
కాలు నిలవడంలేదు: ఆలియా భట్
ముంబై: అతడి వయసేమో 50 ఏళ్లు. అందులో సగం.. అంటే కనీసం పాతికేళ్లు కూడా నిండలేదు ఆమెకు. కానీ అతనితో ఎప్పుడెప్పుడు స్టెప్పులేస్తానా.. అని ఆశగా ఎదురు చూస్తున్నానంటోంది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్. 'బాద్ షా' షారూఖ్ ఖాన్ తదుపరి సినిమాలో హీరోయిన్గా ఖరారు కావడం అంతులేని ఆనందాన్ని కలిగిస్తున్నదని, షూటింగ్ ప్రారంభమయ్యేదాకా ఆగలేకపోతున్నాని, కాలు నిలవడంలేదంటూ ఆలియా బుధవారం ట్వీట్ చేసింది.
తన ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానంపై గతంలో విమర్శలు ఎదుర్కొన్న దృష్ట్యా ఇకపై ఆ భాషతో సమస్యలు తీరిపోయినట్లేనని ఆలియా భావిస్తున్నది. ఎందుకంటే కొత్త సినిమాను డైరెక్ట్ చేయబోయే గౌరీ షిండే.. గతంలో శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ సినిమా 'ఇంగ్లీష్- వింగ్లీష్' తో మంచి పేరుతెచ్చుకుంది.
ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా తర్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. షారూఖ్ కే చెందిన రెడ్ చిల్లీస్, హోప్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సహసమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు మరో ట్వీట్ ద్వారా తెలిపారు దర్శకనిర్మాత కరణ జోహార్.
Will no longer have any problem with my English Vinglish.. can't wait to be directed by Gauri Shinde with the man himself Shahrukh Khan!!!
— SHAANDAAR Alia (@aliaa08) August 19, 2015