Hero gopichand
-
హీరో గోపిచంద్ ఫ్యామిలీ క్యూట్ ఫోటోలు
-
గోపీచంద్‌కు గాయం
కొత్త సినిమా కోసం ఇండియా–పాకిస్తాన్ బోర్డర్లో భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొంటున్నారు గోపీచంద్. అయితే బైక్ స్టంట్స్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ స్పై థ్రిల్లర్ రూపొందుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రాజస్తాన్‌లోని జైసల్మార్‌లో 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ షెడ్యూల్లో భాగంగా బైక్ చేజింగ్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వడంతో గోపీచంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ‘‘ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు’’ అని డాక్టర్లు పేర్కొన్నారని చిత్రబృందం తెలిపింది. స్వల్ప గాయాలు కావడంతో పెద్దగా విశ్రాంతి తీసుకోకుండానే షూటింగ్లో పాల్గొంటారట. వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
బాబాయ్ అనే పిలిచే వ్యక్తి ఇక లేరు: హీరో గోపీచంద్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు మృతి పట్ల హీరో గోపీచంద్ సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ‘ఒక రచయితగా, డైలాగ్ రైటర్‌గా తెలుగు సినిమాకి ఎంవీఎస్ హరనాథరావు అందించిన విశేషమైన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మా నాన్నగారికి మాత్రమే కాక నాకు కూడా హరనాథరావుతో మంచి సాన్నిహిత్యం ఉండేది. నేను ‘బాబాయ్’ అని పిలుచుకొనే వ్యక్తి నేడు మా మధ్య లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకొంటున్నాను.’ అని అన్నారు. కాగా హరనాథరావు గుండెపోటుతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన ప్రముఖ దర్శకుడు, హీరో గోపీచంద్ తండ్రి టీ కృష్ణ ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు వంటి అవార్డులు గెలుపొందిన సినిమాలకు కథ, మాటలు హరినాథరావు అందించారు. -
శ్రీవారి సన్నిధిలో 'గౌతమ్ నంద' టీం
-
శ్రీవారి సన్నిధిలో 'గౌతమ్ నంద' టీం
తిరుమల: ‘గౌతమ్ నంద’ చిత్ర యూనిట్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ తో పాటు పలువురు చిత్రయూనిట్ స్వామి సేవలో పాల్గొన్నారు. చిత్ర యూనిట్‌కు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్టు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా గోపీ చంద్ మాట్లాడుతూ డ్రగ్స్ ముద్ర నుంచి త్వరలోనే సినీ ఇండస్ట్రీ కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఎవరూ డ్రగ్స్ వాడినట్లు నిర్దారణ కాలేదన్నాడు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నాడు. గౌతమ్ నంద మూవీ సక్సెస్ కావాలని స్వామివారిని కోరుకున్నట్లు గోపీచంద్ చెప్పాడు. -
గోపీచంద్ కొత్త సినిమా షురూ
హీరో గోపీచంద్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో మొదలయ్యింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హన్సిక, క్యాథరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో గోపీచంద్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సుధాకర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్గా ఈ చిత్రం రూపొందుతుందని చిత్ర నిర్మాత జె.భగవాన్ తెలిపారు. గోపీచంద్ కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా తెరకెక్కనుంది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్‌లో ఉన్న మాస్ యాంగిల్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేసేలా ఈ చిత్రం ఉంటుందట. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబలి), అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
డబ్బింగ్ లో 'ఆక్సిజన్'
హీరో గోపీచంద్ తాజా చిత్రం 'ఆక్సిజన్' డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఏఎమ్ జ్యోతికృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబరులో ఆడియో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్.. అదే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్సిజన్‌లో గోపీచంద్ సరసన రాశి ఖన్నా, అను ఎమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో అలరించనున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్గా రూపొందుతున్న ఈ సినిమాపై గోపీచంద్ చాలా ఆశలు పెట్లుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. -
కాళహస్తిలో గోపీచంద్ దంపతులు పూజలు
శ్రీకాళహస్తి: హీరో గోపీచంద్ దంపతులు గురువారం కాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వహించారు. భార్య రేష్మి, కుమారుడితో కలిసి ఆయన పూజలు చేశారు. కాగా ఈ రోజు ఉదయం గోపీచంద్ దంపతులు వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ తన కుమారుడి పుట్టువెంట్రుకలు స్వామివారికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నట్టు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
వైద్యులు ఉచిత సేవలందించాలి: నటుడు గోపీచంద్
అబిడ్స్ (హైదరాబాద్): కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులు పేద, బడుగు వర్గాల కోసం ఉచితంగా వైద్య సేవలందించాలని సినీ హీరో గోపీచంద్ పేర్కొన్నారు. గత 18 ఏళ్లుగా వందలాది మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించి మందులు కూడా పంపిణీ చేస్తున్న ఉమేష్ చంద్రను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆదివారం అబిడ్స్ బొగ్గులకుంటలో ఉమా హార్ట్ కేర్ సెంటర్లో డాక్టర్ ఉమేష్ చంద్ర ఆధ్వర్యంలో కొనసాగిన 186వ ఉచిత హృద్రోగ వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. డాక్టర్ ఉమేష్‌చంద్ర మాట్లాడుతూ.. ప్రతినెలా ఉచితంగా వైద్యశిబిరాలు నిర్వహించి ఎంతో ఖరీదైన వైద్యసేవలు, మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈసీజీ, రక్త పరీక్షలు, బ్లడ్ షుగర్, ఇతర చెకప్‌లు కూడా ఉచితంగా చేయిస్తామని తెలిపారు. ప్రతినెలా 2వ ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా 200 మంది పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.