వెంటనే స్టెప్పేశా | Amyra, Prabhudeva team up for a psychological thriller | Sakshi
Sakshi News home page

వెంటనే స్టెప్పేశా

Published Fri, Nov 23 2018 12:13 AM | Last Updated on Fri, Nov 23 2018 12:13 AM

Amyra, Prabhudeva team up for a psychological thriller - Sakshi

అమైరా దస్తూర్‌

‘అవకాశం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా చాన్స్‌ మిస్‌ చేసుకుంటాం’ అని అంటున్నారు అమైరా దస్తూర్‌. ధనుశ్‌ సరసన నటించిన ‘అనేకుడు’ (డబ్బింగ్‌) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమైరా.. స్ట్రయిట్‌ సినిమా ‘మనసుకు నచ్చింది’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఈ భామ ప్రభుదేవాతో నటించే చాన్స్‌ కొట్టేశారు. ప్రస్తుతం దర్శకుడు ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘కాదలై తేడి నిత్యానంద’ సినిమా చేస్తున్నారామె. ఆ సినిమా తర్వాత ప్రభుదేవా కీలక పాత్రధారిగా ఆదిక్‌ ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ తెరకెక్కించనున్నారు.

ఇందులో ప్రభుదేవాతో యాక్ట్‌ చేసే చాన్స్‌ వచ్చిందని ఎగై్జట్‌ అవుతున్నారు అమైరా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘కాదలై తేడి..’ సమయంలోనే ఈ సినిమా గురించి దర్శకుడు చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. ఇందులో భాగమవ్వాలని అనుకున్నాను. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తావా? అని ఆయనే అడిగారు. ప్రభుదేవా సరసన చాన్స్‌ వస్తే ఎవరు మిస్‌ చేసుకుంటారు? వెంటనే యస్‌ చెప్పాను. స్క్రిప్ట్‌పరంగా ఫస్ట్‌ హాఫ్‌లో సంప్రదాయంగా కనిపిస్తా. సెకండ్‌ హాఫ్‌లో చాలా బోల్డ్‌గా, సెక్సీగా కనిపిస్తాను. అలాగే ప్రభుదేవాగారితో కాబట్టి డ్యాన్స్‌ విషయంలో బాగా కేర్‌ తీసుకుంటున్నాను’’ అన్నారు అమైరా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement