
రాధికా ఆప్టే
సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. బాలీవుడ్ స్టార్స్ అయితే సినిమా ప్రమోషన్స్ కోసం నెలకుపైనే సమయాన్ని వెచ్చిస్తుంటారు. అయితే ప్రమోషన్ చేయడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయలేను అంటున్నారు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘బొంబేరియా’. ఈ సినిమాలో రాధికా ఆప్టే పీఆర్ (పబ్లిక్ రిలేషన్) ఏజెంట్‌గా పాత్ర చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ – ‘‘హీరోయిన్‌గా రోజూ చాలా మంది పీఆర్‌లతో జర్నీ చేస్తుంటాం.
వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమాలో చేసిన పాత్ర తర్వాత తెలుసుకున్నాను. ఏదైనా పని చేయించుకోవడానికి వాళ్లు చాలా మంది ఈగోని సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఎంతో మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో కీలక భాగమై ఉంటారు. ప్రమోషన్స్ చేసే విషయానికి వస్తే.. నేను ఎంజాయ్ చేయలేని పని ఏదైనా ఉందంటే అది సినిమా ప్రమోషన్సే. నటిగా నా సినిమాలను నేను ప్రమోట్ చేయాలి.. అది నా బాధ్యత. కానీ ఆ పనిని ఎంజాయ్ చేయలేను. సినిమా షూటింగ్ చేయడమో, చేయబోయే క్యారెక్టర్‌ని ఇంకా బాగా స్టడీ చేయడమో లాంటి పనులను బాగా ఇష్టపడతాను’’ అని పేర్కొన్నారు రాధికా ఆప్టే.
Comments
Please login to add a commentAdd a comment