గోపీచంద్ కొత్త సినిమా షురూ | Gopichand new film started | Sakshi
Sakshi News home page

గోపీచంద్ కొత్త సినిమా షురూ

Aug 22 2016 8:18 PM | Updated on Sep 4 2017 10:24 AM

గోపీచంద్ కొత్త సినిమా షురూ

గోపీచంద్ కొత్త సినిమా షురూ

హీరో గోపీచంద్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో మొదలయ్యింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హన్సిక, క్యాథరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

హీరో గోపీచంద్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో మొదలయ్యింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హన్సిక, క్యాథరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో గోపీచంద్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సుధాక‌ర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్గా ఈ చిత్రం రూపొందుతుందని చిత్ర నిర్మాత జె.భగవాన్ తెలిపారు. గోపీచంద్ కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా తెరకెక్కనుంది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్లో ఉన్న మాస్ యాంగిల్ను సరికొత్తగా ప్రెజెంట్ చేసేలా ఈ చిత్రం ఉంటుందట. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబలి), అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement