రామ్​ చరణ్ స్టన్నింగ్ లుక్.. బాలీవుడ్ నటి ఫిదా | Katrina Kaif Likes Ram Charan Posts New Look cool pic in jeans and jacket | Sakshi
Sakshi News home page

Ram Charan New Look: కొత్త లుక్‌లో రామ్ చరణ్.. పిక్స్ వైరల్

Published Sun, Nov 27 2022 7:33 PM | Last Updated on Sun, Nov 27 2022 7:40 PM

Katrina Kaif Likes Ram Charan Posts New Look cool pic in jeans and jacket - Sakshi

రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఆర్‌సీ15'. డైరెక్టర్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పూర్తిస్థాయిలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆ సినిమా రూపొందిస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను దిల్​ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్​ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.

తాజాగా రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టన్నింగ్‌ లుక్‌లో ఉన్న పిక్స్ చెర్రీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'స్టిల్ ఇన్ థాట్స్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. చరణ్‌ లుక్‌ చూసి ఫిదా అయినా బాలీవుడ్ కత్రినా కైఫ్ లైక్ చేసింది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌లో షూట్‌లో ఉన్నా ఫోటోను కియారా అద్వానీ అతని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

కాగా.. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు ఎస్‌జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. కార్తిక్‌ సుబ్బరాజు ఈ చిత్రానికి కథ అందించగా.. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. జానీ మాస్టర్ ​కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రలో రామ్ చరణ్‌ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement