ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు సినిమాల ప్రమోషన్స్ వినూత్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల మేకర్స్.. తమ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. డిఫరెంట్‌గా ప్లాన్ చేసి.. సినిమాపై బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ సినిమా మేకర్స్ కూడా ప్రమోషన్స్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. సినిమాకి టైటిల్ పెట్టే చాన్స్ ఆడియన్స్‌కే ఇచ్చేశారు. అదే బిగ్‌బాస్ ఫేం అమర్‌దీప్ కొత్త సినిమా.
మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే షూటింగ్ పూర్తి కాకముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
‘సినిమా మాది - టైటిల్ మీది’ అని ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేస్తూ, తమ సినిమా సూట్ అయ్యే టైటిల్ ను ఆడియన్స్ నిర్ణయించాలని కోరారు. అనుకున్న టైటిల్ ని+91 8985713959 నంబర్‌కి వాట్సాప్ ద్వారా పంపించాలని ప్రేక్షకులను ఆహ్వానించారు. సెలెక్ట్ అయిన టైటిల్ ని సినిమా టీం స్వయంగా ప్రేక్షకుల ఇంటి వద్దకి వచ్చి వారితోనే టైటిల్ రివీల్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment