
మహేష్‌బాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్న చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్‌రెడ్డి
విమానాశ్రయం(గన్నవరం): సినీ నటుడు మహేష్‌బాబుకు గురువారం చిరంజీవి, ప్రభాస్, దర్శక, నిర్మాతలు ఎస్‌ఎస్.రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్‌రెడ్డి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. 17వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మహేష్‌బాబుకు వీరంతా శుభాకాంక్షలు తెలియజేశారు. రొటీన్‌కు భిన్నంగా ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో వారు మహేష్‌బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ నిమిత్తం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సమయంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. వీరి సడన్ సర్‌ప్రైజ్‌తో మహేష్‌బాబు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment