
సంజయ్ రామస్వామి.. అంటున్న అలీ
దశాబ్ధాలుగా టాలీవుడ్లో సక్సెస్ఫుల్ కమెడియన్గా కెరీర్ను కొనసాగిస్తున్న నటుడు అలీ. కొన్ని సినిమాల్లో హీరోగా అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ.. ఆ పాత్రలకే పరిమితం కాకుండా హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలీ తాజాగా మరోసారి హీరోగా కనిపించనున్నాడు. నాగు గవర దర్శకత్వంలో 'సంజయ్ రామస్వామి' అనే టైటిల్తో నవ్వించనున్నాడు. 'గతం గెలుక్కున్న గజిని' అనేది ఈ టైటిట్కు క్యాప్షన్. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
'గజిని' సినిమాలో హీరో సూర్య పేరు సంజయ్ రామస్వామి అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకు స్పూఫ్గా.. అలీ మార్క్ ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఈ చిత్రం ఉండబోతుందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. 2013లో అలీ హీరోగా వచ్చిన 'అలీబాబా ఒక్కడే దొంగ' సినిమా తర్వాత తిరిగి ఈ సినిమా ద్వారా హీరోగా మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు.