'జానకి కలగనలేదు' సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అమర్‌దీప్ చౌదరి బిగ్ బాస్‌తో మరింత పాపులర్ అయ్యాడు. సీజన్-7లో ఆయన రన్నర్‌గా నిలిచినా ప్రేక్షకుల్లో మాత్రం చెరిగిపోని ముద్రే వేశాడని చెప్పవచ్చు. టైటిల్ విన్నర్‌గా ఆట బరిలోకి దిగిన అమర్.. గెలవాలనే తపన, కోరిక ఎక్కువగానే కనిపించినా అప్పుడప్పుడు అతనిలోని కోపం కంట్రోల్ తప్పడంతోనే రన్నర్‌గా మిగిలాడని చెప్పవచ్చు. బిగ్ బాస్‌తో వచ్చిన గుర్తింపుతో ఇప్పటికే చాలా మంది మరో అడుగు ముందుకేసి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్ సోహైల్ ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా మెప్పిస్తున్నాడు. ఫిబ్రవరి 2న బూట్‌కట్ బాలరాజు సినిమా కూడా విడుదల కానుంది.
తాజాగా అమర్‌దీప్ చౌదరి కూడా హీరోగా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. ఆయన గతంలోనే ‘ఐరావతం’ అనే సినిమాలో కనిపించిన విషయం తెలసిందే. ఇందులో ప్రముఖ మోడల్ తన్వీ నేగితో పాటు ఎస్తేర్ నొరోహా కీలక పాత్రలో కనిపించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అమర్ నుంచి మరోక సినిమా వస్తుందని అఫీషియల్‌గానే ప్రకటన వచ్చేసింది. M3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో వినోద్ కుమార్‌తో పాటు రాజా రవీంద్ర వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత
అమర్‌దీప్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక చాలా క్రేజీగా ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్‌లో సీనియర్ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. వెండితెరపై అడుగుపెట్టకుండానే ఈ బ్యూటీకి భారీగానే పాపులారిటీని సంపాదించుకుంది.. సుప్రీతకు హీరోయిన్ కావాల్సినన్ని అర్హతలు కూడా ఆమెలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి 8 లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన అమ్మగారితో కలిసి చేస్తున్న రీల్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment