
హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్
అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధ వంటి చిత్రాలతో యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి.. నితిన్ హీరోగా కొత్త చిత్రాన్ని తీయనున్నారు. 14 రీల్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా గురువారం ఉదయమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
త్రివిక్రమ్ 'అఆ' సినిమా విజయం తర్వాత నితిన్.. ఆ స్థాయికి తగ్గ సినిమా చేయాలన్న ఆలోచనతోనే కొంత గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. నితిన్ ఇమేజ్‌కి సరిపోయేలా తన స్టైల్లో హను రాఘవపూడి రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలో చిత్ర యూనిట్ పూర్తి వివరాలను వెల్లడించనుంది.