార్యక్రమం తీసుకోవడం ధోనికి లాభిస్తుంది. ఒక దేశవాళీ ట్రోఫీ క్రికెట్‌తో ధోని ఎక్కడైతే సెలెక్టర్లు కూచున్నారో వాళ్ల నెత్తిన పడేలా సిక్సర్లను బాదుతాడు. అక్కడి నుంచి హైదరాబాద్ ఏ టీమ్, ఆ తర్వాత భారత జట్టు, ఆ తర్వాత వరుస విజయాల వరుస... ఆ తర్వాత చెరపలేని ఒక చరిత్ర స్థాపన. ఎంఎస్ ధోని సినిమా 2011 వరల్డ్ కప్ ఫైనల్స్‌తో మొదలయ్యి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి తిరిగి ఫైనల్స్‌తో ముగుస్తుంది. మూడు ముఖ్యమైన వికెట్లను పోగొట్టుకుని జట్టు ఒత్తిడిలో ఉన్న తరుణాన ఒక కెప్టెన్‌గా కసి ఉన్న ఆటగాడిగా దేశానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడవరాదనే సంకల్పంతో చేతులకు గ్లవ్స్ బిగించుకుంటూ ధోని క్రీజ్‌లోకి దిగి బ్యాట్‌తో బంతి మాడు పగిలేలా మోదడం, యువరాజ్ సింగ్‌తో కలిసి జట్టును విజయం వైపు నడిపించడం... చివరి బాల్‌ను బౌండరీ లైన్ ఆవలికి తరలించడం... ఇటీవలి జ్ఞాపకంగా మన కళ్ల ముందు కదలాడినా మళ్లీ ఆ క్షణాలు ఉజ్జీవనమై ఉద్వేగం కలుగుతుంది. ఛాతీ ఉప్పొంగుతుంది. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచం కప్‌ను సాధించి పెట్టిన ఈ కుర్రవాడు ఒక చిన్న ఊళ్లో... ఒక దిగువ శ్రేణి ప్రభుత్వ క్వార్టర్ల నుంచి పుట్టుకొచ్చాడని తెలియడం ఎవరికైనా స్ఫూర్తి... తమ లక్ష్యాన్ని ఎంచుకోవడానికి అవసరమయ్యే ఉత్సాహాన్ని ఇస్తుంది. మహేంద్ర సింగ్ ధోనిగా ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పుట్ నటించాడు. అతడికి ఇది జీవిత కాలపు అవకాశం. దానిని అతడు నిలబెట్టుకున్నాడు. ఇక మీదట ధోని, సుశాంత్ అవిభాజ్యం. గత స్పోర్ట్స్ బయోపిక్‌ల వలే కాకుండా ఈ సినిమా అంతా రియల్ ఫుటేజ్ వాడారు. అందులో ధోనికి బదులుగా సుశాంత్‌ను గ్రాఫిక్స్‌తో మార్పిడి చేశారు. కాని గ్రాఫిక్స్ ఉన్నతశ్రేణిలో ఉండటం వల్ల ఎఫెక్ట్ అద్భుతంగా వచ్చింది. అలాగే స్కూల్ ప్లేయర్‌గా సుశాంత్ ముఖాన్ని ఆ వయసు కుర్రాడికి గ్రాఫిక్స్‌తో అమర్చి చాలా మంచి అనుభూతిని రాబట్టగలిగారు. తర్వాతి కాలంలో జట్టులో హోరాహోరీగా పేరు తెచ్చుకున్న యువరాజ్ సింగ్, ధోనిలు రంజి స్థాయిలో పోటీ పడటం ఈ సినిమాలో చూడటం చాలా ముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా 84 పరుగులు కొట్టి ఔట్ అయిన ధోని టీమ్‌ని పంజాబ్ టీమ్ తరఫున బ్యాటింగ్‌లో దిగిన యువరాజ్ సింగ్ ఉతికి ఆరేయడం ఆ విషయాన్ని ధోని చాలా మురిపెంగా చెప్పడం చాలా బాగుంటుంది. ముఖ్యంగా యువరాజ్‌లా వేసిన కుర్రాడు యువరాజ్లాగే కనిపిస్తూ చాలా బాగా చేశాడు. ధోని తను కెప్టెన్ అయ్యాక ఎవరి హయాంలో అయితే తాను పైకి వచ్చాడో ఆ ప్లేయర్స్ (నేరుగా పేర్లు చెప్పరు... కాని మనకు తెలుసు వాళ్లు... రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్)ను పక్కన పెట్టడంలో కఠినంగా వ్యవహరించడం అది విమర్శలకు దారి తీయడం చూచాయగా కనిపిస్తుంది. ‘నాకు ఆటగాళ్లు కాదు కావలసింది... విజయం కోసం ఆకలిగొన్న వ్యక్తిత్వాలు’ అని ధోని సెలక్టర్లతో చెప్తాడు. ‘నాకు స్వతంత్రం ఇస్తే తప్ప భారత్‌ను ప్రపంచ కప్ కోసం సిద్ధం చేయలేను’ అని ధోని కుండ బద్దలు కొడతాడు. అతడి నిర్ణయం సబబే అని చరిత్ర నిరూపించింది. ‘వెన్స్ డే’, ‘బేబీ’ వంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు నీరజ్ పాండే ఈ సినిమాను కంగారు లేకుండా మోసకారి తనంతో కాకుండా నిజాయితీగా తీసే ప్రయత్నం చేశాడు. మూడు గంటల నిడివితో తీరిగ్గా చెప్తాడు. ఫస్ట్ హాఫ్ మనం మైమరపుతో చూస్తాం. సెకండ్ హాఫ్‌లో డ్రమెటిక్‌గా పైకి లేచే కథనం కథలోనే లేకపోవడం వల్ల కొంచెం నిరాసక్తంగా అనిపించినా నటీనటుల ప్రతిభ, దర్శకుడి ప్రావీణ్యం సినిమాను గట్టెక్కించేస్తాయి. ముఖ్యంగా ఇవాళ మన ఎదుట హీరోలుగా నిలిచిన వ్యక్తులు అలా ఉత్త పుణ్యానికి హీరోలు అయిపోరనీ దాని వెనుక ఎంతో కఠోరమైన పరిశ్రమ ఉంటుందనీ ఎవరైనా ఏ రంగంలో అయినా పైకి రావాలంటే అటువంటి పరిశ్రమ అవసరమని ఈ సినిమా ఈనాటి యువతకు బడి పిల్లలకు చెబుతుంది. దుర్వ్యసనాల జోలికి పోకుండా లక్ష్య శుద్ధికి కట్టుబడి ఉండాలని కూడా ఈ సినిమా చాలా బలంగా చెప్తుంది. స్మోకింగ్ అయితే అసలు కనిపించలేదు. ధోనిని కుటుంబం మొత్తం చూడొచ్చు. ముఖ్యంగా పిల్లలకు చూపించవచ్చు. తల్లిదండ్రులకు పిల్లలను ఏ ట్రైన్ ఎక్కించాలో తెలుస్తుంది. పిల్లలకు ఏ ట్రైన్‌ను వదిలిపెట్టాలో తెలుస్తుంది. గుడ్ ఎటెంప్ట్. పదికి ఎనిమిది మార్కులు. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జనవరిలో సెట్స్ పైకి మహేష్,కొరటాల సినిమా
మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న కొరటాల శివ.. తాజాగా 'జనతా గ్యారేజ్' హిట్‌తో టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. 'జనతా గ్యారేజ్' తో తారక్ కెరీర్లోనే పెద్ద హిట్ అందించిన కొరటాల తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడనేది అంతటా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్‌తో తన నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుందని కొరటాల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మరో సినిమాపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా గురించి కొరటాల శివ మాట్లాడుతూ.. మహేష్‌తో చేయబోయే రెండవ సినిమా కూడా శ్రీమంతుడులానే మంచి కథతో ఉంటుందన్నారు. అలాగే జనవరి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని, మహేష్ ఇమేజ్‌కు సరిపడేలా ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని కొరటాల తెలిపారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. -
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం?
హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం త్వరలో తెరకెక్కనుందట. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేసే విషయమై ఎన్టీఆర్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. దసరా నాటికి పూరీ జగన్నాధ్ దర్శకుడుగా తన సోదరుడు కల్యాణ్ రాం నిర్మాతగా ఓ చిత్రంలో నటించేందుకు తారక్ సిద్ధమయ్యారు. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభమైన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇక అధికారికంగా ప్రకటించటమే మిగిలి ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్
అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధ వంటి చిత్రాలతో యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి.. నితిన్ హీరోగా కొత్త చిత్రాన్ని తీయనున్నారు. 14 రీల్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా గురువారం ఉదయమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్రివిక్రమ్ 'అఆ' సినిమా విజయం తర్వాత నితిన్.. ఆ స్థాయికి తగ్గ సినిమా చేయాలన్న ఆలోచనతోనే కొంత గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. నితిన్ ఇమేజ్‌కి సరిపోయేలా తన స్టైల్లో హను రాఘవపూడి రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలో చిత్ర యూనిట్ పూర్తి వివరాలను వెల్లడించనుంది. -
గోపీచంద్ కొత్త సినిమా షురూ
హీరో గోపీచంద్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో మొదలయ్యింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హన్సిక, క్యాథరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో గోపీచంద్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సుధాకర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్గా ఈ చిత్రం రూపొందుతుందని చిత్ర నిర్మాత జె.భగవాన్ తెలిపారు. గోపీచంద్ కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా తెరకెక్కనుంది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్‌లో ఉన్న మాస్ యాంగిల్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేసేలా ఈ చిత్రం ఉంటుందట. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబలి), అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
సంజయ్ రామస్వామి.. అంటున్న అలీ
దశాబ్ధాలుగా టాలీవుడ్లో సక్సెస్ఫుల్ కమెడియన్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్న నటుడు అలీ. కొన్ని సినిమాల్లో హీరోగా అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ.. ఆ పాత్రలకే పరిమితం కాకుండా హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలీ తాజాగా మరోసారి హీరోగా కనిపించనున్నాడు. నాగు గవర దర్శకత్వంలో 'సంజయ్ రామస్వామి' అనే టైటిల్‌తో నవ్వించనున్నాడు. 'గతం గెలుక్కున్న గజిని' అనేది ఈ టైటిట్‌కు క్యాప్షన్. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. 'గజిని' సినిమాలో హీరో సూర్య పేరు సంజయ్ రామస్వామి అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకు స్పూఫ్గా.. అలీ మార్క్ ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఈ చిత్రం ఉండబోతుందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. 2013లో అలీ హీరోగా వచ్చిన 'అలీబాబా ఒక్కడే దొంగ' సినిమా తర్వాత తిరిగి ఈ సినిమా ద్వారా హీరోగా మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. -
నా సినిమాలో దావూదే స్వయంగా నటిస్తున్నాడు!
సోషల్ మీడియాలో తన సినిమాలకు ఎలా పబ్లిసిటీ తెచ్చుకోవాలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా తెలుసు. ఎప్పుడూ ఏదో కామెంట్ చేస్తూ లైమ్ లైట్లో ఉంటూనే అవసరమైనప్పుడు తన సినిమాలకు దండిగా పబ్లిసిటీ తెచ్చుకుంటాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. తాజాగా తన సినిమా 'గవర్నమెంట్' విషయంలోనే ఇదే ట్రిక్ ప్లే చేశాడు వర్మ. మాఫియా డాన్లు దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ మధ్య బద్ధ శత్రుత్వం నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో దావూద్ పాత్ర పోషించడానికి సరైన నటుడు దొరికాడంటూ వర్మ తాజాగా ట్వీట్ చేశాడు. అయితే నటుడు దొరికానడం అబద్ధమని, స్వయంగా దావూదే ఈ సినిమాలో పాత్ర పోషించడానికి ముందుకొచ్చాడని మరో ట్వీట్ ట్విస్ట్ ఇచ్చాడు. చివరకు చేసిన ఇంకో ట్వీట్లో అబ్బే దావూద్ ఇబ్రహీం మా సినిమాలో స్వయంగా నటించడం అబద్ధం అంటూ మరో మెలిక పెట్టాడు. మొత్తానికి 'గవర్నమెంట్' సినిమాలో కీలకమైన దావూద్ పాత్ర కోసం సరిగ్గా సరిపోయే నటుడు దొరికాడని చెప్పకనే చెప్పాడు వర్మ. -
విష్ణు, రాజ్‌తరుణ్ నూతన చిత్రం ప్రారంభం
-
టైటిలాభరణం
కొత్త సినిమా గురూ! ‘శంకరాభరణం’ కెమేరా- సాయిశ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్, నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ - కోన వెంకట్, దర్శకత్వం - ఉదయ్ నందనవనమ్, శంకరాభరణం. పేరు వినగానే ఆణిముత్యం లాంటి సినిమా గుర్తుకొస్తుంది. తెలుగువాణ్ణి తలెత్తుకు తిరిగేలా చేసిన ఆ ఫిల్మ్ టైటిల్‌తో మరో సినిమా చేయడం సాహసం. పెపైచ్చు, ఆ టైటిల్‌తో క్రైమ్ కామెడీ తీయడం మరీ సాహసం. కానీ, ‘సాహసం శాయరా డింభకా! విజయం వరిస్తుంది’ అన్నది నమ్మి, ఆ పనికే దిగారు ఇప్పుడీ కొత్త చిత్ర దర్శక, నిర్మాతలు. అలా వచ్చింది కోన వెంకట్ అన్నీ తానై తీసి, తీయించిన కొత్త ‘శంకరాభరణం’. టైటిల్ క్యూరియాసిటీ పక్కనపెట్టి, ‘దొరకునా ఇటువంటి సినిమా’ అని పాడుకుంటూ కథలోకొస్తే - రఘు (సుమన్) అమెరికాలో కోటీశ్వరుడు. అతని భార్య రజ్జూ దేవి (సితార). ఓ కూతురు, ఓ కొడుకు గౌతమ్ (నిఖిల్). కష్టపడకుండా, కులాసా జీవితం గడిపే హీరో జీవితంలో ఒక పెద్ద కుదుపు. నమ్మినవాళ్ళు మోసం చేయడంతో ఆస్తులు పోయి, అర్జెంటుగా కోట్లు కట్టకపోతే కటకటాల వెనక్కి వెళ్ళే ముప్పులో పడతాడు హీరో తండ్రి. పాతికేళ్ళ క్రితం ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, అమెరికా వచ్చేశాననీ, బీహార్‌లోని ‘శంకరాభరణం’ అనే ప్యాలెస్‌కు తానే వారసురాలిననీ, దాన్ని అమ్మి అప్పుల నుంచి బయటపడవచ్చనీ హీరో తల్లి చెబుతుంది. ఆ ప్యాలెస్ అమ్మి డబ్బు తేవడానికి అమెరికా నుంచి హీరో బీహార్ బయల్దేరతాడు. ఇక్కడ బీహార్‌లో విలువైన దేనినైనా కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజడం బిజినెస్. రాష్ట్ర హోమ్ మంత్రి (‘మిర్చి’ సంపత్) కూడా ఆ కిడ్నాపింగ్ ముఠాల వెనుక మనిషే. బీహార్ వచ్చిన హీరో తమ ప్యాలెస్‌లో ఉంటున్న మామయ్య బద్రీనాథ్ (రావు రమేశ్)నీ, ఆయన బంధుగణాన్నీ మాయ చేసి, ప్యాలెస్ అమ్మేయడానికి ప్లాన్ చేస్తాడు. అమెరికా వెళ్ళాలని మోజు పడే మామయ్య చిన్న కూతురు హ్యాపీ (నందిత) హీరోను ప్రేమిస్తుంది. మరోపక్క అతనూ దగ్గరవుతాడు. ఈ అమెరికా ఎన్నారై దగ్గర బోలెడంత డబ్బుందని ఊరంతా భ్రమపడుతుంది. దాంతో, కిడ్నాపర్ భాయ్ సాబ్ (సంజయ్ మిశ్రా) హీరో, హీరోయిన్లను కిడ్నాప్ చేస్తాడు. తీరా తన దగ్గర డబ్బులే లేవని అసలు నిజం చెప్పి, హీరో తనను మరో కిడ్నాపర్‌కి కోట్లకు అమ్మించేలా చేస్తాడు. అలా ఒక కిడ్నాపర్ నుంచి మరో కిడ్నా పర్కు హీరో, హీరోయిన్లు ట్రాన్‌సఫరవుతుంటారు. ఈ కిడ్నాప్ డ్రామాల కథ ఎటు నుంచి ఎటు, ఎన్ని మలుపులు తిరిగిందన్నది మిగతా సినిమా. కథ కన్నా సీన్లు, క్యారెక్టర్లు సవాలక్ష ఉన్న ఈ సినిమాకు తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ, దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో తడబాటు తప్ప లేదనిపిస్తుంది. తెర నిండా కళకళలాడుతూ చాలా మంది ఆర్టిస్టులున్నారు. ఒకరి వెంట మరొకరుగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. కానీ, మనసు కెక్కేలా వాళ్ళ నటనను చూపెట్టే సన్నివేశాలే వెతుక్కోవాలి. వెరైటీ స్క్రిప్ట్‌లతో ముందుకొస్తున్న హీరో నిఖిల్ ఈసారి అమెరికన్ ఇంగ్లీష్ యాసలో ఎన్నారైగా అలరించడానికి శాయశక్తులా యత్నించారు. అమెరికా మోజున్న హ్యాపీగా నందితది కాలక్షేపం క్యారెక్టర్. కిడ్నాపింగ్ విలన్లుగా ఒకరికి ముగ్గురున్నారు. ఎవరికివారు ఫరవాలేదనిపిస్తారు. కానీ, ఎవరూ ప్రధాన విలన్ కాకపోవడమే చిక్కు. లేడీ కిడ్నాపింగ్ లీడర్ మున్నీ దీదీగా అంజలిది సినిమా చివర కాసేపు వచ్చే స్పెషల్ అప్పీయరెన్స్. నాలుగు సీన్లు, కాసిన్ని డైలాగులు, ఒక స్పెషల్ సాంగ్ ఉన్నాయి. సినిమా నిండా చాలామంది కమెడియన్లున్నారు. కొన్నిచోట్ల నవ్విస్తారు. ఎక్కువ మార్కులొచ్చేది థర్టీ ఇయర్స్ పృథ్వికి, అతని ఎస్సై పాత్ర ‘పర్సంటేజ్’ పరమేశ్వర్‌కి! అయితే, లేడీ కిడ్నాపింగ్ ముఠా స్త్రీలంతా కలసి అతడిపై పడి, గదిలోకి తీసుకెళ్ళడం లాంటివి కామెడీ అనుకోలేం. ‘లాజిక్‌లు వెతక్కండి... మ్యాజిక్ చూడండి’ అని స్టాట్యూటరీ సిల్వర్‌స్క్రీన్ వార్నింగ్‌తో మొద లయ్యే సినిమా ఇది. కాబట్టి, బీహార్‌లో మనుషులు అచ్చ తెలుగు యాసల్లో ఎలా మాట్లా డుతున్నారు లాంటి సందేహాలు శుద్ధ వేస్ట్. ముందే చెప్పేశారు కాబట్టి, ఇక సినిమా అంతా మ్యాజిక్ చూడడం కోసం కళ్ళలో వత్తులు వేసుకోవాల్సి ఉంటుంది! సీనియర్ కో-డెరైక్టర్ ఉదయ్ నందనవనమ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కానీ, దర్శకత్వ పర్యవేక్షణంతా కోన వెంకట్‌దే. ఎవరి భాగమెంతో తెరపై చూసి చెప్పడం కష్టమే. కథనంలో బిగింపు, ఎడిటింగ్‌లో తెగింపు అవసరమని గుర్తొచ్చే ఈ సినిమాలో అందమైన లొకేషన్లలో కెమేరా పనితనం భేష్. ప్రవీణ్ లక్కరాజు బాణీల్లో కొన్ని బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గరే వాద్యఘోష పెంచారు. వెరసి, ఫస్టాఫ్‌లో కథ ముందుకు జరగకపోయినా డైలాగ్ మీద డైలాగ్ పడిపోయే ఆర్టిస్టుల హడావిడి, రీరికార్డింగ్ హంగామాతో ఉక్కిరిబిక్కిరవుతాం. సెకండాఫ్‌లో పృథ్వి ఎంటరయ్యాక జనం వినోది స్తారు. డబ్బు కన్నా అనుబంధాలు ఎక్కువని చెప్ప డానికీ, హీరోకూ- ఫ్యామిలీకీ మధ్య ఎమోషనల్ స్ట్రగుల్‌కీ తోడ్పడే సీన్లు ఇంకా అల్లుకోవాల్సింది. ముగింపు దగ్గరకొస్తుంటే వేగం పెరిగే ఈ ఫిల్మ్‌లో ఆఖరి టైటిల్ కార్డు - ‘వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది. బంధాలు బలంగా ఉంటేనే కుటుంబం నిలుస్తుంది’. అలాగే, స్క్రిప్టు బలంగా ఉంటేనే సినిమా నిలుస్తుంది. మరి, ఆ బలం, బాక్సా ఫీస్ దగ్గర అలా నిలిచే సత్తా ఈ ‘శంకరాభరణం’కి ఉందా? అది ప్రేక్షకదేవుళ్ళు చెప్పాల్సిన తీర్పు. - రెంటాల జయదేవ * హిందీ హిట్ ‘ఫస్ గయేరే ఒబామా’ హక్కులు కొని, దాన్ని తెలుగులోకి మలుచుకున్నారు కోన వెంకట్. ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవాస భారతీయుడు. * బీహార్ నేపథ్యంలో జరిగే ఈ కిడ్నాప్ కథ షూటింగ్ ప్రధానంగా మహారాష్ట్ర, పరిసరాల్లో చేశారు. ఇటీవల రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిన కొద్ది సినిమాల్లో ఇది ఒకటి. -
కాలు నిలవడంలేదు: ఆలియా భట్
ముంబై: అతడి వయసేమో 50 ఏళ్లు. అందులో సగం.. అంటే కనీసం పాతికేళ్లు కూడా నిండలేదు ఆమెకు. కానీ అతనితో ఎప్పుడెప్పుడు స్టెప్పులేస్తానా.. అని ఆశగా ఎదురు చూస్తున్నానంటోంది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్. 'బాద్ షా' షారూఖ్ ఖాన్ తదుపరి సినిమాలో హీరోయిన్గా ఖరారు కావడం అంతులేని ఆనందాన్ని కలిగిస్తున్నదని, షూటింగ్ ప్రారంభమయ్యేదాకా ఆగలేకపోతున్నాని, కాలు నిలవడంలేదంటూ ఆలియా బుధవారం ట్వీట్ చేసింది. తన ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానంపై గతంలో విమర్శలు ఎదుర్కొన్న దృష్ట్యా ఇకపై ఆ భాషతో సమస్యలు తీరిపోయినట్లేనని ఆలియా భావిస్తున్నది. ఎందుకంటే కొత్త సినిమాను డైరెక్ట్ చేయబోయే గౌరీ షిండే.. గతంలో శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ సినిమా 'ఇంగ్లీష్- వింగ్లీష్' తో మంచి పేరుతెచ్చుకుంది. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా తర్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. షారూఖ్ కే చెందిన రెడ్ చిల్లీస్, హోప్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సహసమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు మరో ట్వీట్ ద్వారా తెలిపారు దర్శకనిర్మాత కరణ జోహార్. Will no longer have any problem with my English Vinglish.. can't wait to be directed by Gauri Shinde with the man himself Shahrukh Khan!!! — SHAANDAAR Alia (@aliaa08) August 19, 2015 -
ఊహించని మలుపులతో...
సుధీర్‌బాబు కొత్త చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. శ్రీరామ్ ఆదిత్యను దర్శకునిగా పరిచయం చేస్తూ, విజయ్‌కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వామికా గబ్బి కథానాయిక. ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ కృష్ణ మూడో కుమార్తె ప్రియదర్శిని కెమెరా స్విచాన్ చేయగా, రెండో కుమార్తె మంజుల క్లాప్ ఇచ్చారు. పెద్ద కుమార్తె పద్మావతి గౌరవ దర్శకత్వం వహించారు. మంజుల భర్త సంజయ్ స్వరూప్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ - ‘‘పలు లఘు చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య ప్రతిభ మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నా. కొత్త కథతో, ఊహించని మలుపులతో ఆసక్తికరంగా ఉంటూనే, వినోదాన్ని పంచే చిత్రమిది’’ అన్నారు. జూన్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఫ్రెష్‌గా అనిపించే కథా, కథనాలతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ గున్నాల-కార్తీక్, కెమెరా: శ్యామ్ దత్, సంగీతం: ఎం.ఆర్. సన్నీ. -
అనుష్క 'సైజ్ జీరో'
వరుస చిత్రాలతో తీరికలేకుండా ఉన్న టాలీవుడ్ హీరోయిన్ అనుష్క...మరో సినిమాకు రెడీ అయిపోయింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం నిర్వహిస్తున్న ఓ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించనున్నారు. పీవీపీ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రానికి 'సైజ్ జీరో' అని పేరు పెట్టారు. ఇందులో ప్రధాన తారగణంగా అనుష్క, తమిళ నటులు ఆర్యా, భరత్, ఊర్వశి నటిస్తుండగా మరో ముఖ్య అతిథి పాత్రలో శృతిహాసన్ మెరవనుంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కథా రచనను ప్రకాశ్ సతీమణి కనికా థిల్లాన్ అందించారు. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశాన్ని రాఘవేంద్రరావు సోమవారం దర్శకత్వం వహించగా...కెమెరా ప్రసాద్ వి పోట్లురి స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
పొలిటీషియన్‌గా ప్రియాంక...?
-
వంశీ పైడిపల్లి కొత్త చిత్రమేదీ ?
-
అనుష్కను కామెంట్ చేసిన గౌతమ్ మీనన్..?