కెప్టెన్‌ లాల్‌ | A New Journey Begins Barroz Guardian Of D' Gama Treasure | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ లాల్‌

Published Thu, Apr 25 2019 2:39 AM | Last Updated on Thu, Apr 25 2019 2:39 AM

A New Journey Begins Barroz Guardian Of D' Gama Treasure - Sakshi

స్క్రీన్‌ మీద విభిన్న పాత్రలు పోషించిన విలక్షణ నటుడు మోహన్‌లాల్‌. యాక్టర్‌గా 25 ఏళ్ల ప్రయాణం తర్వాత ఓ కొత్త పాత్ర పోషించడానికి రెడీ అయ్యారు. అయితే ఈ రోల్‌ స్క్రీన్‌ మీద కాదు ఆఫ్‌ స్క్రీన్‌. మోహన్‌లాల్‌ తొలిసారి మెగాఫోన్‌ పట్టి దర్శకుడిగా మారనున్నారు. ‘బారోజ్‌ – గార్డియన్‌ ఆఫ్‌ డి గామా ట్రెషర్‌’ అనే సినిమాలో నటించడమే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరిస్తారు.

  400 ఏళ్లుగా గోవాలోని వాస్కోడిగామ ప్రాంతంలో ఉన్న నిధిని కాపాడే సంరక్షకుడి కథ ఇది. జిజో పూన్నోస్‌ ఈ కథను రాశారు. కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ మోహన్‌లాల్‌ త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. ఈ సినిమాలో ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టులు కనిపిస్తారట. మోహన్‌లాల్‌ కొత్త చిత్రం ‘ఇట్టిమణి – మేడ్‌ ఇన్‌ చైనా’ షూటింగ్‌ బుధవారం స్టార్ట్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement