తల్లీ కొడుకుల అనుబంధం | Sharwanand 30th Movie Completed Shooting | Sakshi
Sakshi News home page

తల్లీ కొడుకుల అనుబంధం

Published Wed, Nov 25 2020 1:26 AM | Last Updated on Wed, Nov 25 2020 1:27 AM

Sharwanand 30th Movie Completed Shooting - Sakshi

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ పూర్తయింది. శ్రీకార్తీక్‌ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ సినిమా శర్వానంద్‌ కెరీర్‌లో 30వ చిత్రం కావడం విశేషం. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రభు (‘ఖైదీ’ నిర్మాత) నిర్మించారు. రీతూ వర్మ కథానాయికగా నటించగా, నటి అక్కినేని అమల ఒక ముఖ్య పాత్ర చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సంభాషణలు రాయడం విశేషం.

‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకుల్లో శర్వానంద్‌కు అమితమైన ఫాలోయింగ్‌ ఉంది. అయితే ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులనే కాకుండా అటు యూత్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సంగీతం: జేమ్స్‌ బిజోయ్, కెమెరా: సుజీత్‌ సారంగ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement