గేమ్ ఛేంజర్ వాయిదా.. దిల్‌ రాజు ఏమన్నారంటే? | Tollywood Producer Dil Raju Clarity On Movie Game Changer Postpone | Sakshi
Sakshi News home page

Dil Raju:‍ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వాయిదా.. దిల్‌ రాజు ఫుల్ క్లారిటీ!

Published Wed, Aug 28 2024 8:05 AM | Last Updated on Wed, Aug 28 2024 10:04 AM

Tollywood Producer Dil Raju Clarity On Movie Game Changer Postpone

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అ మూవీకి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

అయితే గత కొద్ది రోజులుగా గేమ్ ఛేంజర్ వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో దిల్‌ రాజు పలు వేదికలపై మాట్లాడుతూ క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ ఛేంజర్ వాయిదా పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాజాగా మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌ ఈవెంట్‌కు హాజరైన దిల్‌రాజు మరోసారి రిలీజ్‌ డేట్‌పై స్పందించారు. ఈ సినిమాను వాయిదా వేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది క్రిస్మస్‌కే సినిమా విడుదలవుతుందని వెల్లడించారు.

దిల్ రాజు మాట్లాడుతూ..' ఇప్పటికే గేమ్ ఛేంజర్ షూట్ కంప్లీట్ చేశాం.  ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ సినిమా శంకర్‌ సర్‌, రామ్‌చరణ్‌ ఇమేజ్‌ను మార్చేస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఇది రాజకీయాలు, సామాజిక కథాంశంగా తెరకెక్కించాం. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. శంకర్ ఇంతకుముందు ఇలాంటి సినిమా చేశారు. కానీ రోబో తర్వాత తన కథా శైలిని మార్చారు. చాలా కాలం తర్వాత గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటాయి. సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ ఏడాది క్రిస్మస్‌కు అమిర్ ఖాన్‌ 'సితారే జమీన్ పర్' కూడా విడుదల కానుంది. అంతేకాకుండా డిసెంబర్‌ 20న హాలీవుడ్ చిత్రం 'ముఫాసా: ది లయన్ కింగ్', వరుణ్ ధావన్ మూవీ 'బేబీ జాన్' వరుసలో ఉన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement