ఆసక్తికరమైన టైటిల్‌తో ‘తీస్ మార్ ఖాన్’ డైరెక్టర్‌ కొత్త చిత్రం! | Tees Maar Khan Director Kalyanji Gogana New Film Kalingaraju To Start Soon | Sakshi
Sakshi News home page

ఆసక్తికరమైన టైటిల్‌తో ‘తీస్ మార్ ఖాన్’ డైరెక్టర్‌ కొత్త చిత్రం!

Published Thu, Sep 15 2022 2:07 PM | Last Updated on Thu, Sep 15 2022 2:07 PM

Tees Maar Khan Director Kalyanji Gogana New Film Kalingaraju To Start Soon - Sakshi

నాటకం, సుందరి, తీస్ మార్ ఖాన్ వంటి సినిమాలతో దర్శకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కల్యాణ్‌ జీ గోగణ. ఫలితాలతో సంబంధం లేకుండా భిన్న చిత్రాలు, విభిన్నమైన జానర్లలో సినిమాలు తీస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. ఇటీవల తీస్‌మార్‌ ఖాన్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పకలరించిన కల్యాణ్‌.. తాజాగా మరో విభిన్నమైన తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. 

నవయుగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రాబోతోన్న ఈ చిత్రానికి కళింగరాజు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.  రవికుమార్ , ఐ. రవి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేహా సింగ్ సమర్పకురాలిగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఖుషీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నటుడు ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్న ఈ చిత్రానికి  సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నాడు.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement