Vijay Kumar Reddy
-
ఆలోచనాత్మకం.. 'వసంత రాజీయం!'
పల్నాడు: ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నాటకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాలుగా ఉన్న నాటికలు, నాటకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ నటీనటుల నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. నటవిశ్వరూపం ‘నర్తనశాల’ ఇది మహాభారతం విరాట పర్వంలోని పాండవుల అజ్ఞాతవాస కథ. సీ్త్ర వ్యామోహంలో పడి అధర్మ మార్గాన నడిచే వారందరికీ అథఃపతనం తప్పదు. న్యాయమార్గాన నడిచేవారందరికీ ధర్మమే దైవమై నిలిచి కాపాడుతుందని ఈ నాటకం సందేశమిచ్చింది. రంగకృష్ణయ్య రచనకు, అర్జునరావు దర్శకత్వం వహించారు. ఆలోచింపజేసిన ‘మూడు ప్రశ్నలు’ నేటి బాలల చదువుల తీరును ప్రశ్నించింది ఈ నాటిక. తల్లిండ్రులు ర్యాంకులు, మార్కులు అంటూ బాల్యాన్ని నలిపేస్తూ అనవసర పుస్తకాల మోతతో పిల్లలను మానసికంగా, శారీరకంగా బాధలకు గురి చేస్తున్న తీరును ప్రశ్నించి చదువుల తీరు తెన్నులను మార్చాలని చెప్పిన నాటిక ఇది. రచన ఆకురాతి భాస్కర చంద్ర, దర్శకత్వం వాసు. యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారు ప్రదర్శించారు. నాన్న ప్రాధాన్యతను చాటిన ‘ఇంద్రప్రస్థం’ ప్రేమ అనేది సృష్టిలో గొప్పదే, కానీ, ఆ ప్రేమలు ఆనందించే విధంగా ఉండాలే తప్ప అనాలోచితంగా పరుగెడితే జీవితంలో విలువలు నాశనం అవుతాయని తెలియ జెప్పిందీ నాటకం. ఆదర్శవంతమైన తండ్రి తన బిడ్డల పెళ్లి విషయంలో ఎలా నడుచుకోవాలో నాటకంలో కనిపించింది. నాన్న ఉంటేనే ఏ ఇల్లు అయినా ‘ఇంద్రప్రస్థం’లా వెలిగిపోతుందని తెలియజెప్పటమే నాటక ప్రధాన ఉద్దేశం. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ప్రదర్శన ఇది. స్నిగ్ధ రచనకు ఎన్.రవీంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ధర్మనిరతిని చాటిన ‘మహాభినిష్క్రమణ’ రామాయణ కథలో శ్రీరాముడి అవతార పరిసమాప్తికి సంబంధించిన కథలను తీసుకుని నాటికగా మలిచారు. ఈ కథా సారాన్ని చక్కగా నాటికగా ప్రదర్శించి తమ్ముడైనా ధర్మం తప్పని శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని ఈ నాటిక ప్రకటించింది. ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ తెనాలి వారి ప్రదర్శన ఇది. ఆరాధ్యుల తేజస్వీ ప్రఖ్య రచనకు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వం వహించిన యువ కళాకారుల పౌరాణిక నాటిక ఇది. సందేశం, హాస్యం.. ‘పక్కింటి మొగుడు’ భార్యాభర్తలు సఖ్యతగా ఉంటేనే తమ ఆస్తి మనవడికి దక్కుతుందని, లేకుంటే ఆస్తంతా ఒక ఆశ్రమానికి చెందేలా వీలునామా రాసి కన్నుమూస్తారు ఓ తాత, బామ్మ. వీలునామాలో చూపిన రూ.రెండు కోట్ల ఆస్తిని కాపాడే క్రమంలో పడే కష్టాన్ని, సందేశం, హాస్యం రంగరించి ప్రదర్శించిన ఈ నాటిక ఆకట్టుకుంది. పండు క్రియేషన్స్ కొప్పోలు వారి ప్రదర్శన ఇది. రచన రామినేని నాగేశ్వర రావు, దర్శకత్వం బాలినేని నాగేశ్వరరావు వహించారు. ప్రేమ కావ్యం.. ‘వసంత రాజీయం’ వసంతోత్సవాలలో నాట్యం చేసి రాజును మెప్పించి రాజనర్తకి అవుతుంది లకుమ. లకుమ నాట్యం భూమికగా ‘వసంత రాజీయం’ నాట్యశాస్త్ర గ్రంథం రాస్తూ ఆమె ప్రేమలో పడతాడు రాజు. ఆమె రాజును ప్రేమిస్తుంది. లకుమను అడ్డం పెట్టుకుని రాజును చంపాలని చూస్తుంటాడు గూఢచారి మహేంద్రుడు. రాజును చంపమని లకుమను ఒత్తిడి చేస్తాడు. మళ్లీ వసంతోత్సవాలలో వీరనాట్యం చేస్తూ తన్నుతాను పొడుచుకుంటుంది లకుమ. రాజు దుఃఖించి, మహేంద్రుని బంధించి, వసంతరాజీయం అంకితమీయగా తీసుకుని తృప్తిగా లకుమ కన్నుమూస్తుంది. జానపద కథాంశాన్ని చక్కగా నాటకంగా మలచి చూపారు. శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారు తడకమళ్ల రామచంద్రరావు రచనకు డాక్టర్ మారంరాజు రామచంద్ర రావు దర్శకత్వం వహించిన పద్య నాటకమిది. నంది నాటకోత్సవంలో నాటక ప్రదర్శనలను మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఆర్డీవో శ్రీకర్, తహసీల్దార్ సాంబశివరావు తిలకించారు. నేడు నంది బహుమతుల ప్రదానం.. నంది నాటక పోటీల బహుమతి ప్రదానం సభ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 23 నుంచి జరుగుతున్న నాటక పోటీల విజేతల వివరాలు ప్రకటించి, వారికి 73 స్వర్ణ, రజిత, కాంస్య నందులు ప్రదానం చేస్తారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, డాక్టర్ వైఎస్సార్ రంగస్థల పురస్కార గ్రహీతలకు అవార్డు ప్రదానం చేస్తారని తెలియజేశారు. ఇవి చదవండి: ఆణిముత్యాలు -
31 వరకు వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లైఫ్ టైమ్, వైఎస్సార్ అచీవ్మెంట్ 2023 పురస్కారాలకు దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియనున్నట్లు ఐ అండ్ పీఆర్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల తరహాలోనే ప్రజా సేవలో విశిష్ట సేవలను అందించి ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరిస్తుందని చెప్పారు. దరఖాస్తుదారులు తమ విజయాలు, సేవలపై ఒక పేజీకి మించకుండా సమాచారాన్ని ఇవ్వడంతో పాటు ఫోన్ నంబర్, ఈ–మెయిల్, చిరునామాలను పొందుపరచాలన్నారు. దరఖాస్తులను సంబంధిత విభాగాలతో పాటు, secy& political@ ap.gov. in మెయిల్‌కు పంపాలన్నారు. ప్రజా సేవలో విశిష్ట సేవలతోపాటు కళలు, సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సివిల్ సర్వీస్, స్పోర్ట్స్, తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు, గ్రామాల్లో, మురికివాడల్లో పనిచేస్తూ సరైన గుర్తింపు పొందని రాష్ట్రానికి చెందిన వ్యక్తుల్లో పొలిటికల్ ఎన్జీవోలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, చరిత్రలో పేరొందిన సంస్థలు, సంఘాలు దరఖాస్తుకు అర్హులని వివరించారు. -
అక్టోబర్‌లో నంది నాటకోత్సవాలు
సాక్షి, అమరావతి: నంది నాటకోత్సవాలను అక్టోబర్ నెలలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ తుమ్మా విజయ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో (రంగస్థల పురస్కారాలు) భాగంగా ఐదు విభాగాల్లో 73 అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సోమవారం విజయవాడ ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్లో నంది నాటకోత్సవాల నిర్వహణపై నాటక రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల లఘు నాటిక, కళాశాల లేదా యూనివర్సిటీ లఘు నాటిక (ప్లేలెట్స్) అనే ఐదు విభాగాల్లో అవార్డులు అందజేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చామని, అనంతరం వారం రోజులు దరఖాస్తుల ఉపసంహరణకు కేటాయించామని తెలిపారు. అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని నంది నాటకోత్సవాలకు వేదికగా ఎంపిక చేస్తామని తెలిపారు. ప్రదర్శితమైన నాటకాలకే అవకాశం రాష్ట్రవ్యాప్తంగా 2018 నుంచి 2022 వరకు వివిధ నాటక సమాజాల ద్వారా ప్రదర్శించిన నాటకాలను ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నట్టు విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంట్రీలను న్యాయ నిర్ణేతల ద్వారా పరిశీలించి తుది పోటీలకు 10 పద్య నాటకాలు, 6 సాంఘిక నాటకాలు, 12 సాంఘిక నాటికలు, 5 బాలల నాటికలు, 5 కళాశాల లేదా యూనివర్సిటీ యువత నాటికలను ఎంపిక చేస్తామన్నారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి వీటి సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. బాలలు, యువతకు సంబంధించిన నాటకాలకు సంబంధించి ఈ ఏడాది కొత్తగా ప్రదర్శించిన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రదర్శన, ఎంపిక సమయంలో నాటకరంగ కళాకారులుండే ప్రాంతానికే వచ్చి తమ జ్యూరీ బృందం పరిశీలిస్తుందన్నారు. సరికొత్త కథాంశాలతో మన సంస్కృతి సంప్రదాయాలను, మానవతా విలువలను, ఉన్నతమైన జీవనాన్ని ప్రతిబింబించే అంశాలకు కళాకారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చివరిసారిగా 2017లో నంది నాటకోత్సవాలు నిర్వహించామని, అనంతరం కరోనా విపత్కర పరిస్థితులతో నిర్వహించలేకపోయామన్నారు. కళాకారులకు ఆర్టీసి చార్జీల్లో రాయితీ ఇచ్చే విషయమై సంబంధిత విభాగంతో చర్చిస్తామన్నారు. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీఎం ఎంవీఎల్‌ఎన్ శేషసాయి, కళారాధన సమితి కార్యదర్శి రవికృష్ణ నంద్యాల, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడారు. సమావేశం అనంతరం ‘తెలుగు పద్యనాటక రంగం– సాంకేతికత–సమకాలీన అధ్యయనం’ అంశంపై ఆర్.నిరుపమ సునేత్రి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
AP: వర్కింగ్ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో యం.యస్ నెం.48ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే 31.03.2023న జీవో నంబర్ 38 జారీ చేసిన విషయం గుర్తుచేశారు. ఈ క్రమంలో కొత్తగా అక్రిడిటేషన్ కార్డును పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం క్రింద ప్రీమియం రూ.1,250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన డబ్బులు చెల్లించి 31.03.2024 వరకు లబ్ధి పొందాలని కమిషనర్ సూచించారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేయించుకున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డు జిరాక్స్ కాపీలను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని రెండవ ఫ్లోర్లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ, కమిషనర్ కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులు అయితే సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సిందిగా కమిషనర్ తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం ప్రీమియం రూ.2,500 కాగా ఇందులో జర్నలిస్టు వాటా రూ.1,250, ప్రభుత్వం వాటా రూ.1,250 అన్నారు. భార్య/భర్త, పిల్లలు, జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వం కార్పస్ ఫండ్‌ను నిర్వహిస్తూ జర్నలిస్టులు చేసిన వైద్య ఖర్చులను రీయింబర్స్ చేస్తుందని తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సదరు రీయింబర్స్ మెంట్ క్లెయిమ్స్ ను పథకం విధివిధానాలను అనుసరించి సెటిల్ చేస్తుందన్నారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ.2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) తరహాలో వైద్య సేవలు పొందవచ్చన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని, అదే విధంగా నిర్ధేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ పథకానికి వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా అదే విధంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కోరారు. ఆరోగ్యశ్రీ లో భాగంగా 2023-24 సంవత్సరానికిగాను వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీంను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో గతంలో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా వర్కింగ్ జర్నలిస్టులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవసరమైన వైద్య సేవలు పొందే వీలు కలుగుతుందన్నారు. ఈ పథకం అమలులో వర్కింగ్ జర్నలిస్టుల క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ హామీ మేరకు 104 హెల్ప్‌లైన్‌లో ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు కూడా వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగించుకోవాలని కొమ్మినేని విజ్ఞప్తి చేశారు. -
నిజాం రాజు.. తలవంచెన్ చూడు
‘‘1948 సెప్టెంబర్ 13.. తెల్లవారుజామున టెలిఫోన్ భీకరంగా మోగడంతో మేల్కొన్నాను. ఆర్మీ కమాండర్ ఇద్రూస్ అత్యవసర కాల్. రిసీవర్ ఎత్తకముందే అది భారత సైనికదళాల ఆగమనానికి సంబంధించినదై ఉంటుందని భావించా.. అది అదే. గడిచిన పావుగంటలో ఐదు విభిన్న సెక్టార్ల నుంచి భారత సైన్యం పెద్దసంఖ్యలో హైదరాబాద్ వైపు పురోగమిస్తున్నట్టు సమాచారం ఉందన్నాడు. అతను నాతో మాట్లాడుతుండగానే బీడ్, వరంగల్ ఔరంగాబాద్, విమానాశ్రయాలపై బాంబుదాడులు జరుగుతున్నాయి.. ఏం చేయాలని అడిగాడు. ఎలాగైనా అడ్డుకోవాలన్నాను. కానీ హైదరాబాద్ సైన్యాల నిస్సహాయ ప్రదర్శన, సాయం చేస్తుందనుకున్న పాకిస్తాన్ ప్రేక్షకపాత్ర, మా ఫిర్యాదుపై భద్రతా మండలి (యూన్ సెక్యూరిటీ కౌన్సిల్) జాప్యం..వెరసి హైదరాబాద్ కథ విషాదంగా ముగిసింది..’’ – హైదరాబాద్ స్టేట్ చివరి ప్రధాని లాయక్ అలీ ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ బుక్‌లో రాసుకున్న మనోగతమిది. (శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) ఆపరేషన్ పోలో.. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ భవిష్యత్తును మార్చేసింది. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాలతో, త్రివర్ణజెండాలతో రెపరెపలాడితే.. హైదరాబాద్‌లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయాలని నెహ్రూ, పటేల్ చేసిన విజ్ఞప్తులను నిజాం బుట్టదాఖలు చేయడంతో ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది. ఐదు రోజుల్లోనే అంతా పూర్తి నిజాం మెడలు వంచే లక్ష్యంతో 1948 సెప్టెంబర్ 13న భారత మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో మొదలైన ‘ఆపరేషన్ పోలో’ ఐదురోజుల్లోనే ముగిసింది. పశ్చిమాన షోలాపూర్–హైదరాబాద్, తూ ర్పున మచిలీపట్నం–హైదరాబాద్ రహదారి వెంట యుద్ధట్యాంకులు, తేలికపాటి స్టువర్ట్ టైప్ ట్యాంకులు, వాటి వెనక ఆయుధ వాహనాలు, పదాతిదళాలు దూసుకురాగా.. నిజాం సైన్యాలు, రజాకార్ల బృందాలు ఎక్కడా నిలువరించలేకపోయాయి. ముట్టడి ప్రారంభమైన తొలిరోజునే పశ్చిమం నుంచి వస్తున్న దళాలు నల్‌దుర్గ్‌ను స్వాధీనం చేసుకోగా.. తూర్పున మునగాల, సూర్యాపేట వరకు వశమ య్యాయి. సూర్యాపేట శివారులో మకాంవేసిన ని జాం సైన్యం.. 14వ తేదీన భారత సైన్యాలను అడ్డు కునేందుకు మూసీ వంతెనను పేల్చేసినా, తాత్కా లిక వంతెన నిర్మించుకున్న భారతసైన్యాలు మూసీ ని దాటాయి. భారత వాయుసేన పైనుంచి బాంబులువేస్తూ దారివేయగా.. పదాతిదళాలు నిజాం సైన్యాలను ఎదుర్కొంటూ ముందుకుసాగాయి. స్వేచ్ఛా వాయువులతో.. సెప్టెంబర్ 16 నాటికి నిజాంకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. ఆరోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్‌లాయక్ అలీ రేడియో స్టేషన్‌కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మర్నాడు, అంటే.. సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశంతో.. మీర్ ఉస్మాన్‌అలీఖాన్ స్వయంగా దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించా రు. దీనితో హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. జనమంతా భారత జాతీయజెండాలతో హైదరాబాద్ నగరాన్ని త్రివర్ణమయం చేశారు. రజాకార్ల అధ్యక్షుడు ఖాసీంరజ్వీని అరెస్ట్‌చేసి జైల్లో పెట్టగా.. ప్రధాని లాయక్ అలీని గృహ నిర్బంధం చేశారు. ఆయన రెండేళ్ల తర్వాత తప్పించుకుని పాకిస్తాన్ చేరాడు. ఖాసీం రజ్వీ 1958లో జైలు నుంచి విడుదలై పాకిస్తాన్లో స్థిరపడ్డాడు. నిజాం గుండెల్లో నిదురించిన గెరిల్లా.. ‘‘కట్ట బట్ట, తిన తిండి, పొట్టనక్షరం ముక్కలేనివాడు. వెట్టిచాకిరీకి అలవాటుపడ్డవాడు. ఎముకల గూడు తప్ప ఏమీ మిగలని వాడు.. దొరా నీ బాంచెన్ అన్న దీనుడు.. హీనుడు, దిక్కులేనివాడు.. తెలంగాణ మానవుడి సాహసోపేత సాయుధ పోరాటం ప్రపంచంలో ఓ కొత్త చరిత్ర’’.. నిజాం రాజ్యంలో సంస్థానాలు, జాగీ ర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, పటేల్, పట్వా రీ వ్యవస్థలు రైతుకూలీలను పీల్చి పిప్పిచేశాయి. నిజాంకు వ్యతిరేకంగా రైతుకూలీల సాయుధపోరు సొంత భూమి లేని సాదాసీదా జనం జీవితాంతం వెట్టిచేయాల్సిన పరిస్థితి. న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు పటేల్, పట్వారీల చేతుల్లో ఉండటంతో జనమంతా బాంచెన్ దొరా.. కాల్మొక్తా.. అంటూ బతికిన దుస్థితి. అయితే దేశ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, ఆంధ్ర మహాసభలు తెచ్చిన చైతన్యం సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసింది. ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రజాకార్ల ఆగ డాలపై.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జనం తిరుగుబాటు మొదలైంది. భారత సైన్యాలను ఎదుర్కొనేందుకు రజాకార్లకు తర్ఫీదునిస్తున్న ఖాసీంరజ్వీ 1946 జూలై 4న అప్పటి నల్లగొండ జిల్లా కడవెండిలో విసునూరు దేశ్‌ముఖ్ ఇంటిమీదుగా వెళ్తున్న జులూస్పై దేశ్ ముఖ్ పేల్చిన తూటాలకు దొడ్డి కొమురయ్య హతమయ్యాడు. అది తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటానికి నాంది పలికింది. 4వేల మంది రక్తతర్పణతో 3వేల గ్రామాలు కమ్యూనిస్టుల ప్రజారక్షక దళాల అధీనంలోకి వెళ్లాయి. భారత ఉపప్రధాని వల్లభ్‌బాయ్‌పటేల్ ముందు లొంగిపోతున్న ఉస్మాన్‌అలీఖాన్ ఇదీ హైదరాబాద్ స్టేట్ ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఉస్మానాబాద్, కర్ణాటకలోని రాయచూర్, బీదర్, గుల్బర్గా (కలబుర్గి), తెలంగాణతో కలిపి మొత్తం 83 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో.. దేశంలోనే అతిపెద్ద సంస్థానంగా ఉండేది. నిజాం.. ప్రపంచ కుబేరుడు మీర్ ఉస్మా న్ అలీఖాన్.. హై దరాబాద్ స్టేట్ విలీనం నాటికి ప్రపంచ ధనవంతుల్లో నంబర్‌వన్. 1937 ఫిబ్ర వరిలో టైమ్ మేగజైన్ అలీఖాన్ కవర్‌పేజీతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లోనే నిజాం సంపద విలువ రూ. 660 కోట్లుగా పే ర్కొంది. గోల్కొండ వజ్రాల గనులతో పాటు వివిధ సంస్థానాల నుంచి వచ్చే ఆదాయాలతో ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ కుబేరుడయ్యాడు. జాకబ్ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా వాడేవాడు. ఉస్మాన్‌అలీఖాన్ ధరించిన.. విలువైన రాళ్లు పొదిగిన ఈ కత్తి విలువ అప్పట్లోనే 2 లక్షల డాలర్లు ఆయనకు హైదరాబాద్ చుట్టూరా 23 వేల ఎకరాల (సర్ఫెకాస్) భూములతోపాటు దేశంలోని వి«విధ ప్రాంతాల్లో 600కుపైగా విల్లాలు, విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే చౌమహల్లా, ఫలక్‌నుమా, చిరాన్‌పోర్ట్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్ ప్లజెంట్ విల్లాలు ఉస్మాన్‌అలీఖాన్ సొంతం. 173 రకాల బంగారు, వజ్రాభరణాలతో నిజాం ఖజానా ఉండేది. ఉస్మాన్ అలీఖాన్ కుటుంబం: లొంగుబాటుకు ముందు కుమారులు, కోడళ్లతో ఉస్మాన్ అలీఖాన్ ఎవరీ నిజాంలు? 1724లో స్వతంత్రుడిగా ప్రకటించుకున్న ఖమ్రుద్దీన్‌ఖాన్ దక్కన్లో అసఫ్‌జాహీ రాజ్యానికి నిజాం కాగా, 1948 సెస్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయిన ఉస్మాన్ అలీఖాన్ చివరివాడు. భారత్‌లో విలీనం అనంతరం ఉస్మాన్ అలీఖాన్ ఏటా రూ.50 లక్షల రాజభరణం పొందుతూ 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఉస్మాన్ అలీఖాన్ మనవళ్లు ముఖర్రం జా, ముఫకం జా లండన్‌లో స్థిరపడి.. ఏటా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కుటుంబమిదీ.. భార్య: ఆజం ఉన్నీసాబేగం కుమారులు: ఆజం జా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం ఆజంజా కుటుంబం: భార్య దుర్రేషెవార్(టర్కీ), వారసులు ముఖర్రం జా, ముఫకం జా మౌజంజా కుటుంబం: భార్యలు నిలోఫర్ (టర్కీ), రజియాబేగం, అన్వరీబేగం. వారసులు ఫాతిమా, ఫాజియా అమీనా, ఓలియా, శ్యామత్ అలీఖాన్ -
అమ్మ ఒడి, వాహన మిత్ర రద్దు ప్రచారం పూర్తిగా అవాస్తవం
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2022 ఏడాదికి గాను ప్రభుత్వం రద్దు చేసిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో ఈ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటువంటి శాఖ అసలు మనుగడలోనే లేదని పేర్కొన్నారు. ప్రజల్లో గందరగోళం నెలకొల్పి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటమే లక్ష్యంగా ఇలాంటి ఫేక్ వార్తలను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపైనా, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి దుష్ప్రచారం చేసే వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
నల్లకుంటలో పాతనేరస్తుడి అరెస్ట్
న్యూనల్లకుంట పరిధిలోని బాయమ్మ గల్లీ ఆర్చి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయ్ కుమార్ రెడ్డి అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 3.6 తులాల బంగారు, 12.7 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇతను 15 కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు. ఈయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కాగా..ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి మండలం దుర్గానగర్‌లో ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఊహించని మలుపులతో...
సుధీర్‌బాబు కొత్త చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. శ్రీరామ్ ఆదిత్యను దర్శకునిగా పరిచయం చేస్తూ, విజయ్‌కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వామికా గబ్బి కథానాయిక. ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ కృష్ణ మూడో కుమార్తె ప్రియదర్శిని కెమెరా స్విచాన్ చేయగా, రెండో కుమార్తె మంజుల క్లాప్ ఇచ్చారు. పెద్ద కుమార్తె పద్మావతి గౌరవ దర్శకత్వం వహించారు. మంజుల భర్త సంజయ్ స్వరూప్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ - ‘‘పలు లఘు చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య ప్రతిభ మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నా. కొత్త కథతో, ఊహించని మలుపులతో ఆసక్తికరంగా ఉంటూనే, వినోదాన్ని పంచే చిత్రమిది’’ అన్నారు. జూన్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఫ్రెష్‌గా అనిపించే కథా, కథనాలతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ గున్నాల-కార్తీక్, కెమెరా: శ్యామ్ దత్, సంగీతం: ఎం.ఆర్. సన్నీ. -
టీడీపీ నేతపై కత్తితో దాడి
కదిరి : నల్లచెరువు మండల టీడీపీ క న్వీనర్ దాదెం వెంకట శివారెడ్డిపై అదే పార్టీకి చెందిన ఎనుమలవారిపల్లి ఆదెప్ప కత్తితో దాడి చే యబోగా అడ్డువెళ్లిన ఆయన బావమర్ది విజయ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడి కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కదిరి నియోజకవర్గంలోని 57 చౌకధాన్యపు డిపో డీలర్ల ఎంపికకు రెండు రోజుల క్రితం కదిరి ఆర్డీఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు జరిగాయి. వీటిలో నల్లచెరువు మండలం కమ్మవారిపల్లి చౌక డిపో కూడా ఉంది. దీన్ని తొమ్మిదేళ్లుగా ఆదెప్ప తన కుమార్తె ప్రమీలమ్మ పేరు మీద నిర్వహించేవారు. కొత్త ఎంపికలో ఆ చౌకడిపోను ఈసారి వినికిడి లోపమున్న వికలాంగులకు రిజర్వ్ చేశారు. ఈ కోటాలో ఆ మండల టీడీపీ కన్వీనర్ వర్గీయుడైన రెడ్డెప్పరెడ్డి ఎంపిక దాదాపుగా ఖరారైందని తెలుసుకున్న ఆదెప్పకు కోపమొచ్చింది. మంగళవారం ఈ విషయమై మండల కన్వీనర్ శివారెడ్డితో గొడవకు దిగారు. బుధవారం మళ్లీ మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద అతను ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఆదెప్పతో పాటు మరికొందరు కత్తితో అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన శివారెడ్డి బావమర్ది విజయ్ కుమార్ రెడ్డి ఎడమ చేతికి బలమైన గాయం అయింది. గొడవ విషయం తెలుసుకుని కవరేజీ కోసం అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ విలేకరి ప్రవీణ్ కుమార్‌రెడ్డిపై జెడ్పీటీసీ సభ్యురాలి భర్త నాగభూషణం నాయుడు రాయితో దాడికి యత్నించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్ఐ మగ్బుల్ బాషా దృష్టికి తీసుకెళ్తే ‘ఏమయ్యా.. నీకు బుద్దుందా? ఎవరైనా దాడి జరిగేటప్పుడు ఫోటోలు తీయడానికి వస్తారా? ఇద్దరూ టీడీపీ వాళ్లే.. నువ్వు ఫోటోలు తీస్తే వారికి మండదా..’ అని తనదైన శైలిలో హితబోద చేశారు. ‘సార్..మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఎలాగైతే విధి నిర్వహణలో ఇక్కడికొచ్చారో.. నేనూ అలాగే న్యూస్ కవరేజ్ కోసం వచ్చాను. నన్ను చంపుతానన్న వ్యక్తిపై చర్య తీసుకోండి. అతను గతంలో కూడా పలుమార్లు విలేకరులపై ఇలాగే ప్రవర్తిస్తే అప్పట్లో పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు’ అని చెప్పి ఇదే విషయాన్ని ఫిర్యాదు రూపంలో రాసి అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ విలేకరి ఆ మండల పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. కత్తిపోట్లతో గాయపడిన విజయ్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ ‘మా మామ దాదెం వెంకటశివారెడ్డిపై అదెప్పతో పాటు మరో నలుగురు కత్తితో దాడి చేస్తుంటే నేను అడ్డుకున్నాను. టీడీపీ నాయకులు కొందరు ప్రోత్సహించడంతోనే ఆదెప్ప దాడికి దిగారు’ అని ఆరోపించారు. అయితే ఆదెప్ప కూడా తనపై దాడికి దిగారని కదిరి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్తే ‘ఎక్కడా ఒక్క గాయం కూడా లేదే’ అని చెప్పి వాపసు పంపారు. తనపై జరిగిన దాడిలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ‘సాక్షి’ విలేకరి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారని ఆయన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కనబరచడం కొసమెరుపు. -
నిండు కుండలా జలాశయాలు
తగ్గిన వరద ఉధృతి.. పెరిగిన సందర్శకుల తాకిడి తెరుచుకోని గేట్లు సాక్షి,సిటీబ్యూరో,రాజేంద్రనగర్/మణికొండ: కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో నిండు కుండలా తొణికిస లాడుతున్న హిమాయత్‌సాగర్ జలాశయానికి సోమవారం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా నిత్యం 11,500 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి చేరగా.. సోమవారం వరద ప్రవాహం 1100 క్యూసెక్కులకు తగ్గిందని జలమండలి ట్రాన్స్మిషన్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తాండూరు, పరిగి ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడంతోనే వరద తగ్గిందని చెప్పారు. దీంతో గేట్లు ఎత్తాలన్న యోచనను విరమించుకున్నామన్నారు. ఈసీ వాగు నీటి చేరికతో సాగర్ నీటిమట్టం 11 అడుగుల మేర పెరిగిందని తెలిపారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 1763.500 అడుగులకు గాను సోమవారం నాటికి 1755 అడుగులకు చేరిందన్నారు. గండిపేట్‌కు మూడు అడుగులు.. ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జలాశయం గరిష్ట నీటి మట్టం 1790 అడుగులకు కాగా, సోమవారం నాటికి 1772 అడుగులకు చేరింది. మూడు రోజులుగా ఈ జలాశయంలో మూసీ వాగు నీరు చేరుతుండటంతో నీటి మట్టం మూడు అడుగుల మేర పెరిగింది. చేవేళ్ల, వికారాబాద్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఈ జలాశయానికి వరద అంతగా లేదు. కాగా గండిపేట్ జలాశయం ఎగువన అక్రమార్కులు ఇసుక ఫిల్టర్ల ఏర్పాటు, కందకాలు తవ్వడం, ఫాంహౌస్‌లు, కళాశాలల రక్షణ గోడలు ఏర్పాటు కారణంగా వరద ఉధృతి తగ్గినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సింగూరు, మంజీరాకూ జలకళ కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాలు సైతం జలకళ సంతరించుకున్నాయి. గ తేడాదితో పోలిస్తే జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పెరిగాయి. సింగూరులో 1717.932 అడుగులకు గాను సోమవారం నాటికి 1703.167 అడుగుల మేర నీరు చేరింది. మంజీరా గరిష్ట మట్టం 1651.750 అడుగులకు గాను 1646.400 అడుగుల మేర నిల్వలున్నాయి. అక్కంపల్లి (కృష్ణా) జలాశయంలో 245 మీటర్ల గరిష్ట మట్టానికి 243.100 మీటర్ల మేర నిల్వలున్నాయి. నాగార్జున సాగర్ (నల్లగొండ) జలాశయంలో 590 అడుగుల నీటి మట్టానికి 552.700 అడుగుల మేర ఉన్నాయని జలమండలి తెలిపింది. భారీగా పెరిగిన సందర్శకులు జంట జలాశయాల గేట్లు తెరుస్తారన్న సమాచారంతో సోమవారం జంట నగరాల నుంచి భారీగా సందర్శకులు తరలి వచ్చారు. నిండు కుండల్లా మారిన జలాశయాల వద్ద సోమవారం ఆట విడుపుతో సందడి చేశారు. హిమాయత్ సాగర్‌లో సందర్శకులు పెరగటంతో కట్టపైకి వాహనాలను అనుమతించకుండా గేట్ల వద్దనే నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లి జలాశయం అందాలను వీక్షించారు.