జనవరిలో సెట్స్‌ పైకి మహేష్,కొరటాల సినిమా | Mahesh, Koratala film from January, 2017 | Sakshi
Sakshi News home page

జనవరిలో సెట్స్‌ పైకి మహేష్,కొరటాల సినిమా

Published Mon, Sep 19 2016 4:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

జనవరిలో సెట్స్‌ పైకి మహేష్,కొరటాల సినిమా

జనవరిలో సెట్స్‌ పైకి మహేష్,కొరటాల సినిమా

మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న కొరటాల శివ.. తాజాగా 'జనతా గ్యారేజ్' హిట్తో టాప్ డైరెక్టర్ల లిస్ట్లో చేరిపోయాడు. 'జనతా గ్యారేజ్' తో తారక్ కెరీర్లోనే పెద్ద హిట్ అందించిన కొరటాల తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడనేది అంతటా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్తో తన నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుందని కొరటాల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మరో సినిమాపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా గురించి కొరటాల శివ మాట్లాడుతూ.. మహేష్తో చేయబోయే రెండవ సినిమా కూడా శ్రీమంతుడులానే మంచి కథతో ఉంటుందన్నారు. అలాగే జనవరి నెలలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళుతుందని, మహేష్ ఇమేజ్‌కు సరిపడేలా ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని కొరటాల తెలిపారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement