Raj Tarun's upcoming movie 'Thiragabadara Saami' launches - Sakshi
Sakshi News home page

Raj Tarun : 'యజ్ఞం' డైరెక్టర్‌తో రాజ్‌తరుణ్‌ కొత్త సినిమా ఆరంభం

Published Fri, Dec 2 2022 3:18 PM | Last Updated on Fri, Dec 2 2022 3:37 PM

Raj Tarun New Movie Tiragabadara Swami Launches - Sakshi

యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి హిట్‌ చిత్రాల ఫేమ్‌ ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరా సామి’ అనే సినిమా ఆరంభమైంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష ఎంటర్‌టైన్మెంట్‌ మీడియాపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎస్‌ రామారావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. మరో నిర్మాత పోకూరి బాబూరావు స్క్రిప్‌్టను ఏఎస్‌ రవికుమార్‌కి అందించారు.

‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, దర్శకులు వీరశంకర్, రాజా వన్నెం రెడ్డి, నిర్మాతలు టి.ప్రసన్న కుమార్, బెక్కెం వేణుగోపాల్, డీయస్‌ రావు, నటి–నిర్మాత జీవితా రాజశేఖర్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌ రెడ్డి, సంగీతం: జేబీ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. బెక్కెం రవీందర్‌. తిరగబడరా సామి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement