
నా సినిమాలో దావూదే స్వయంగా నటిస్తున్నాడు!
సోషల్ మీడియాలో తన సినిమాలకు ఎలా పబ్లిసిటీ తెచ్చుకోవాలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా తెలుసు. ఎప్పుడూ ఏదో కామెంట్ చేస్తూ లైమ్ లైట్‌లో ఉంటూనే అవసరమైనప్పుడు తన సినిమాలకు దండిగా పబ్లిసిటీ తెచ్చుకుంటాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. తాజాగా తన సినిమా 'గవర్నమెంట్' విషయంలోనే ఇదే ట్రిక్ ప్లే చేశాడు వర్మ. మాఫియా డాన్లు దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ మధ్య బద్ధ శత్రుత్వం నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో దావూద్ పాత్ర పోషించడానికి సరైన నటుడు దొరికాడంటూ వర్మ తాజాగా ట్వీట్ చేశాడు. అయితే నటుడు దొరికానడం అబద్ధమని, స్వయంగా దావూదే ఈ సినిమాలో పాత్ర పోషించడానికి ముందుకొచ్చాడని మరో ట్వీట్ ట్విస్ట్ ఇచ్చాడు. చివరకు చేసిన ఇంకో ట్వీట్‌లో అబ్బే దావూద్ ఇబ్రహీం మా సినిమాలో స్వయంగా నటించడం అబద్ధం అంటూ మరో మెలిక పెట్టాడు. మొత్తానికి 'గవర్నమెంట్' సినిమాలో కీలకమైన దావూద్ పాత్ర కోసం సరిగ్గా సరిపోయే నటుడు దొరికాడని చెప్పకనే చెప్పాడు వర్మ.