శ్రీవారి సన్నిధిలో 'గౌతమ్‌ నంద' టీం | goutam nanda movie unit in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సన్నిధిలో 'గౌతమ్‌ నంద' టీం

Published Wed, Jul 26 2017 12:08 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

శ్రీవారి సన్నిధిలో 'గౌతమ్‌ నంద' టీం

శ్రీవారి సన్నిధిలో 'గౌతమ్‌ నంద' టీం

తిరుమల: ‘గౌతమ్ నంద’ చిత్ర యూనిట్  బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ‍్వరస్వామిని దర్శించుకుంది. హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ తో పాటు పలువురు చిత్రయూనిట్ స్వామి సేవలో పాల్గొన్నారు. చిత్ర యూనిట్‌కు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్టు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.
 
ఈ సందర్భంగా గోపీ చంద్ మాట్లాడుతూ డ్రగ్స్ ముద్ర నుంచి త్వరలోనే సినీ ఇండస్ట్రీ కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఎవరూ డ్రగ్స్ వాడినట్లు నిర్దారణ కాలేదన్నాడు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నాడు. గౌతమ్ నంద మూవీ సక్సెస్ కావాలని స్వామివారిని కోరుకున్నట్లు గోపీచంద్ చెప్పాడు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement