Aadhi Pinisetty Announced His Next Movie In Kollywood - Sakshi
Sakshi News home page

Aadhi Pinisetty : కాంతార తరహాలో.. ఆది పినిశెట్టి హీరోగా కొత్త చిత్రం

Published Sun, May 21 2023 7:44 AM | Last Updated on Sun, May 21 2023 10:33 AM

Aadhi Pinisetty Announces New Movie In Kollywood - Sakshi

నటుడు ఆది పినిశెట్టి తమిళంలో కథానాయకుడిగా నటించి చాలా కాలం అయ్యింది. ఈయన ఇటీవల విలనిజం ప్రదర్శించేందుకే మొగ్గుచూపుతున్నారు. అలా ఇటీవల ది వారియర్‌ వంటి కొన్ని చిత్రాల్లో నటించి దుమ్ము రేపారు. కాగా తాజాగా ఒక తమిళ చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ఎంపీ.గోపి దర్శకత్వం వహించనున్నారు.

ఈయన ఇంతకు ముందు మలైయన్‌, వేల్‌ మురుగన్‌ బోరింగ్‌ వెల్స్‌ చిత్రాలను తెరకెక్కించారు. కాగా తాజాగా ఇటీవల విడుదలై కన్నడతో పాటు దక్షిణాది భాషల్లోనూ సంచలన విజయాన్ని సాధించిన కాంతార చిత్రం తరహాలో గ్రామ దేవత ఇతివృత్తంతో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్‌ 

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని దర్శకుడు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే ఇది కమర్షియల్‌ అంశాలతో కూడిన యాక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement