
అనుష్క 'సైజ్ జీరో'
వరుస చిత్రాలతో తీరికలేకుండా ఉన్న టాలీవుడ్ హీరోయిన్ అనుష్క...మరో సినిమాకు రెడీ అయిపోయింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం నిర్వహిస్తున్న ఓ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించనున్నారు. పీవీపీ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రానికి 'సైజ్ జీరో' అని పేరు పెట్టారు. ఇందులో ప్రధాన తారగణంగా అనుష్క, తమిళ నటులు ఆర్యా, భరత్, ఊర్వశి నటిస్తుండగా మరో ముఖ్య అతిథి పాత్రలో శృతిహాసన్ మెరవనుంది.
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కథా రచనను ప్రకాశ్ సతీమణి కనికా థిల్లాన్ అందించారు. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశాన్ని రాఘవేంద్రరావు సోమవారం దర్శకత్వం వహించగా...కెమెరా ప్రసాద్ వి పోట్లురి స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.